మోదీ తో భేటీ .....  ఇవాంకా ట్రంప్ వీడియో విశ్లేషణ



 : అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌, ప్ర‌ధాని మోదీ.. ఒసాకాలో జీ20 స‌ద‌స్సు సంద‌ర్భంగా ప్ర‌త్యేకంగా భేటీ అయిన విష‌యం తెలిసిందే.

5జీతో పాటు ఇత‌ర అనేక వాణిజ్య అంశాల‌పై వాళ్లు చ‌ర్చించుకున్నారు.

ఆ స‌మావేశంపై డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ కొన్ని విష‌యాల‌ను వెల్ల‌డించారు.

త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా ఓ వీడియోను పోస్టు చేశారు.

5జీ టెక్నాల‌జీ గురించి మోదీ, అబేల‌తో త‌న తండ్రి చ‌ర్చించిన‌ట్లు ఆమె చెప్పారు. జ‌పాన్ వెళ్లిన అమెరికా బృందంలో ఇవాంకా ఉన్నారు.


.........
మోదీ, ట్రంప్ 5జీ నెట్‌వర్క్ అభివృద్ధి, ఇరాన్, వాణిజ్యం, రక్షణ తదితర అంశాలపై చర్చించా రు.

ముఖ్యంగా 5జీ టెక్నాలజీ విషయంలో కలిసి పనిచేద్దామని ట్రంప్ ప్రతిపాదించారు.

త్వరలో మొబైల్ ఫోన్ల వినియోగదారుల సంఖ్య 100 కోట్లకు చేరడంతో భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మార్కెట్‌గా మారనున్నదని మోదీ పేర్కొన్నారు.

భారత్ నిర్ణయాలు ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తాయన్నారు.

ఈ నేపథ్యంలో భారత్‌లో 5జీ టెక్నాలజీ అభివృద్ధి, విస్తరణకు అమెరికా కంపెనీల సాయం తీసుకోవాలని ట్రంప్ కోరారు.

అదేసమయం లో చైనాకు చెందిన హువావేపై నిషేధం విధించాలని పరోక్షంగా సూచించారు.

భద్రతారీత్యా హువావే ఉత్పత్తులను అమెరికా నిషేధించిన సంగతి తెలిసిందే.

భారత్‌లో త్వరలో 5జీ ట్రయల్స్ చేపట్టనున్న నేపథ్యంలో హువావేను పక్కనబెట్టాలని అమెరికా కోరింది.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..