దేశంలో ఎక్కడున్నా రేషన్... ‘వన్ నేషన్-వన్ రేషన్ కార్డు’ వచ్చేస్తోంది..

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం త్వరలో 'వన్‌ నేషన్‌-వన్‌ రేషన్‌ కార్డు'' పథకాన్ని అమలు చేయనున్నది. ఈ పథకం అమలులోకి వస్తే లబ్ధిదారుడు దేశంలో ఎక్కడ నివసిస్తున్నా... అతనికి రేషన్ పొందే వీలుంటుంది. ఈ విషయమై గురువారం కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ సంబంధిత మంత్రులతో చర్చించారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆహార శాఖ కార్యదర్శులతోపాటు ఇతర ఉన్నతాధికారులు, ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌, స్టేట్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. 

దేశవ్యాప్తంగా ఉన్న రేషన్‌ షాపుల్లో ఉన్న పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పిఒఎస్‌)ను కేంద్ర బిందువుగా తీసుకుని ఈ పథకానికి రూపకల్పన చేసినట్లు పాశ్వాన్‌ తెలిపారు. 2030 వరకు దేశంలో పేదరికం నిర్మూలన చేయడమే తన లక్ష్యమన్నారు. 2013 లెక్కల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో 50 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 75 శాతం ప్రజలకు పాయింట్ ఆఫ్ సేల్... కింద తీసుకురావడానికి కేంద్ర సర్కారు కసరత్తు చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌, హర్యానావంటి రాష్ట్రాల్లోని రేషన్‌ షాపుల్లో పిఒఎస్‌లు అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని షాపుల్లో పిఒఎస్‌లు అందుబాటులో ఉంటేనే ఈ పథకాన్ని అమలుచేసే అవకాశముంటుందని ఆయన చెప్పారు. ప్రాథమికంగా వలస కార్మికులను లక్ష్యంగా కేంద్రం ఈ పథకం రూపొందించబడింది. ప్రజాపంపిణీ వ్యవస్ధలో అవినీతిని తగ్గించేందుకు కూడా ఇది సహాయ పడుతుంది. ఒక ప్రత్యేక ప్రాంతంలో, ఒక ప్రత్యేక డీలరుపైనే ఆధారపడే పరిస్థితిని ఇది నివారిస్తుంది. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ రేషన్‌ కార్డులు కలిగి ఉంటే వారి కార్డును తొలగిస్తారు. ఈ పథకం కింద లబ్ది దారుడు తనకు అందుబాటులో ఉన్న ఏ రేషన్‌ షాపు నుండైనా రేషన్‌ తీసుకునే అవకాశం కల్పిస్తుంది.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..