సూర్యపేట:ఇన్‌స్టాగ్రాంలో పరిచయం.. ఆ తర్వాత ప్రేమాయణం.

సూర్యపేట:ఇన్‌స్టాగ్రాంలో పరిచయం.. ఆ తర్వాత ప్రేమాయణం.. ప్రియుడి జల్సాల కోసం సొంత ఇంట్లోనే బంగారు నగల చోరీ.. రెండు నెలలుగా పోలీసుల విచారణలో పొరుగింటి వారిపై నిందలు. సెల్‌ఫోన్‌ కాల్‌ రికార్డ్సుతో బయటపడ్డ బండారమిది. సూర్యాపేటకు చెందిన ఓ యువతి తన తాత ఇంట్లో ఉంటూ స్థానికంగా ఎం.ఫార్మసీ చదువుతోంది. ఎనిమిది నెలల క్రితం యానాం ప్రాంతానికి చెందిన కర్రి సతీష్‌ అనే యువకుడితో ఇన్‌స్టాగ్రాంలో పరిచయం ఏర్పడింది. అనంతరం ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో సతీష్‌ యువతికి ఏం మాయమాటలు చెప్పాడో తెలియదు. కారు కొనుగోలు చేసేందుకు ఆ యువతి ఇంట్లోని బీరువాలో దాచిన సుమారు 20 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేసి అతనికి బహుమానంగా అందించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 14న యువతి తాత నగలు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పొరుగింటి వారిపై నిందలు
తమ ఇంట్లో అద్దెకు నివాసముంటున్న ఓ మహిళ చోరీ చేసి ఉంటుందని బాధితుడు పోలీసుల వద్ద అనుమానం వ్యక్తం చేశారు. విచారణలో ఆమె చోరీ చేయలేదని వారు నిర్ధారించుకున్నారు. ఇది ఇంటి దొంగల పనేనని భావించిన పోలీసులు ఆ దిశగా విచారించారు. మరోవైపు పోలీసు విచారణ వివరాలను ఎప్పటికప్పుడు యువతి తన ప్రియుడికి చేరవేస్తోంది. అతడు మాత్రం నగలను తాకట్టుపెట్టి వచ్చిన డబ్బులతో కారు కొనుగోలు చేసి జల్సాగా తిరుగుతున్నాడు. పోలీసులు పట్టుకోలేరన్న ధీమాలో ఇద్దరూ ఉన్నారు. ఒక వేళ పోలీసులు తమను గుర్తిస్తే కారును విక్రయించి అప్పటికప్పుడు బీరువాలో నగలు పెట్టి తప్పించుకోవాలని పథకం వేశారు. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సూర్యాపేట పట్టణ పోలీసులు కుటుంబ సభ్యుల సెల్‌ఫోన్‌ నంబర్లు తీసుకుని వారు తరచూ మాట్లాడుతున్న నంబర్లపై నిఘా వేశారు. ఇంటి యజమాని మనవరాలు యానాంకు చెందిన సతీష్‌తో మాట్లాడుతున్నట్లు గుర్తించి ఆ కోణంలో విచారణ చేపట్టారు. ఆదివారం సతీష్‌తోపాటు యువతిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వ్యవహారం బయటపడింది. ప్రేమికుడి జల్సాల కోసం ఇంట్లో నగలను చోరీ చేసిన యువతి వ్యవహారం పోలీసులను విస్మయానికి గురిచేసింది

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..