ఎంపీ కేశినేని నాని ట్విటర్‌ వేదికగా మరోసారి స్పందించారు.

విజయవాడ: విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్విటర్‌ వేదికగా మరోసారి స్పందించారు. తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్‌  సమస్యల పరిష్కారానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్‌ చూపుతున్న చొరవను అభినందిస్తున్నట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు. కానీ..  అంటూ జగన్‌కు మరో ప్రశ్న సంధించారు. జగన్‌ ప్రతిదీ తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారా?లేక ఆంధ్రాకు పెండింగ్‌లో ఉన్న ప్రతిదీ సాధిస్తున్నారా? అంటూ ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు.
జల వివాదాలు, గోదావరి జలాల సమర్థ వినియోగం, విభజన సమస్యల పరిష్కారం కోసం  హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌ వేదికగా శుక్రవారం రెండు రాష్ట్రాల సీఎంల మధ్య కీలక సమావేశం జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిల సమావేశంలో జల వినియోగం దిశగా తొలి అడుగులు పడ్డాయి.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..