Posts

Showing posts from 2019

తెలంగాణపై కన్నేసిన బీజేపీ : రంగంలోకి ఆర్ఎస్ఎస్!

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా చెప్పుకుంటోన్న బీజేపీ.. ఇప్పుడు క్షేత్ర స్థాయిలో బలోపేతంపై దృష్టి పెట్టింది. కాకపోతే, బీజేపీని దేశవ్యాప్తంగా లిఫ్ట్‌ చేసిన ఆర్‌ఎస్‌ఎస్సే ఇప్పుడు తెలంగాణలో కూడా ఆ బాధ్యతను భుజానకెత్తుకుందని అంటున్నారు. అందుకే ఎప్పుడూ లేని విధంగా ఈసారి హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు విజయసంకల్ప శిబిర్ పేరుతో శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసిందంట ఆర్ఎస్‌ఎస్‌. ఈ కార్యక్రమానికి ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భగవత్‌తో పాటు ఇతర ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో బీజేపీని మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తారంటున్నారు. శిక్షణ తరగతుల నేపథ్యంలో మోహన్ భగవత్ మూడు రోజులపాటు హైదరాబాద్‌లోనే మకాం వేస్తారు. తెలంగాణలో సంఘ్ సిద్ధాంతాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి? తద్వారా రాష్ట్రంపై పట్టు సాధించేందుకు ఉన్న అవకాశాలు సంఘ్ పరివార్ కార్యకర్తలకు వివరిస్తారట. రాష్ట్రానికి చెందిన బీజేపీ ప్రముఖ నేతలంతా ఈ శిబిరంలో పాల్గొంటారు. అంతే కాకుండా 16వేల మంది సంఘ్ పరివార్ ముఖ్యనేతలు సైతం ఈ సమావేశాలకు హాజరవుతున్నారట. ముఖ్య నేతలు అంతా ఆర్ఎస్‌ఎస్‌ డ్ర

బంజారాహిల్స్‌లో భారీ చోరీ

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పనిమనిషి ఉన్నదంతా ఊడ్చుకుని పరారయ్యాడు. వివరాలు.. బంజారాహిల్స్‌ రోడ్‌ నం 12లోని అంకుర్‌ ఆస్పత్రి సమీపం లో వ్యాపారి కపిల్‌గుప్తా నివసిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు ఓ శుభకార్యానికి కుటుంబసభ్యులతో కలసి వెళ్లారు. తిరిగి సోమ వారం తెల్లవారుజామున 2.45 గంటలకు ఇంటికి వచ్చారు. ఇంటిలోకి వెళ్లిచూడగా బెడ్‌రూంలో బీరువా తాళాలు పగులగొట్టి ఉండటమే కాకుండా ఆభరణాల బాక్సులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. వెంటనే బంజారాహిల్స్‌ పోలీసులకు ఆయన సమాచారం ఇచ్చారు. తమ ఇంట్లో నెలన్నర క్రితం బిహార్‌కు చెందిన రామ్‌(29) అనే వ్యక్తిని పనిమనిషిగా నియమించుకున్నామని పోలీసులకు తెలిపారు. పెళ్లికి వెళ్తూ ఇంటి బాధ్యతలను పనిమనిషికి అప్పగించినట్లు పేర్కొన్నారు. ఇదే అదనుగా భావించిన రామ్‌ బీరువాలోని రూ.5.70 లక్షల నగదు, రూ.కోటి విలువ చేసే బంగారు వజ్రాభరణాలను చోరీ చేసి ఇంటికి తాళంవేసి తాళం చెవులను గేటు వద్ద పెట్టి ఉడాయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో కపిల్‌గుప్తా మేనల్లుడు ఇంటికి వచ్చి డ్రెస్‌

ఆర్టీసీ పై సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం

సమ్మె కాలంలో ఆర్టీసీ కార్మికులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్.. ఆ తరువాత వారిపై వరాలు కురిపించారు. ఆర్టీసీని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే... ఆర్టీసీ సమ్మె ముగియడంతో అధికార పార్టీలో కొత్త చర్చ మొదలైంది. ఆర్టీసీ సమ్మెకు ముందు సంస్థ చైర్మన్‌గా ఒకరిద్దరి పేర్లు చక్కర్లు కొట్టాయి. అయితే అంతలోనే ఆర్టీసీ సమ్మె మొదలుకావడం... అసలు సంస్థ ఉంటుందో లేదో అనే చర్చ మొదలుకావడంతో టీఆర్ఎస్‌లో ఆర్టీసీ చైర్మన్ గురించి పెద్దగా చర్చ జరగలేదు. అయితే తాజాగా మరోసారి ఆర్టీసీ చైర్మన్ పదవి అధికార పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. త్వరలోనే అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కీలకమైన కార్పొరేషన్ పదవులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్న సీఎం కేసీఆర్... ఆర్టీసీ చైర్మన్ పదవిని సీనియర్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. నిజానికి బాజిరెడ్డి గోవర్ధన్‌కు రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవి ఇస్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ పోస్టును పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇచ్చిన కేసీఆర్... బాజిరెడ్డికి కీలకమైన ఆర్టీసీ చైర్మన్ పదవి ఇవ్వాలని దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో పాటు

వెంకీ వర్సెస్ బాలయ్య 11వ సారి. ఈ సారి పైచేయి ఎవరిదో.!

తెలుగు చిత్రసీమలో ఆ ఇద్దరు అగ్రనటులు. అందులో ఒకరు మాస్ ఆడియన్స్ ని మెప్పించిన హీరో అయితే మరొకరు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకున్న హీరో. ఇలా క్లాస్, మాస్ హీరోలుగా పేరు తెచ్చుకున్న హీరోలు నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్. అయితే ఈ ఇద్దరు సీనియర్లు మధ్య పెద్ద పోటీ వాతావరణం ఉండదు కానీ.వీరు సినిమాలో పలు సార్లు బాక్సాఫీస్ బరిలో పోటీ పడ్డాయి. తాజాగా కూడా ఈ ఇద్దరు మరోసారి పోటీ పడబోతున్నారు. వెంకటేష్ 'వెంకీ మామ' చిత్రంతో వస్తుంటే, బాలయ్య 'రూలర్' సినిమాతో వస్తున్నారు. ఇక వీరు అంతకముందు బాక్సాఫీస్ బరిలో 10 సార్లు తలపడ్డారు. అయితే ఈ పది సార్లులో ఎవరు పై చేయి సాధించారో ఒక్కసారి చూస్తే.. మొదటిసారిగా వీరిద్దరు 1986లో పోటీ పడ్డారు. ఆ సంవత్సరం ఆగష్టు 7న 'దేశోద్ధారుకుడు' సినిమాతో వస్తే, వెంకటేష్ ఆగష్టు 14న 'కలియుగ పాండవులు' సినిమాతో వచ్చాడు. అయితే ఈ రెండు సినిమాలు మంచి విజయాలే సాధించాయి. ఇక రెండోసారి వెంకటేష్ 1987 మే8న 'అజేయుడు' సినిమాతో రాగా, అటు బాలయ్య మే12 'ప్రెసిడెంట్ గారి అబ్బాయి' సినిమాతో బాక్సాఫీస్ బరిలో దిగాడు. కాకపోతే ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యా

పదహేను సెకన్ల వీడియో చూశారా?

ట్వీట్టర్ లో కర్నూలు జిల్లాకు చెందని ఒక మహిళ పెట్టిన పదిహేను సెకన్లు వీడియో హల్ చల్ చేస్తుంది. 15 సెకన్లు వీడియో ఏకంగా లక్షల మంది షేర్ చేశారు. రీట్వీట్ చేశారు. జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి హాష్‌ ట్యాగ్ చేస్తున్నారు. ఒక్క గంటల్లోనే లక్షల మంది ట్వీట్లు చేశారు.. కొన్ని గంటల్లోనే వీడియో మొత్తం వైరల్ గా మారింది. సుగాలికి న్యాయం చేయాలని తల్లి చేసిన ట్వీట్ ఇప్పడు ట్వీట్టర్ ను ఊపేస్తుంది. దిశ కేసు ఏవిధంగా ప్రపంచ వ్యాప్తంగా ట్రెడింగ్ లోకి వచ్చిందో? ఈ వార్త కూడా కొన్ని గంటల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ట్రెండింగ్ లోకి వచ్చింది. అంతేగాకుండా దిశకు న్యాయం చేసిన విధంగా తన బిడ్డకు న్యాయం చేయాలని ఆ తల్లి కోరింది. కర్నూలులో ఒక స్కూల్ తన బిడ్డను అత్యాచారం చేసి చంపారని .. ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు తనకు న్యాయం జరగలేదని ట్వీట్టర్ లో పదిహెను సెకన్లు వీడియోను తల్లి పోస్టు చేసింది. ఇప్పడు ఇది ట్వీట్టర్ ఇదే హాట్ టాపిక్ గా మారింది. యజమాని కుమారులే. కర్నూలు నగర శివారులోని లక్ష్మీగార్డెన్‌లో ఉంటున్న ఎస్‌.రాజు నాయక్, ఎస్‌.పార్వతిదేవి దంపతుల కుమార్తె సుగాలి ప్రీతి(14) దిన్నెదేవరపాడు వద్దనున్న ఒక రాజకీయ నాయకుడికి చెందిన క

కన్న తల్లి కళ్ల ఎదురుగా... సామూహిక అత్యాచారం..ఒకే రోజు ముగ్గురు

దిశ ఘటనను ఇంకా దేశ ప్రజలు మరవనేలేదు. ఆమె అతి కిరాతకంగా హత్య చేసిన నిందితులు పోలీసుల చేతిలో హతమయ్యారు. ప్రస్తుతం దీనిపై కూడా వివాదం నడుస్తోంది. నిందితులపై పోలీసులు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పటికీ... మృగాళ్లలో కొద్దిగా కూడా మార్పు రాకపోవడం బాధాకరం. చాలా మంది మృగాళ్లు తమ అకృత్యాలను కొనసాగిస్తునే ఉన్నారు. తాజాగా... ఇలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఒకే రోజూ ముగ్గురు బాలికల పట్ల మానవ మృగాళ్లు అఘాయిత్యానికి పాల్పడ్డాయి. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.... ఇటీవల ఉత్తరప్రదేశ్ లో ఉన్నావ్ రేప్ ఘటన బాధితురాలు 48గంటలపాటు చావుతో పోరాడి ప్రాణాలు కోల్పోయింది. ఆ ఘటన మరవకముందే అదే రాష్ట్రంలో ఒకే రోజు ముగ్గురు బాలికలపై అఘాయిత్యం చోటుచేసుకుంది. 17ఏళ్ల బాలిక పై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అది కూడా బాలిక కన్న తల్లి ముందే జరగడం గమనార్హం. బాలిక తల్లి బదిర( మూగ, చెవుడు) కావడంతో... కూతురిని కాపాడుకోలేకపోయింది. కాగా... బాలిక తనపై జరిగిన దారుణాన్ని తట్టుకోలేక పురుగుల మందు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

నిర్భయ దోషి వినయ్ శర్మ తాజా చర్య విన్నంతనే ఒళ్లు మండేలా ఉంది.

కొన్నేళ్ల క్రితం నిర్భయ ఉదంతం దేశం మొత్తాన్ని దిగ్భాంత్రికి గురి చేయటమే కాదు.. అంత పాశవికంగా హింసించిన దోషుల్ని బహిరంగంగా ఉరి తీయాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున వచ్చింది. దేశంలోని న్యాయవ్యవస్థ పుణ్యమా అని నిర్భయ నిందితుల్ని దోషులుగా సుప్రీంకోర్టు తేల్చేసినప్పటికీ.. వారికి విధించిన ఉరిని మాత్రం ఇప్పటివరకూ అమలు చేయలేదు. ఇదిలా ఉంటే.. నిర్భయ కేసులో దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ తాజా చర్య విన్నంతనే ఒళ్లు మండేలా ఉంది. తనకు క్షమాభిక్ష విధించాలని అతగాడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఒక దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. దీన్ని రాష్ట్రపతి రిజెక్టు చేశారు. ఇదిలా ఉంటే.. తన పేరుతో వచ్చిన క్షమాభిక్ష్ పిటిషన్ ను తక్షణమే వెనక్కి పంపాలని..తాను దాన్ని దాఖలు చేయలేదంటూ బలుపు వ్యాఖ్యలు చేశారు. వినయ్ శర్మ పేరుతో వచ్చిన క్షమాభిక్ష పిటిషన్ ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించగా.. ఆ తర్వాత అది కేంద్ర హోంశాఖకు చేరుకుంది. అనంతరం దాన్ని రాష్ట్రపతికి పంపారు. ఇదిలా ఉంటే తాను క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయలేదని పేర్కొనటం ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చేసిన దుర్మార్గానికి వేదన చెందుతూ ఊరుకుండాల్సిన వినయ్ శర్మ లాంటోళ్లు బలుపు మాటలు

హైకోర్టు ఆదేశాలతో గాంధీకి మృతదేహాలు

చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌లో మరణించిన దిశ హత్యకేసు నిందితుల మృతదేహాలను సోమవారం రాత్రి మహబూబ్‌నగర్‌ నుంచి సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలిం చారు. ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కు ల కమిషన్‌ విచారణ చేపట్టడంతో పాటు పలు ప్రజా సంఘాలు కోర్టులో కేసులు వేశాయి. దీనిపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టడం, ఆ తర్వాత విచారణను గురువారానికి వాయిదా వేయడం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు భారీ బందోబస్తు మధ్య మృతదేహాలను ప్రత్యేక వాహనాల్లో గాంధీ మార్చురీకి తరలించారు. శుక్రవారం వరకు ఇక్కడే భద్రపర్చనున్నారు. మృతదేహాలు కుళ్లిపోకుండా వైద్యులు జాగ్రత్తలు తీసుకున్నారు. గాంధీ ఆస్పత్రి మార్చురీ సమీపంలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.

అలా చేసి అడ్డంగా దొరకిపోయిన ఆర్ ఆర్ ఆర్ బ్యూటీ.. చీ చీ ఇంత చీప్ నా..

రాజన్న తెరకెక్కిస్తున్న భారీ కథనం సినిమా ఆర్ అర్ అర్ .. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన నటించిన ఈ అమ్మడు అలియా భట్ పేరు ఇప్పుడు ముంబై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. దీంతో అభిమానులు అంత తొందరెందుకు అంటూ కామెంట్లు పెడుతున్నారు.. ఈ విషయం పై బాలీవుడ్ ప్రముఖులు కూడా మండిపడుతున్నారు..కొందరు ఈ విషయం పై ఘాటుగానే స్పందిస్తున్నారు..వివరాల్లోకి వెళితే.. గత ఆదివారం రాత్రి ముంబయిలో స్టార్ స్క్రీన్ అవార్డ్స్ వేడుక అట్టహాసంగా జరిగింది. బాలీవుడ్ ప్రముఖుల కార్తిక్ ఆర్యన్, ఆలియా భట్, దీపిక పదుకోన్, రణ్‌వీర్ సింగ్, అనన్య పాండే తదితరులు వేడుకకు హాజరై సందడి చేశారు. అయితే ఈ వేడుకలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ అసలు బండారం బయటపడింది. 'గల్లీ బాయ్' సినిమాకు గానూ ఆలియాకు ఉత్తమ నటిగా అవార్డు దక్కింది. అయితే షో ప్రారంభం అయ్యాక తీసుకోవాల్సిన అవార్డు ఆలియా షో ప్రారంభం కాకముందే తీసుకున్నారు. పైగా ఎవ్వరికీ తెలీకుండా షో జరుగుతున్న ప్రదేశం వెనక డోర్ నుంచి బయటికి వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న మీడియా వర్గాలు వెంటనే అక్కడికి చేరుకుని ఆలియా ఫొటోలు క్లిక్‌మనిపించాయి. దాంతో చేసేదేంలేక ఆలియా ఫొటోలకు పోజులిచ్చింది. ఆ స

లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం!

సుమారు 12 గంటల పాటు పౌరసత్వ సవరణ బిల్లు పై జరిగిన చర్చలు ముగిసాయి. మొత్తం 391 ఓట్లు పోలవగా..బిల్లుకు మద్దతుగా 311 ఓట్లు, వ్యతిరేకంగా 80 ఓట్లు వచ్చాయి. దీంతో లోక్ సభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇది భారతదేశనికి చెందిన మైనారిటీలకు వ్యతిరేకంగా 0.001% కూడా లేదని స్పష్టంచేశారు. తద్వారా రాజ్యాంగ సమానత్వ సూత్రాలను ఉల్లంఘిస్తోందన్న ప్రతిపక్షాల వాదనను తోసిపుచ్చారు. 1947 విభజన సమయంలో మతం ప్రాతిపదికన భారతదేశాన్ని విభజించిన పార్టీ కాంగ్రెస్ అయినప్పుడు ఈ బిల్లును వివక్షపూరితంగా చెప్పే హక్కు ఆ పార్టీకి లేదని తెలిపారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుండి 'మైనారిటీ వలసదారులకు' పౌరసత్వ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రతిపాదించినందున ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడాయి, ముస్లిం సమాజానికి చెందిన వారిని దాని పరిధి నుండి తప్పించింది.

దిశ ఘటనలో నిందితుల ఎన్‌కౌంటర్.!

దిశ హత్యాచారం కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు పోలీసులు. షాద్ నగర్‌ వద్ద ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులు. సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తుండగా.. తప్పించుకునేందుకు యత్నిస్తుండగా.. ఎన్‌ కౌంటర్ చేసినట్టు సమాచారం.. పారిపోతున్న నలుగురు నిందితులపై కాల్పులు జరిపినట్లు తెలిపిన పోలీసులు.

తెలంగాణ ఆర్టీసీలో వీఆర్ఎస్ స్కీమ్‌..!

తెలంగాణ ప్రభుత్వ వర్గాల్లో ఆర్టీసీలో వీఆర్ఎస్ స్కీమ్ రాబోతుందా..? అన్న ప్రశ్నపై విస్తృత స్థాయి చర్చలు జరుగుతున్నాయి. కేసీఆర్ సర్కార్ ఆర్టీసీ ఉద్యోగులకు వీఆర్ఎస్ ప్రకటించబోతున్నట్టు తెలుస్తుంది. స్టాఫ్‌ను తగ్గించడం ద్వారా ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావాలన్న దిశగా ప్రభుత్వ ఆలోచిస్తున్నట్టు సమాచారం.ఇప్పటి వరకు ఆర్టీసీలో 50వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. 50 శాతం ప్రయివేట్ రూట్‌లు, ప్రయివేటు బస్సులను తీసుకొస్తే ఇక ఆర్టీసీలో మిగిలేది ఐదువేల బస్సులు మాత్రమే. ఇప్పటి వరకు 10,400 బస్సులకు ఈ 50 వేల మంది కార్మికులు పనిచేసేవారు.బస్సుల సంఖ్య సగానికి తగ్గడంతో 20 నుంచి 25 వేల మంది కార్మికులు సరిపోతారు. దీంతో ఆర్టీసీలో వీఆర్ఎస్ స్కీమ్ తీసుకురావాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తుంది. దీనిపై కొంత కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం.అయితే, ఇప్పటికిప్పుడు వీఆర్ఎస్ స్కీమ్ ప్రకటించకపోవచ్చన్నది మరికొందరు అధికారులు చెబుతున్న మాట. సమ్మె ముగిసిన తరువాత 50 వేల మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకుంటారు. ఆ తరువాత వీఆర్ఎస్‌ను తెరపైకి తేవాలని ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది.వీఆర్ఎస్ తీసుకునే ఉద్యోగులకు కొంత ప్రోత్స

ఆర్టీసీ సమ్మెకు జేఏసీ ఫుల్ స్టాప్.. కండిషన్స్ అప్లై

ఆర్టీసీ సమ్మెపై జేఏసీ కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు జేఏసీ చైర్మన్ అశ్వత్థామ రెడ్డి. 48 రోజులుగా చేస్తున్న సమ్మెను విరమించాలని జేఏసీ ప్రకటించడంతో ఉత్కంఠకు తెరపడింది. ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కోరారు. విధుల్లో చేరిన కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని జేఏసీ కోరింది. ఎలాంటి షరతులపై కార్మికులు సంతకాలు చేయరని ఆర్టీసీ జేఏసీ పేర్కొంది. అలాంటి వాతావరణం కల్పించాలని అశ్వత్థామరెడ్డి కోరారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశాన్ని హైకోర్టు లేబర్‌ కోర్టుకు నివేదించిన సంగతి తెలిసిందే. సమ్మె కొనసాగింపుపై కార్మిక సంఘాలు పునరాలోచనలో పడ్డాయి. చివరికి ఒక నిర్ణయానికి వచ్చాయి. సమ్మెకు సంబంధించి లేబర్‌ కమిషన్‌కు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను బుధవారం జరిగిన సమావేశంలో కూలంకషంగా చర్చించారు. సమ్మె కొనసాగింపుపై కార్మికుల్లో తీవ్ర భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం నుంచి హామీ తీసుకున్నాకే సమ్మె విరమించాలని, అర్ధంతరంగా సమ్మె విరమిస్తే.. ఇన్నాళ్లు చేసిన పోరాటానికి ఫలితమూ, ప్రయోజనమూ ఉండదని మరికొందరు

డ్యూటీ ఎక్కుతాం.. తీసుకోండి!

ఆర్టీసీ కార్మికుల నుంచి వస్తున్న అభ్యర్థనలు -వచ్చినా విధుల్లోకి తీసుకునే వీలు లేకపోవడంతో వెనుదిరుగుతున్న వైనం -400 మంది కార్మికులు చేరేందుకు నిర్ణయం -అధికారుల నుంచి స్పందన కరువవ్వడంతో వెనక్కి -మళ్లీ ఆందోళనలకు జేఏసీ పిలుపు..స్పందన అంతంత మాత్రమే నిజామాబాద్‌/ నమస్తే తెలంగాణ ప్రతినిధి : ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు సంసిద్ధులవుతున్నా.. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నా రు. షరతుల్లేకుండా తమను విధుల్లోకి తీసుకోవాలని, వెం టనే సమ్మె విరమిస్తామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన విష యం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఆత్రుతగా ఎదురుచూశారు. శుక్రవారం ఏకంగా చాలామంది కార్మికులు డిపోల వద్దకు వెళ్లి డ్యూటీ లో చేరాలని నిర్ణయించారు. దాదాపు 400 మంది వరకు ఆర్టీసీ డ్రైవర్లు, కండకర్లు విధుల్లో చేరాలని బయలుదేరేందుకు సిద్ధ్దపడగా.. అధికారుల నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో వెనుదిరిగారు. కామారెడ్డి డిపో వద్దకు ఇద్దరు డ్రైవర్లు వచ్చారు. తమను డ్యూటీలో చేర్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం ఇంకా రాలేదని, తమకు ఎలాంటి ఆదేశాలు లే

ఆర్టీసీ కార్మికులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హైకోర్ట్

సీఎం కేసీఆర్ ఎంత చెప్పినా ఆర్టీసీ కార్మికులు దిగిరాకపోడవంతో దాదాపుగా 5100 బస్సులను రోడ్లపైకి తీసుకొని వచ్చి ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని ఆర్టీసీ జేఏసీ వ్యతిరేకించి ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్ట్ లో పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరుపున వధించిన అడిషినల్ జనరల్ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేయలేమని సుప్రీం కోయిర్ట్ ఇచ్చిన తీర్పుకి అనుగుణంగానే ప్రవేటీకరణ చేస్తుందంటూ చెప్పుకొచ్చారు. సెక్షన్ 67 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీపై పూర్తి హక్కులు ఉంటాయని వాదించడం జరిగింది. అడిషినల్ జనరల్ వినిపించిన వాదనకు హైకోర్ట్ ఏకీభవించి ఆర్టీసీ జేఏసీ వేసిన కేసుని కొట్టివేసింది.దీనితో కేసీఆర్ సర్కార్ అనుకున్నట్లు రేపటి నుంచి 5100 ప్రైవేట్ బస్సులు రోడ్లెక్కనున్నాయి. రెండు రోజుల క్రితం తాము ఆర్టీసీ సమ్మెను ప్రస్తుతానికి పక్కన పెట్టి తమ విధులలో చేరుతామని ఆర్టీసీ జేఏసీ తెలియచేసినా కేసీఆర్ సర్కార్ ఎలాంటి స్పందన తెలియచేయలేదు. నిన్నటి నుంచి ఆర్టీసీ కార్మికులు డిపోల వద్ద విధులలోకి చేరడానికి రాగా, ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ డిపో మేనేజర్ కు ప్రభు

ఆర్టీసీ జాక్ లో ముసలం - రాష్ట్ర కార్యదర్శి పదవికి నగేష్ రాజీనామా..

హైదరాబాద్ - ఆర్టీసీ కార్మిక సంఘాల జాక్ లో ముసలం ప్రారంభమైంది. ఆర్టీసీ జేఏసీ గందరగోళ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి నగేష్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. జేఏసీ పెద్దలు స్టేట్ కమిటీ నేతలతో చెప్పకుండా సమ్మెపై విరమణ చేస్తామని ప్రకటించారని ఆరోపించారు. కార్మికులు విధుల్లో చేరడానికి సీఎం కేసీఆర్ అవకాశమిచ్చినప్పుడే భేషరతుగా చేరివుంటే భాగుండేదని నగేష్ మీడియాతో అన్నారు. కార్మికుల ఆత్మహత్యలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. కాగా, సమ్మెపై ఆర్టీసీ జేఏసీ వెనక్కి తగ్గడంతో మరోవైపు కార్మికుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు కార్మికులు విధుల్లో చేరడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో.. ఉన్నతాధికారులనుంచి ఎలాంటి ఆదేశాలు లేకుంటే వారిని వెనక్కి పంపిస్తామమని ఆర్టీసీ అధికారులు అంటున్నారు.

అయ్యా.. మేము విధుల్లో చేరుతాం

కొంతమంది ఆర్టీసీ కార్మికుల వేడుకోలు అనుమతి లేదంటున్న అధికారులు హైదరాబాద్‌, 'అయ్యా మేము విధుల్లో చేరుతాం. మమ్మల్ని తీసుకోండి' అంటూ వివిధ ప్రాంతా ల్లో ఆర్టీసీ కార్మికులు అధికారులను వేడుకుంటున్నారు. హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌లోని హైదరాబాద్‌-2 డిపోకు శుక్రవారం దాదాపు 30 మంది కార్మికులు డిపో మేనేజర్‌ రాజేందర్‌రెడ్డిని కలిశారు. తమను విధుల్లోకి తీసుకోవాలని విన్నవించుకున్నారు. ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి అనుమతి రాన్నందున విధుల్లోకి తీసుకోలేకపోతున్నానని చెప్పి ఆయన కార్మికులను తిప్పి పంపారు. జగిత్యాలలోనూ విధుల్లో చేరుతామని కొంతమంది కార్మికులు డిపో మేనేజర్‌ను కలవగా.. ఈ విషయమై తనకు ఎలాంటి ఆదేశాలు రాలేదని ఆయన చెప్పారు.

ఆర్టీసీ రేట్లకే ప్రైవేట్ బస్సులు... 5100 బస్సులకు గ్రీన్ సిగ్నల్

మొత్తం 5,100 ప్రైవేటు బస్సులకు స్టేజీ క్యారేజీలుగా తెలంగాణ సర్కార్ రూట్ పర్మిట్ లు ఇవ్వనుంది. హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వం ఇవాళే ఈ ప్రక్రియను మొదలుపెట్టబోతుంది. అయితే ప్రైవేటు బస్సులను ఆర్టీసీ చార్జీలతోనే నడపాలని తెలిపింది. హైదరాబాద్ లో తిరిగే బస్సులకు కనీస చార్జీ 5 రూపాయలుగా ఉంది. సెట్విన్ బస్సుల్లో పదిరూపాలు తీసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆటోల చార్జీలు రెట్టింపు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆపరేటర్ లకు ఆర్టీసీ చార్జీలు నచ్చుతాయా..? వారికి గిట్టుబాటు అవుతుందా..? స్టేజి క్యారేజి పర్మిట్ లు తీసుకోవటానికి వారు ముందుకొస్తారా? అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసీలో 10,460 బస్సులున్నాయి. వీటిలో 2,103 అద్దె బస్సులు, 2,609 ఆర్టీసి సొంత బస్సులకు కాలం చెల్లింది. మరో 400-500 ల బస్సులకు మూడు నాలుగు నెలల్లో కాలం చెల్లనుంది. ఇవన్నీ కలిపి 5,100 వరకూ అవుతాయి. కొత్త బస్సులను కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఆర్టీసీ ఉందని ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. దాంతో ప్రైవేటు బస్సులకు రూట్ పర్మిట్ లు ఇవ్వనుంది. ఆర్టీసీ ఆధీనంలో ఉన్న రూట్లలో ఇవి స్టేజీ క్యారేజీలుగా నడుస్తాయి. ఒక రూట్ లో ఉన్

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

కేంద్రం ప్రజా రవాణాలో పోటీతత్వాన్ని పెంచటం కొరకు కొన్ని నెలల క్రితం ప్రైవేటు ఆపరేటర్లను కూడా అనుమతించాలని రవాణా చట్ట సవరణలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలైన తరువాత రూట్ల ప్రైవేటీకరణకు మొగ్గు చూపింది. న్యాయపరమైన సమస్యలు కూడా తొలగిపోవటంతో భారీ స్థాయిలో ప్రైవేట్ బస్సులు రాబోతున్నాయి. భారీ స్థాయిలో ప్రైవేట్ బస్సులు వస్తూ ఉండటంతో కార్మికుల భవితవ్యం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం 50 సంవత్సరాలు పై బడిన ఆర్టీసీ కార్మికులందరికీ వీఆర్ఎస్ కల్పించే యోచనలో ఉందని తెలుస్తోంది. 50 సంవత్సరాల పై బడిన కార్మికులు స్వచ్ఛంద పదవీ విరమణకు ఒప్పుకుంటే దాదాపు 20 వేల మంది కార్మికులు రిటైర్ అవుతారు. మిగిలిన సిబ్బంది 50 శాతం బస్సుల నిర్వహణకు సరిపోతారని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీఆర్ఎస్ కు ఒప్పుకున్న కార్మికులకు ప్రభుత్వం భారీ స్థాయిలో వరాలు కురిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రైవేట్ రూట్లకు సంబంధించిన విధివిధానాలు ప్రకటించిన తరువాత సీఎం కేసీఆర్ కార్మికుల విషయంలో తన

ఆర్టీసీ కార్మికుల్లో ఉత్కంఠ.. ఆశలన్నీ సీఎంపైనే

కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామంటూ  ఆర్టీసీ కార్మిక  సంఘాల జేఏసీ ప్రతిపాదనపై ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. సీఎం కేసీఆర్‌ నిర్ణయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తమకు అనుకూలంగా సీఎం నిర్ణయం తీసుకుంటారా? లేక ప్రభుత్వ నిర్ణయానికే కట్టుబడి ఉంటారా అనేది ఆసక్తికరంగా మరాంది. రెండు నెలలుగా వేతనాలు లేకుండా సమ్మెలో కొనసాగుతున్న కార్మికులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామని జేఏసీ ప్రతిపాదించింది. దీంతో విధుల్లో చేరతామంటూ గురువారం రాష్ట్రంలోని వివిధ డిపోలకు కార్మికులు పెద్ద సంఖ్యలో వచ్చారు. శుక్రవారం ఉదయం నుంచి కూడా డిపోల వద్ద ఇదే పరిస్థితి ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నారు. అయితే, ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు ఎవరినీ విధుల్లోకి తీసుకోవద్దని, విధుల్లో చేరేందుకు సిద్ధమంటూ లేఖలు ఇచ్చినా కూడా తీసుకోవద్దని డిపో మేనేజర్లకు అధికారులు ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు ఎవరినీ విధుల్లోకి చేర్చుకోవడం సాధ్యం కాదని మేనేజర్లు వ

రాజమహేంద్రవరం లో రౌడీ బ్యాచ్ వీరంగం

రాజమహేంద్రవరం లో రౌడీ బ్యాచ్ వీరంగం   కానిస్టేబుల్ బైక్ ని ఢీకొని.. అతడిపైనే దాడి.. నడిరోడ్డుపై చితకబాదిన వైనం.. పోలీసుల అదుపులో ఒకరు, మరికొందరికోసం గాలింపు… తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ఆనందనగర్ లో స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ పై ముగ్గురు యువకులు పబ్లిక్ లోనే దాడి చేశారు. విచక్షణ రహితంగా అతన్ని కొట్టి, అడ్డుకోవాలని యత్నించినవారిని కత్తులతో బెదిరించారు. స్థానికంగా ఈ ఘటన సంచలనం కలిగించింది. ఒక పోలీసుపైనే ఆకతాయి రౌడీలు ఇలా రెచ్చిపోవడాన్ని పోలీసు శాఖ తీవ్రంగా పరిగణించింది. దుండగులకోసం గాలింపు మొదలుపెట్టింది. రాజమండ్రి అర్బన్ జిల్లా పరిధిలోని సీతానగరం, కోరుకొండ పోలీసు స్టేషన్ లలో నాగేశ్వరరావు స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. ఉదయం అతడు మోటారు సైకిల్ పై వెళ్ళుతుండగా వెనుకగా బైక్ పై వస్తున్న ముగ్గురు యువకులు బైక్ తో ఢీకొన్నారు. దీనితో హెడ్ కానిస్టేబుల్ సెల్ ఫోన్ లో ఆ ముగ్గురు యువకులను, బైక్ నీ ఫోటో తీశాడు. దీనితో ముగ్గురు యువకులు రెక్చిపోయారు. కట్టిలతో వీరంగం చేశారు. హెడ్ కానిస్టేబుల్ పై దాడి చేసి పిడిగుద్దులు గుద్దారు. స్థానికంగా ఉన్న ఆటో డ్రైవర్ లు ఆపినప్పటికి.

పొగ తాగే అలవాటున్న వారు ఈ-సిగరెట్లకు మారినట్లయితే వారి గుండె ఆరోగ్య పరిస్థితి కొన్ని వారాల్లోనే మెరుగుపడుతుంది

పొగ తాగే అలవాటున్న వారు ఈ-సిగరెట్లకు మారినట్లయితే వారి గుండె ఆరోగ్య పరిస్థితి కొన్ని వారాల్లోనే మెరుగుపడుతుందని ఈ అంశంపై నిర్వహించిన ఒక పెద్ద అధ్యయనంలో వెల్లడైంది. ధూమపానం చేసే 114 మంది మీద నెల రోజుల పాటు ఈ అధ్యయనం నిర్వహించారు. ధూమపానానికి బదులు వేపింగ్ వల్ల - అంటే ఈ-సిగరెట్లు తాగటం వల్ల గుండె పోటు, మెదడు పోటు ముప్పు తగ్గే అవకాశం ఉందని తేలింది. అయితే.. వేపింగ్ అనేది ''సురక్షితం కాదు'' అని ఈ అధ్యయనం నిర్వహించిన యూనివర్సిటీ ఆఫ్ డండీకి చెందిన పరిశోధకుల బృందం స్పష్టం చేసింది. కాకపోతే పొగాకు కన్నా తక్కువ హానికరమని చెప్పింది. అసలు పొగతాగటం పూర్తిగా మానివేయటమే.. గుండెకు అత్యంత మేలు చేస్తుందని బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ పేర్కొంది. సిగరెట్ల పొగలోని రసాయనాల వల్ల.. గుండె ధమనుల్లో రక్త ప్రసరణ జరిగే మార్గాలు సన్నగా మారిపోతాయి. వాటిలో కొవ్వు నిల్వలు పేరుకోవటం వల్ల అవి అడ్డంకిగా మారి, దారి మూసుకుపోయి ప్రాణాంతకంగా పరిణమిస్తాయి. చివరికి పొగతాగేవారికి గుండె పోటు ముప్పు రెట్టింపు అవుతుంది. అయితే.. వేపింగ్‌కు సంబంధించి ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధారాలు చాలా తక్కువని.. తరచుగా గుండె ఆరోగ్యం మ

భూమా అఖిల‌ప్రియ‌పై కోర్టుకెక్కిన త‌మ్ముడు

భూమా అఖిల‌ప్రియ‌పై కోర్టుకెక్కిన త‌మ్ముడు మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియ మ‌రోసారి చిక్కుల్లో ప‌డ్డారు. కుటుంబ స‌భ్యులు, బంధువులెవ‌రితోనూ ఆమెకు పొస‌గ‌డం లేద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.  సొంత త‌మ్ముడే ఆమెపై రంగారెడ్డి అడిష‌న‌ల్ కోర్టులో కేసు వేశాడు. ఇద్ద‌రి అక్క‌గార్ల నుంచి త‌న‌కు న్యాయం చేయాల‌ని అఖిల‌ప్రియ సోద‌రుడు కోర్టు మెట్లు ఎక్క‌డం సంచ‌ల‌నంగా మారింది. ఈ నెల 14న కోర్టులో కేసు దాఖ‌లు చేశారు. కేసుకు సంబంధించి ప్ర‌తివాదుల‌కు నోటీసులు పంపారు. ఒక‌దాని త‌ర్వాత మ‌రొక‌టి నీడ‌లా ఆమె కుటుంబాన్ని కేసులు వెంటాడుతూ, వేటాడుతున్నాయి. ఆళ్ల‌గ‌డ్డ‌లో క్ర‌ష‌ర్ మిష‌న్‌కు సంబంధించి భూమా అఖిల‌ప్రియ స‌మీప బంధువుపై దాడి ఆమె భ‌ర్త భార్గ‌వ్‌రామ్‌పై కేసు న‌మోదుకు దారి తీసిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికీ అత‌ను పోలీసుల‌కు చిక్క‌కుండా ప‌రారీలో ఉన్నాడు. ఇప్పుడు భూమా అఖిల‌ప్రియ వంతు వ‌చ్చింది. ఆమెపై కేసు పెట్టింది మ‌రెవ‌రో కాదు....ర‌క్తం పంచుకుని పుట్టిన త‌మ్ముడు జ‌గ‌త్‌విఖ్యాత్‌రెడ్డి కావ‌డం గ‌మ‌నార్హం. అఖిల‌ప్రియ‌పై కేసుకు ఆస్తి త‌గాదాలే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. అక్కా అక్కా అంటూ చెంగు ప‌ట్టుకుని తిరుగుతున్న త‌మ్ముడ

తెలంగాణ ఆర్‌టీసీ కార్మికుల పరిస్థితి విచిత్రంగానే కాదు, విషాదభరితంగా ఉంది

తెలంగాణ ఆర్‌టీసీ కార్మికుల పరిస్థితి విచిత్రంగానే కాదు, విషాదభరితంగా ఉంది. సమ్మె కథను కంచికి చేర్చాలనుకుంటే అది చివరకు మరింత పీటముడిపడిపోయింది. ఆ ముడి ఎలా వీడుతుంది? కథ ఎలా కంచికి వెళుతుంది? అనేది అయోమయంగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఆర్‌టీసీ కార్మికులు సమ్మెలు చేశారుగాని ఇంతటి క్లిష్ట, గడ్డు పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఇలా జరుగుతుందని వారు ఎన్నడూ ఊహించలేదు. కార్మికులు కావొచ్చు, ఉద్యోగులు కావొచ్చు..డిమాండ్లు తీర్చాలని సమ్మె చేయడం సహజమే. కార్మికులు సమ్మె చేస్తే ఏ ప్రభుత్వమైనా కొంతకాలం బెట్టుగా వ్యవహరించి తరువాత ఏవో చర్చలు జరిపి, కార్మికులతో బేరమాడి కొన్ని డిమాండ్లు తీర్చి, కొన్ని తీర్చక, కొన్ని తరువాత తీరుస్తామని హామీ ఇచ్చి..ఇలా ఏదో విధంగా సమ్మెను పరిష్కరిస్తుంది.  పాపం..తెలంగాణ ఆర్‌టీసీ కార్మికులు అలాగే అనుకున్నారు. కాని ‘డామిట్‌ ..కథ అడ్డం తిరిగింది’ అని తెలిసేసరికి ఏం చేయాలో అర్థంకాక తల పట్టుకున్నారు. 47 రోజులపాటు డిమాండ్ల సాధన కోసం ఎంత ఆందోళన చేయాలో అంతా చేశారు. రకరకాల రూపాల్లో ఆందోళన చేశారు. ‘మా చావుతోనైనా డిమాండ్లు పరిష్కారం కావాలె’ అని పిచ్చి ఆలోచన చేసి కొందరు ప్రాణాలు తీసుకుం

మాదక ద్రవ్యాల కేసులో పట్టుబడిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తికి ఈజిప్ట్ కోర్టు ఉరిశిక్షను విధించింది

మాదక ద్రవ్యాల కేసులో పట్టుబడిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తికి ఈజిప్ట్ కోర్టు ఉరిశిక్షను విధించింది. వివరాల్లోకి వెళితే, శ్రీకాకుళం జిల్లాకు చెందిన బగ్గు రమణ అనే యువకుడు ఉపాధి నిమిత్తం ఈజిప్ట్ వెళ్లాడు. 2016లో ఈజిప్ట్ కు వెళ్లిన రమణ, గత సంవత్సరం మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తూ, పోలీసులకు పట్టుబడ్డాడు. అతన్ని విచారించిన కోర్టు ఉరిశిక్షను విధిస్తూ తీర్పిచ్చింది. ఈ తీర్పుపై ఈజిప్ట్ దౌత్యాధికారులు, భారత రాయబార కార్యాలయానికి సమాచారాన్ని అందించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎంపీ రామ్మోహన్ నాయుడు, రమణకు క్షమాభిక్ష పెట్టించి, ఇండియాకు క్షేమంగా తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాలని భారత విదేశాంగ శాఖ అధికారులను కోరారు. రమణకు ఉరిశిక్షపై పూర్తి సమాచారం తెలియాల్సివుంది.

నేడే 'మహా' ప్రతిష్టంభనకు తెర..!

రాష్ట్రపతి పాలనలో ఉన్న మహారాష్ట్రలో అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా కాంగ్రెస్​-ఎన్​సీపీ-శివసేన అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూడు పార్టీల మధ్య నేడు కీలక సమావేశాలు జరగనున్నాయి. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుపై ముఖ్య ప్రకటన చేయనున్నారు. దీనితో ఎన్నికల ఫలితాల అనంతరం ఏర్పడిన మహా ప్రతిష్టంభనకు నేటితో తెరపడే అవకాశముంది. కీలక సమావేశాలతో మహారాష్ట్ర రాజకీయాలు నేడు మరింత ఉత్కంఠగా మారనున్నాయి. ఈ సమావేశాల తర్వాత మహా ప్రతిష్టంభనకు తెరదించితూ.. కాంగ్రెస్​-ఎన్​సీపీ-శివసేన పార్టీలు కీలక ప్రకటన చేసే అవకాశముంది. మూడు భేటీలు... నేడు ముంబయిలో మిత్రపక్షాలతో భేటీకానున్నారు కాంగ్రెస్​-ఎన్​సీపీ నేతలు. అనంతరం శివసేనతో సమావేశమవుతారు. ఈ విషయాన్ని కాంగ్రెస్​ సీనియర్​ నేత పృథ్వీరాజ్​ చౌహాన్​ ప్రకటించారు. శివసేనతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై ఉన్న అన్ని అంశాలపైనా కాంగ్రెస్​-ఎన్​సీపీ నేతలు ఇప్పటికే ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు. కనీస ఉమ్మడి ప్రణాళిక, కూటమి ఏర్పాటు, అధికార భాగస్వామ్యం తదితర విషయాలను శివసేనతో చర్చించనున్నట్టు స్పష్టం చేశారు. ఎన్​సీపీ-కాంగ్రెస్​తో భేటీకీ ముందు.. శివసేన ఎమ్మెల్యేలు, సీనియర్​

అత్తారింట్లో ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించగా ఐదుగురి పరిస్థితి విషమం

అత్తారింట్లో ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించగా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. దంపతుల మధ్య గొడవ నేపథ్యంలో ఓ భర్త తన భార్య, ఇద్దరు పిల్లలతో పాటు ఇద్దరు బావమరుదులపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురూ తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

కండరాల ఉపశమనానికి సంబంధించిన ఇంజక్షన్‌ మోతాదుకు మించి తీసుకొని ఓ నర్సు ఆత్మహత్య

హైదరాబాదు: కండరాల ఉపశమనానికి సంబంధించిన ఇంజక్షన్‌ మోతాదుకు మించి తీసుకొని ఓ నర్సు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన నాచారం పోలీసుస్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగింది. సీఐ మహేష్‌, స్థానికుల కథనం ప్రకారం.. నాచారం అన్నపూర్ణకాలనీ కమల మెమోరియల్‌ పాఠశాల సమీపంలో ఉంటున్న రాజాప్ప కుమార్తె రోజ(25) ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. రాజాప్పకు పక్షవాతం ఉండడంతో ఇంట్లోనే ఉండగా భార్య పని నిమిత్తం బయటకు వెళ్లింది. ఉదయం విధులకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చిన రోజ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో కండరాల ఉపశమానికి సంబంధించిన మత్తు ఇంజక్షన్‌ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు పోలీసులకు సమాచారం తెలియచేయడంతో ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని గాంధీకి తరలించారు. ఆత్మహత్యకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

సైబర్ మోసగాళ్లను నమ్మితే... సర్వం సమర్పయామి..!

అమ్మాయి ఫోనులో మాట్లాడితే... కరిగిపోయి నగదు బ్యాంకు అకౌంట్లలో వేసేస్తారా..? పాలకుల పేర్లు చెప్పి మీకు ఎన్నికల్లో సీట్లు ఇస్తామంటే... ఏమీ ఆలోచించకుండా మోసపోయే వారు ఉన్నారా...? అవతలి వారు అమ్మాయి అయితే చాలు డేటింగ్ చేసేద్దామంటే... ముగ్గులోకి దిగిపోయేవారు ఉంటారా..? ఇవన్ని జరుగుతున్నాయంటే.. నమ్మట్లేదు కదా. నిజంగా నిజమండి... ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఆశపడే వాళ్లకు హద్దులు లేకపోతే.. దోచుకునే వారికి దారులెన్నో..! సైబర్ మోసగాళ్లను నమ్మితే... సర్వం సమర్పయామి..! అమెరికా అమ్మాయికి... ఆంధ్రా పెద్దాయనకు మధ్య ఫ్రెండ్ షిప్.! ఆమె రెండుపదుల వయసు దాటిన యువతి. ఈయన ఆరు పదుల వయసు దాటిన విశ్రాంత ఉద్యోగి. ఫేస్​బుక్ వారి పరిచయానికి వేదికైంది. చివరకు ఆ పెద్దాయన అక్షరాల రూ.34 లక్షలు పొగొట్టుకోవాల్సి వచ్చింది. అలాంటి అనేక సైబర్ నేరాలు మన విశాఖ పరిధిలోనే ఎక్కువ జరిగాయంటే అతిశయోక్తి కాదు. చిన్న మెసేజ్... పెద్ద ముప్పు..! ఎదో మాయలో పోర్న్ సైట్లు, డేటింగ్ సైట్లపై ఒక్క క్లిక్ చేశారా... అంతే... చేదు అనుభవానికి మీరు తలుపు తెరిచినట్టే. ఆ తరువాత ఏ ఇతర వెబ్​సైట్​ వెతికినా.. మన ప్రమేయం లేకుండానే... అశ్లీల సైట్లు మనకు హాయ

మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ..

 వివిధ మార్కెట్లలో  బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.  24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.38,420, విజయవాడలో రూ.38,900, విశాఖపట్నంలో రూ.39,390, ప్రొద్దుటూరులో రూ.38,900, చెన్నైలో రూ.38,150గా ఉంది.  ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.36,600, విజయవాడలో రూ.36,100, విశాఖపట్నంలో రూ.36,230, ప్రొద్దుటూరులో రూ.36,030, చెన్నైలో రూ.36,540గా ఉంది.  వెండి కిలో ధర హైదరాబాదులో రూ.44,700, విజయవాడలో రూ.46,200, విశాఖపట్నంలో రూ.46,200, ప్రొద్దుటూరులో రూ.46,200, చెన్నైలో రూ.48,400 వద్ద ముగిసింది.

రాశిఫలం - 22/11/2019

తిథి:  బహుళ దశమి ఉ.6.39 త. ఏకాదశి రా.తె.4.16 , కలియుగం-5121, శాలివాహన శకం-1941 నక్షత్రం:  ఉత్తర మ.3.17 వర్జ్యం:  రా.11.06 నుండి 12.35 వరకు దుర్ముహూర్తం:  ఉ.08.24 నుండి 09.12 వరకు, తిరిగి మ.12.24 నుండి 01.12 వరకు రాహు కాలం:  ఉ.10.30 నుండి 12.00 వరకు తీవిశేషాలు: స్మార్తానాం ఏకాదశి మేషం:  (అశ్విని, భరణి, కృత్తిక 1పా.) ఋణప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కటుంబంలో అనారోగ్య బాధలుండును. బంధు, మిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం వుంది. చేసే పనులలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. వృషభం:  (కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) ఆకస్మిక ధనలాభముంటుంది. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయుటకు వెనుకాడరు. ఋణబాధలు తొలగిపోతాయి. శత్రుబాధలుండవు. మిథునం:  (మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలున్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధననష్టమేర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీ

ఆర్టీసీకి శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వ నిర్ణయం

హైదరాబాద్‌:  ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ఆర్టీసీపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ముగిసింది. సుమారు 5 గంటలకుపైగా సుదీర్ఘంగా ఈ సమావేశం కొనసాగింది. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్‌ కే జోషి, సీనియర్‌ అధికారులు నర్సింగ్‌రావు, సునీల్‌ శర్మ, సందీప్‌ సుల్తానియా సమీక్షలో పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆర్టీసీ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ? అనే అంశంపై సుదీర్ఘంగా సమావేశంలో చర్చించారు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి, కోర్టు నిర్ణయాలు, కోర్టులో ఇంకా నడుస్తున్న కేసులు తదితరల అంశాలపై కూలంకశంగా అధ్యయనం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమీక్షలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ..ఆర్టీసీకి ఇప్పటికే రూ.5వేల కోట్లకుపైగా అప్పులున్నాయన్నారు. ఇందులో తక్షణం చెల్లించాల్సిన అప్పులు, బకాయిలు దాదాపు రూ.2 వేల కోట్ల వరకు ఉన్నాయి. ప్రావిడెంట్‌ ఫండ్‌ అధికారుల ఆదేశం మేరకు ఉద్యోగులకు సెప్టెంబర్‌కు సంబంధించి మొత్తం జీతం చెల్లించాలంటే రూ.240 కోట్లు కావాలి. సీసీఎస్‌కు రూ.500 కోట్లు ఇవ్వాలి. పీఎఫ్‌ బకాయిల కింద నెలకు రూ.65-70 కోట్ల వరకు చెల్

వివిధ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి

అమరావతి : 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.38,460, విజయవాడలో రూ.38,950, విశాఖపట్నంలో రూ.39,360, ప్రొద్దుటూరులో రూ.38,950, చెన్నైలో రూ.38,010గా ఉంది.  ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.36,630, విజయవాడలో రూ.36,100, విశాఖపట్నంలో రూ.36,210, ప్రొద్దుటూరులో రూ.36,090, చెన్నైలో రూ.36,380గా ఉంది.  వెండి కిలో ధర హైదరాబాదులో రూ.44,200, విజయవాడలో రూ.46,000, విశాఖపట్నంలో రూ.45,600, ప్రొద్దుటూరులో రూ.45,700, చెన్నైలో రూ.47,700 వద్ద ముగిసింది.

ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వ పథకం...18 ఏళ్లు రాగానే విత్‌డ్రా!

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రజా సంక్షేమ పథకాల్లో ఆడపిల్లల కోసం కూడా ప్రత్యేకమైన స్కీమ్స్ ఉన్నాయి. వీటిల్లో బాలిక సమృద్ధి యోజన కూడా ఒకటి. ఈ పథకం చిన్నారుల కోసం అందుబాటులో ఉంది. ఇందులో చేరడం వల్ల ఆడపిల్లలకు ప్రయోజనం కలుగుతుంది. *Balika Samriddhi Yojana - బాలిక యోజన పథకం 1997 నుంచి అమలులో ఉంది. స్కూళ్లలో ఆడ పిల్లల సంఖ్యను పెంచడానికి ఈ స్కీమ్‌ను తీసుకువచ్చారు. ఈ పథకం కింద ఆడ పిల్ల పుట్టిన తర్వాత అమ్మకు రూ.500 క్యాష్ గిఫ్ట్‌గా ఇస్తారు. తర్వాత ఆడ పిల్ల స్కూల్‌కు వెళ్లిన దగ్గరి నుంచి ప్రతి సంవత్సరం స్కాలర్‌షిప్ అందిస్తారు. 18 ఏళ్లు వచ్చిన తర్వాత డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. గ్రామాల్లో అంగన్‌వాడీ వర్కర్ల దగ్గరకు వెళ్లి ఈ స్కీమ్‌ అప్లికేషన్ ఫిల్ చేసి పథకంలో చేరొచ్చు. పట్టణాల్లో అయితే హెల్త్ ఫంక్షనరీస్ వద్ద స్కీమ్ అప్లికేషన్స్ అందుబాటులో ఉంటాయి. ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు సంవత్సరానికి రూ.300 అందజేస్తారు. తర్వాత 4వ తరగతి నుంచి రూ.500 వస్తాయి. 5వ తరగతికి రూ.600, 6 నుంచి 7వ తరగతికి రూ.700, 8వ తరగతికి రూ.800, 9వ తరగతిలో రూ.1000 స్కాలర్ అందజేస్తారు. ఇకపోతే ఆడపిల్లల కోసం ఈ స్కీమ్ మాత్రమే క

జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి లేని భవన నిర్మాణ కార్మికులకు అండగా డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ఏర్పాటు

Image
జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి లేని భవన నిర్మాణ కార్మికులకు అండగా  డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ఏర్పాటు  గుంటూరు జిల్లా మంగళగిరి : ఆహార శిబిరంలో భవన నిర్మాణ కార్మికులకు స్వయంగా భోజనం వడ్డించిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కామెంట్స్ ... వైయస్సార్సీపి  గవర్నమెంట్ కార్మికులకు ఉపాధి చూపడంలో విఫలమైంది ,ఐదేళ్ల పాలనలో 50 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం 5లక్షల పరిహారం చెల్లించాలి, అలాగే ఈ ఐదు నెలల పాటు ఉపాదికోల్పయిన కార్మికులకు నెలకి పదివేలు చొప్పున 50 వేల రూపాయలు ప్రభుత్వం ప్రతి కార్మికుడికిచెల్లించాలని డిమాండ్. రాజధాని విషయంలో జగన్ మోహన్ రెడ్డి స్పష్టమైన వైఖరి తెలియజేయాలి, అమరావతిలో నిర్మిస్తారో లేక పులివెందుల లో నిర్మిస్తారో చెప్పాలి ,రాష్ట్ర అభివృద్ధికి జనసేన పార్టీ సహకరిస్తుంది. జనసేన పార్టీ ఎప్పుడు సామాన్యులకు అండగా ఉంటుంది దానికి నిదర్శనమే నేడు 150 నియోజకవర్గాల్లో ఉపాధి లేని భవన నిర్మాణ కార్మికుల కోసం ఆహార శిబిరాలు ఏర్పాటు నేను ఎప్పుడు వ్యక్తిగత దూషణకు పాల్పడలేదు, కానీ సామాన్యుడి

సంగీతం వింటూ డ్రైవింగ్‌ చేస్తే గుండెపోటు ముప్పు తగ్గుతుంది.

న్యూఢిల్లీ:  సంగీతం వింటూ డ్రైవింగ్‌ చేస్తే గుండెపోటు ముప్పు తగ్గుతుందని బ్రెజిల్‌లోని సావోపాలో వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  అధ్యయనంలో భాగంగా వారంలో ఒకటి లేదా రెండుసార్లే కారు డ్రైవింగ్‌ చేసే 18-23 ఏళ్లలోపు ఐదుగురు మహిళలను ఎంపిక చేశారు.  మొదటిరోజు అత్యంత రద్దీ ఉండే మార్గంలో 20 నిమిషాల పాటు వారితో కారును డ్రైవ్‌ చేయించారు.  మరుసటిరోజు అదే రూట్‌లో కారులో సీడీ ప్లేయర్‌/రేడియో ద్వారా పాటలు పెట్టి, డ్రైవింగ్‌ చేయించారు.  ఈరెండు సందర్భాల్లోనూ వారి గుండె కొట్టుకునే రేటును ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ఛాతీభాగంలో హర్ట్‌ రేట్‌ మానిటర్‌ను అమర్చారు.  ఏ వ్యాపకం లేకుండా డ్రైవింగ్‌ చేసిన సమయంలో కంటే.. మ్యూజిక్‌ వింటూ కారు నడిపినప్పుడు వారి నాడీ వ్యవస్థ, గుండెలపై ఒత్తిడి తగ్గినట్లు అధ్యయనంలో గుర్తించారు.

ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది.

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది. హైకోర్టు ప్రతిపాదనకు సర్కార్ ససేమిరా అంది. సుప్రీంకోర్టు మాజీ జడ్జీలతో ఆర్టీసీ సమస్య పరిష్కారంపై కమిటీ వేస్తామని హైకోర్టు పేర్కొంది. అయితే హైకోర్టు చెప్పిన ప్రతిపాదనకు కేసీఆర్ ప్రభుత్వం నో చెప్పింది. దీనిపై హైపవర్ కమిటీ ప్రతిపాదనను ఒప్పుకోమంది. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రయాన్ని హైకోర్టుకు ఏజీ తెలిపారు. లేబర్ కోర్టులో ఉన్నందున ముగ్గురు జడ్జీల కమిటీ వద్దన్నారు. సమ్మెపై సుప్రీం కోర్టు ముగ్గురు మాజీ జడ్జిలతో కమిటీ వేస్తామని, ప్రభుత్వాన్ని అడిగి నిర్ణయం చెప్పాలని ఏజీని మంగళవారం హైకోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను ఇవాల్టీకి వాయిదా వేసింది. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టుకు... తెలంగాణ ప్రభుత్వం తమ నిర్ణయం తెలపింది. హైకోర్టు ప్రతిపాదనకు నో చెప్పింది. సమ్మె విషయంలో చర్చలు లేవన్న ప్రభుత్వం ఎస్మా ప్రకటించే ఆలోచనలో ఉండటంతో... అందుకు వీలు లేదని హైకోర్టు మంగళవారం తెలిపింది. ఆర్టీసీ సేవలు... అత్యవసర సేవల కిందకు రాలేదనీ, అవి ప్రజా వినియోగ సేవలు మాత్రమే అన్న హైకోర్టు... ఎస్మా ప్రయోగించాలంటే... ఆ సేవల్ని ఎస్మా కిందకు తెస్తూ... ప్ర

హైబ్రీడ్ సెట్​ టాప్​ బాక్స్.

ప్రస్తుతం వీడియో కంటెంట్​కు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. వీటిని మొబైల్ ఫోన్లు, ల్యాప్​టాప్​లలో అధికంగా వినియోగిస్తుంటారు. అయితే ఇంట్లోని టీవీల్లో శాటిలైట్​ ఛానెళ్లతో పాటు.. వీడియో స్ట్రీమింగ్​ (ఓటీటీ) సేవలను ఇస్తున్నాయి హైబ్రీడ్ సెట్​ టాప్​ బాక్స్​లు. మరి అవి ఎలా పని చేస్తాయి? వాటితో లాభమేంటి? అనే విషయాలు మీ కోసం. హైబ్రీడ్ సెట్​ టాప్​ బాక్స్.. దేశ ప్రసార రంగంలో ప్రస్తుతం కొనసాగుతున్న నయా ట్రెండ్​. ఇంతకీ ఏంటి ఈ హైబ్రీడ్ సెట్​ టాప్ బాక్స్​.. దీని ఉపయోగమెంత? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. శాటిలైట్​ టీవీతో పాటు.. వీడియో స్ట్రీమింగ్​ (ఓటీటీ) కంటెంట్ వీలుగా వీలుగా ఉండటమే ఈ హైబ్రీడ్​ సెట్​ టాప్​బాక్స్ ప్రత్యేకత. హైబ్రీడ్ సెట్​ టాప్​ బాక్స్​ ఎందుకు? వీడియో స్ట్రీమింగ్ యాప్​లు వీడియో కంటెంట్​ను ఇవ్వడం మొదలు పెట్టిన తర్వాత మొబైళ్లు, ల్యాప్​టాప్​ల్లో వీడియో కంటెంట్​ను వీక్షించేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. టీవీల్లో కేవలం శాటిలైట్​ ఛానెళ్లు మాత్రమే ప్రసారం కావడం వల్ల వీక్షకుల సంఖ్య భారీగా తగ్గుతున్నట్లు డీటీహెచ్ ఆపరేటర్లు, ఛానెళ్ల యాజమాన్యాలు భావిస్తున్నాయి. అమెజాన్ ఫైర్​ స్టిక్​తో టీవీల్లోన

సర్వోన్నత న్యాయస్థానం బుధవారం బిజీబిజీగా ఉండనుంది

దిల్లీ:  సర్వోన్నత న్యాయస్థానం బుధవారం బిజీబిజీగా ఉండనుంది. ఏళ్ల నాటి అయోధ్య భూవివాదం కేసులో గతవారం చరిత్రాత్మక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు.. రేపు మరో రెండు కీలక కేసులను పరిష్కరించనుంది. శబరిమల, రఫేల్‌ కేసుల్లో న్యాయస్థానం ఇచ్చిన తీర్పులపై దాఖలైన రివ్వ్యూ పిటిషన్లపై కోర్టు రేపు తీర్పులివ్వనుంది.  శబరిమల వ్యవహారం.. కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి 10 నుంచి 50ఏళ్ల వయసు మహిళల ప్రవేశంపై ఏళ్ల తరబడి కొనసాగుతున్న నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తివేసిన విషయం తెలిసిందే. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ 2018 సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. అయితే, ఈ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పదుల సంఖ్యలో రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపి ఫిబ్రవరి 6న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. తాజాగా రేపు తీర్పు వెలువరించనుంది. రఫేల్‌ వివాదం.. దేశంలో రాజకీయ వివాదానికి తెరలేపిన రఫేల్‌ యుద్ధ విమానాల ఒప్పందంలో కేంద్రానికి క్లీన్‌చిట్‌ ఇస్తూ 2018 డిసెంబరు 14వ తేదీన సుప్

ఆటోను డ్డీ కొన్న కారు

కడప జిల్లా: ఆటోను కారు  ఢీకొనడంతో ఆటోలో ఉన్న ఆరుగురు ప్రయాణీకులకు తీవ్రగాయాలైన ఘటన బుధవారం లక్కిరెడ్డిపల్లె- రామాపురం ప్రధాన రహదారిలో చోటు చేసుకుంది. లక్కిరెడ్డిపల్లె- రామాపురం ప్రధాన రహదారిలో ఈడిగపల్లె క్రాస్‌ వద్ద రామాపురం నుండి ప్రయణీకులతో వస్తున్న ఆటోను, కడప వైపు వెళుతున్న కారు  ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు గుర్తించి క్షతగాత్రులను లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో రామచంద్రా రెడ్డి శరీరమంతా కాలిపోయింది. మరో మహిళ తలకు తీవ్ర గాయాలయ్యాయి. మిగిలినవారు స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

జగన్ గారి ఇసుకాసుర లీలలు బయటపడ్డాయి.

అమరావతి : ట్విట్టర్ జగన్ గారి ఇసుకాసుర లీలలు బయటపడ్డాయి.  వైకాపా ఇసుక దొంగలు అడ్డంగా దొరికారు.  5 నెలల్లో 42 మంది భవన నిర్మాణ కార్మికులని మింగేసిన పాపం వీరిని ఊరికే వదలదు భవన నిర్మాణ కార్మికుల నోటి దగ్గర కూడు లాక్కొని వైకాపా నేతలు అవినీతి కోటలు నిర్మిస్తున్నారు.  వరద వలనే ఇసుక దొరకడం లేదు అని చిలక పలుకులు పలుకుతున్న జగన్ గారు భవన నిర్మాణ కార్మికులకు క్షమాపణలు చెప్పాలి సిమెంట్ కంపెనీల నుండి జే ట్యాక్స్ వసూలు అయ్యే వరకూ వరద కారణంగా ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలిపోతూనే ఉంటుంది వైకాపా ఇసుక మాఫియా లిస్ట్ ర్యాంపుల దగ్గర క్యూ కట్టిన ట్రాక్టర్లలా పెరుగుతూనే ఉంది... _ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

డ్వాక్రా మహిళలకు 4 విడతలలో రుణమాఫీ

డ్వాక్రా మహిళలకు 4 విడతలలో రుణమాఫీ చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు హోంమంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో వెలుగు వీవోఏల సమావేశంలో పాల్గొన్న ఆమె... జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలనూ సీఎం నెరవేరుస్తారన్నారు.

ప్రభుత్వ శాఖలు, విభాగాలకు సీఎం కార్యాలయాల్లో ఈ రెండు ఫొటోలే వాడాలి

Image
ప్రభుత్వ శాఖలు, విభాగాలకు సీఎం కార్యాలయాల్లో ఈ రెండు ఫొటోలే వాడాలి..! సీఎం కార్యాలయం నుండి ఆదేశాలు జారీ .. రాష్ట్ర సంక్షేమ పథకాల్లో గానీ.. ప్రభుత్వం ఏర్పాటు చేసే కార్యక్రమాల్లోనూ ముఖ్యమంత్రి ఫోటోలను తప్పకుండా ఉపయోగిస్తారు.  ఇక వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాలకు సీఎం కార్యాలయం ముఖ్యమైన ఆదేశాలను జారీ చేసింది.  ప్రభుత్వం తరపున చేసిన కార్యక్రమం ఏదైనా.. రాసిన వార్త ఏదైనా.. లేదా ఏ ప్రకటన వచ్చినా..  సీఎంకు సంబంధించి ఈ రెండు ఫోటోలు మాత్రమే వాడాలంటూ సీఎం కార్యాలయం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గతంలో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీ ప్రభుత్వ అధికార మాసపత్రిక కవర్ పేజ్‌పై జగన్ ఫోటోను బ్లాక్ అండ్ వైట్‌లో ముద్రించడం పెద్ద సంచలనం అయింది.  అంతేకాకుండా ఆ పత్రిక ప్రచురణను కూడా ఆగిపోయింది.  ఇక ఆ తర్వాత ప్రభుత్వం తరపున జరిగే కార్యక్రమాలన్నింటికీ కూడా జగన్ ఫోటోలతో కూడిన బ్యానర్లను రూపొందించేవారు.  అయితే ఆ బ్యానర్లలలో పలు రకాల ఫోటోలను వాడుతుండటంతో.. సీఎం జగన్ అన్ని ప్రభుత్వ శాఖలకు క్లారిటీ ఇచ్చారు.

యూజర్లకు షాక్ ఇచ్చిన ఇన్‌స్టాగ్రామ్.. ఇకపై లైకులు లేనట్లే..!

Image
యూజర్లకు షాక్ ఇచ్చిన ఇన్‌స్టాగ్రామ్.. ఇకపై లైకులు లేనట్లే..! ఇన్‌స్టాగ్రామ్.. ఈ మధ్యకాలంలో యువత ఎక్కువగా వాడుతున్న సోషల్ మీడియా యాప్.  ఫేస్‌బుక్ మరుగునపడిన తర్వాత ఇన్‌‌స్టాకు యూజర్లు విపరీతంగా పెరిగిపోయారు.  ఇక ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ తన వినియోగదారులకు షాక్ ఇవ్వనుంది.   ఎప్పటినుంచో పోస్టులకు లైక్స్ కనిపించకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంస్థ.. ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టే ప్రతీ వీడియో, ఫోటోకు వచ్చే లైక్ ఆప్షన్స్‌లో పలు మార్పులు తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైంది.  ఆ లైకులు కేవలం పెట్టిన వ్యక్తికి మాత్రమే కనిపిస్తాయని.. ఫాలోవర్స్‌, బ్రౌజ్ చేసే ఇతర వ్యక్తులకు లైకులు కనిపించకుండా ఉండేలా సరికొత్త ఫీచర్‌ను తీసుకురానున్నారు.  ఈ విధానాన్ని అమెరికాలో ప్రారంభించనుండగా.. త్వరలోనే ఇండియాలో కూడా ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ ఆప్షన్‌ను ఇండియాలో తీసుకొస్తే.. కొంతమేరకు నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.  భారత్‌లో లైకుల ద్వారానే బిజినెస్ జరుగుతుందని.. ఏదైనా కంపెనీ తన బ్రాండ్‌ను ప్రమోట్ చేయాలంటే.. లైకులే కీలకపాత్ర పోషిస్తా

లక్షలు బిల్లు అయ్యిందని, ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో వైద్యం అందించేందుకు ఆసుపత్రి వర్గాలు నిరాకరిస్తున్నాయి

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం సందర్భంగా ఆమెను రక్షించబోయి తీవ్రంగా గాయపడిన అటెండర్ చంద్రయ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం చంద్రయ్య డీఆర్డీఓ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి సీరియస్ గా ఉన్నా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని చంద్రయ్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే రూ.5 లక్షలు బిల్లు అయ్యిందని, ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో వైద్యం అందించేందుకు ఆసుపత్రి వర్గాలు నిరాకరిస్తున్నాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో చంద్రయ్యకు ఏం జరుగుతుందో అని వారు ఆందోళన చెందుతున్నారు. తక్షణం ప్రభుత్వం స్పందించి చంద్రయ్యకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రమాదానికి గురైన రాజశేఖర్ కారును పోలీసులు సీజ్ చేశారు. పోలీస్ స్టేషన్ కు తరలించి, కేసు నమోదు చేశారు

సినీ హీరో రాజశేఖర్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. రామోజీ ఫిలిం సిటీ నుంచి ఔటర్ రింగ్ రోడ్డుపై వస్తుండగా అప్పా జంక్షన్ వద్ద పెద్ద గోల్కొండ ప్రాంతంలో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కారు ధ్వంసమైనప్పటికీ సకాలంలో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో రాజశేఖర్ క్షేమంగా బయటపడ్డారు. మరోవైపు, ప్రమాదానికి గురైన రాజశేఖర్ కారును పోలీసులు సీజ్ చేశారు. పోలీస్ స్టేషన్ కు తరలించి, కేసు నమోదు చేశారు. ఈ కారులో మద్యం సీసాలు లభించాయి. ప్రమాద సమయంలో కారు వేగం 180 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. మితిమీరిన వేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడమే ప్రమాదానికి కారణమని చెప్పారు. ఇప్పటికే రాజశేఖర్ కారుపై మూడు ఓవర్ స్పీడ్ చలానాలు ఉన్నాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఒకటి, సైబరాబాద్ పరిధిలో రెండు చలానాలు ఉన్నాయి. రూ. 3 వేల జరిమానా పెండింగ్ లో ఉంది. మరోవైపు ప్రమాద ఘటనపై రాజశేఖర్ స్పందిస్తూ, ఆ సమయంలో కారులో తానొక్కడినే ఉన్నానని తెలిపారు. రామోజీ ఫిలిం సిటీ నుంచి వస్తుండగా ప్రమాదం జరిగిందని... వేరే కారులో ఉన్నవారు తనను బయటకు తీశారని చెప్పారు. కారు నుంచి బయటకు వచ్చిన వెంటనే పోలీసులకు, తన కుటుంబసభ్యులకు ప్రమా

గాజా, ఇజ్రాయెల్ మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు

గాజా, ఇజ్రాయెల్ మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాజాపై తాజాగా ఇజ్రాయెల్ మరోసారి భీకర దాడితో విరుచుకుపడింది. పాలస్తీనియన్‌ ఉగ్రసంస్థ ఇస్లామిక్‌ జీహాద్‌ నాయకుడు బాహా అబు అల్‌ అట్టా లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించింది. దీంతో అబుతో పాటు అతడి భార్య, ఇద్దరు కుమారులు హతమయ్యారు. ఈ దాడిలో మరో 10 మంది మృతి చెందడమే కాకుండా మరో 25 మంది గాయాలపాలయ్యారు. దీంతో ఇరాన్‌ సాయంతో ఇస్లామిక్‌ జీహాద్‌ ప్రతీకార చర్యలకు పాల్పడింది. ఇజ్రాయెల్‌పై క్షిపణులతో దాడులు చేస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈజిప్టు రాజధాని కైరోకు ఐక్యరాజ్యసమితి మిడిల్‌ ఈస్ట్‌ రాయబారి వెళ్లారు. ఈ పరిస్థితులపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు స్పందిస్తూ... ఇస్లామిక్‌ జీహాద్‌ నాయకుడు బాహా అబు అల్‌ అట్టా పెను ప్రమాదంగా మారాడని, గాజా-ఇజ్రాయెల్‌ సరిహద్దులో రాకెట్లు, డ్రోన్లతో దాడులకు ప్రణాళికలు రచించాడని తెలిపారు. అందుకే ఈ దాడి చేశామన్నారు. తమ దేశ భద్రత కోసం అన్ని చర్యలూ తీసుకుంటామని నెతన్యాహు స్పష్టం చేశారు. ఈ దాడికి తాము తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ఇస్లామిక్‌ జీహాద్‌తో పాటు మరో ఉగ్ర సంస్థ హమాస్‌ కూడా హెచ్చరించ

శబరిమలలో 10 వేల మంది పోలీసు అధికారులతో భద్రతా ఏర్పాటు

శబరిమలలో 10 వేల మంది పోలీసు అధికారులతో భద్రతా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 16వ తేదీనుంచి మూడు నెలలపాటు శబరిమలలో అయ్యప్ప స్వామి పూజలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా వేలాదిమంది భక్తులు అయ్యప్పను దర్శించుకోవడానికి వస్తారు. 24 మంది ఎస్‌పిలు, ఎఎస్‌పిలు, 112 మంది డిప్యూటీ ఎస్‌పిలు, 264 మంది ఇన్‌స్పెక్టర్లు, 1185 మంది సబిన్‌స్పెక్టర్లను శబరిమలలో విధుల నిర్వహణకు ప్రభుత్వం పంపింది. అలాగే 307 మంది మహిళా పోలీసులతో సహా 84-2 మంది సివిల్‌ పోలీస్‌ అధికారులను శబరిమల ఆలయం వద్ద భద్రత కోసం నియమించారు.

కూతురి పెళ్లి విషయంలో మాట తప్పాననే మనోవేదన ఓ తండ్రి బలవన్మరణo

అనంతపురం జిల్లా: రాయలచెరువు (యాడికి): కూతురి పెళ్లి విషయంలో మాట తప్పాననే మనోవేదన ఓ తండ్రి బలవన్మరణానికి దారి తీసిన విషాద ఘటన మంగళవారం రాయలచెరువు చెరువులో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. స్థానిక ఉన్నత పాఠశాల సమీపంలో నివసిస్తూ కార్మికుడిగా జీవనం సాగిస్తున్న నాగరాజుకు ముగ్గురు కూతుళ్లు. పెద్దకూతురు అఖిలకు ఆరు నెలల కిందట స్వయానా తన అక్క కొడుకు నెట్టికంటయ్యతో నిశ్చితార్థం చేశాడు. అయితే ఇటీవల తనకు ఈ వివాహం ఇష్టం లేదని కూతురు బాధపడటం, తన దూరపు బంధువైన మరో వ్యక్తికి ఇచ్చి వివాహం చేద్దామని భార్య ఒత్తిడి తేవడంతో నాగరాజు మానసిక సంఘర్షణకు గురయ్యాడు. తన అక్కకు ఇచ్చిన మాట తప్పలేక, భార్య, కూతురిని ఇబ్బంది పెట్టలేక నాగరాజు మనస్తాపానికి గురయ్యాడు. భార్య, కూతురు అనుకున్నట్లుగానే పెన్నహోబిళంలో భార్య తరపున బంధువు రాజశేఖర్‌తో ఆదివారం ఉదయం పెళ్లి జరిగిపోవడంతో నాగరాజు కనిపించకుండా పోయాడు. అదే రోజు 11 గంటల సమయంలో అతనికి సంబంధించిన ద్విచక్రవాహనం, చెప్పులు, లుంగీ స్థానిక చెరువు వద్ద లభించాయి. పోలీసులు, బంధువులు అంతటా గాలించినా అతని ఆచూకీ లభ్యం కాలేదు. కూతురును ఇంటికి పిలుచుకొని వస్తే వస్తాడేమోనని సోమవారం

సిగ్నల్‌ ట్యాంపరింగ్‌ చేస్తూ రైళ్లలో దోపిడీలకు పాల్పడుతున్న పార్థి ముఠా సభ్యుడిని మహబూబ్‌నగర్‌ జీఆర్పీ పోలీసులు అరెస్ట్‌ చేశారు

సికింద్రాబాద్:  సిగ్నల్‌ ట్యాంపరింగ్‌ చేస్తూ రైళ్లలో దోపిడీలకు పాల్పడుతున్న పార్థి ముఠా సభ్యుడిని మహబూబ్‌నగర్‌ జీఆర్పీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మంగళవారం సికింద్రాబాద్‌ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సికింద్రాబాద్‌ రూరల్‌ డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, అర్బన్‌ డీఎస్పీ రాజేంద్రప్రసాద్‌లు వివరాలను వెల్లడించారు. మహారాష్ట్ర షోలాపూర్‌నకు చెందిన బాలాజీ శ్రీరాంగ్‌ షిండే అలియాస్‌ బాలాజీ షిండే(25) పార్థి ముఠాలోని తొమ్మిది మందిలో ఒకడు. రైలు సిగ్నల్‌ ట్యాంపరింగ్‌లో సిద్ధహస్తుడు. 2016 నుంచి ముఠాలో పనిచేస్తున్నాడు. రైల్వే యాప్‌ ద్వారా రైలు వచ్చే సమయాన్ని గుర్తించి నిర్దేశిత ప్రాంతానికి రైలు చేరుకుని నిలిచేలా సిగ్నల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడుతుంటారు.  రైలు ఆగిన వెంటనే ముఠా సభ్యుల్లో కొందరు కింద వంగి ఉండగా వారిపై మరికొందరు ఎక్కి స్లీపర్‌ కోచ్‌లో కిటికీ పక్కన కూర్చున్న మహిళల మెడల్లోని బంగారు గొలుసులను లాక్కుని పారిపోతారు. పట్టుకునేందుకు ప్రయత్నిస్తే రాళ్లతో దాడి చేస్తారు. గత ఏడాది సెప్టెంబర్‌లో పార్థి గ్యాంగ్‌ మహబూబ్‌నగర్‌ కౌకుంట్ల రైల్వేస్టేషన్‌ వద్ద సిగ్నల్‌ను ట్యాంపరింగ్‌ చేసి, ఆ సమయంల

ప్రముఖ నటుడు రాజశేఖర్‌ కారుకు ప్రమాదం

హైదరాబాద్:  శంషాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై ప్రముఖ నటుడు రాజశేఖర్‌ కారుకు ప్రమాదం జరిగింది. పెద్ద గోల్కొండ దగ్గర అదుపు తప్పి కారు బోల్తా పడింది. రాజశేఖర్ కారు మూడు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో రాజశేఖర్‌తో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. అయితే వెంటనే కారులోని బెలూన్లు తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

శబరిమలలో మండల పూజ ప్రారంభం సందర్భంగా ఈ నెల 16వతేదీ నుంచి ఆలయం తెరుస్తున్న కేరళ ప్రభుత్వం

తిరువనంతపురం (కేరళ):  కేరళ రాష్ట్రంలోని శబరిమలలో మండల పూజ ప్రారంభం సందర్భంగా ఈ నెల 16వతేదీ నుంచి ఆలయం తెరుస్తున్న నేపథ్యంలో కేరళ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని సుప్రీంకోర్టు గత ఏడాది సెప్టెంబర్ 28 న తీర్పు ఇచ్చింది.  ఈ నేపథ్యంలో కొందరు మహిళలు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించగా భక్తులు అడ్డుకున్నారు. ఆ సందర్భంగా ఆలయంలో పెద్ద వివాదం చోటుచేసుకుంది.  ఈ నేపథ్యంలో మండల పూజ కోసం ఈ నెల 16 వతేదీ నుంచి అయ్యప్ప ఆలయాన్ని తెరుస్తున్న దృష్ట్యా కేరళ పోలీసులు పదివేలమందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 24 మంది ఎస్పీలు, ఏఎస్పీలు, 112 మంది డీఎస్పీలు,264 మంది ఇన్‌స్పెక్టర్లు, 1185 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు, 8,402 మంది సివిల్ పోలీసులు, 307 మంది మహిళా పోలీసులను అయ్యప్ప దేవాలయ కాంప్లెక్స్ వద్ద బందోబస్తు కోసం నియమించారు. కాగా శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అధిగమించడానికి చట్టాలు రూపొందించడం సాధ్యం కాదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు.  మొత్తంమీద భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ ఏడాద

నేడు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ప్రారంభం కానుంది.

బ్రెజిల్ నేడు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ప్రారంభం కానుంది. 'ఉగ్రవాద నిర్మూలనే ప్రధాన అంశంగా బ్రిక్స్ సదస్సు' అనే ఇతివృత్తంతో జరగనున్న ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా ఆయా దేశాల అగ్రనేతలు పాల్గొననున్నారు.  బ్రిక్స్ దేశాలు డిజిటల్ ఎకానమీ, శాస్త్ర, సాంకేతికత, నూతన ఆవిష్కరణలు వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంపై దృష్టి సారించనున్నాయని మంగళవారం బ్రెజిల్​కు బయల్దేరి వెళ్లేముందు ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.  ఉగ్రవాద నిర్మూలన విషయంలో పరస్పర సహకారానికి యంత్రాంగాలను కూడా రూపొందించుకుంటాయని ఆయన స్పష్టం చేశారు.  నేటి నుంచి 15వ తేది వరకు ఈ సమావేశం జరగనుంది బ్రెజిల్​ - భారత్​ ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా అధ్యక్షుడు జైర్ బోల్సోనారోతో సమావేశం కానున్నట్లు మోదీ తెలిపారు.  రక్షణ, భద్రత, వాణిజ్యం, వ్యవసాయం, ఇంధనం, అంతరిక్ష రంగాల్లో పరస్పర సహకారం పెంపునకు కృషి చేస్తామని చెప్పారు. మోదీ... రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​తోనూ వేర్వేరుగా ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు.  బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ ముగింపు వేడుక, బ్రిక్స

మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ...

Image
ముంబై: వివిధ మార్కెట్లలో  బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.  24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.38,070, విజయవాడలో రూ.38,740, విశాఖపట్నంలో రూ.39,140, ప్రొద్దుటూరులో రూ.38,800గా ఉంది.  ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.36,300, విజయవాడలో రూ.35,900, విశాఖపట్నంలో రూ.36,000, ప్రొద్దుటూరులో రూ.35,950గా ఉంది.  వెండి కిలో ధర హైదరాబాదులో రూ.43,900, విజయవాడలో రూ.45,500, విశాఖపట్నంలో రూ.45,500, ప్రొద్దుటూరులో రూ.45,500 వద్ద ముగిసింది.

మీ ఫోన్‌లో ఈ యాప్ ఉంటే.. వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ..!

స్మార్ట్ ఫోన్ వచ్చినప్పటి నుంచి.. సౌలభ్యాలు ఎన్ని పెరిగాయో.. అనర్థాలు, మోసాలు కూడా అంతే పెరిగాయి.  ఫోన్‌లో ఇంటర్నెట్ ఉన్నప్పుడు ఎదో యాప్‌ డౌన్‌లోడ్ చేయడం అందరికీ అలవాటే.  అయితే ఆ యాప్‌లలో కొన్ని మోసాలకు కేరాఫ్ అడ్రస్‌లుగా మారాయి.  మన ఫోన్‌లో కొన్ని యాప్స్ డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు మన ప్రమేయం లేకుండానే కొన్ని ప్రక్రియలు జరిగిపోతుంటాయి.  దానికి కారణం కొన్ని మాల్ వేర్ ఎటాక్స్. అన్ని యాప్స్ క్షుణ్ణంగా పరీక్షించి డౌన్‌లోడ్ చేసుకుని.. ఇక మన ఫోన్ సేఫ్ అనుకున్నా.. మళ్లీ ఏదో రూపంలో ప్రమాదం పొంచి ఉంటూనే ఉంది.  ఎప్పటికప్పుడు ఈ మాల్‌వేర్ దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ మాల్‌వేర్‌కు సంబంధించిన యాప్స్‌ని గూగుల్ ఎప్పటికప్పుడు గుర్తిస్తూ డిలీట్ చేస్తూనే ఉంది.  అయినా కూడా కొత్తకొత్త యాప్స్‌లో మాల్‌వేర్ మళ్లీ బయటపడుతోంది. తాజాగా మరోసారి ఇలాంటి పరిస్థితే వచ్చింది. ai.type కీబోర్డ్ యాప్‌లో మాల్‌వేర్ ఉన్న విషయం బయటపడటంతో.. స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది.  మొబైల్ టెక్నాలజీ సంస్థ అప్‌స్ట్రీమ్‌కు చెందిన పరిశోధకులు ai.type కీబోర్డ్ యాప్‌ యూజర్లను దోచుకున్న విషయాన్ని బయటపెట్టారు.  ఈ యాప్

నవంబర్ 13 బుధవారం 2019 .. మీ రాశి ఫలితాలు

మేషం : ఈ రోజు ఏ పని చేయాలన్నా బద్దకం ఉంటుంది. పనులు వాయిదా వేసి విశ్రాంతి కోరుకుంటారు. నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త అవసరం. అలాగే ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండటం మంచిది. తొందరపాటు పనికి రాదు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. వృషభం : ఈ రోజు ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి రుచికరమైన భోజనాన్ని ఆస్వాదిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఖర్చు అధికంగా ఉంటుంది. గృహ సంబంధ విషయాల్లో ఎక్కువ సమయం వెచ్చిస్తారు. మిథునం : కొత్త పనులు పారంభించటానికి, వాయిదా వేస్తున్న పనులు పూర్తి చేయటానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు. ఇంటర్వ్యూలకు వెళ్లే ఉద్యోగార్థులు అనుకూల ఫలితం సాధిస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కర్కాటకం : ఈ రోజు ఆర్థిక వ్యవహారాల్లో జాగత్త అవసరం. పెట్టుబడులలో అజాగ్రత్త, తొందరపాటు పనికి రాదు. మీ తొందరపాటు వల్ల డబ్బు నష్టపోయే అవకాశముంది. అలాగే మీ శత్రువుల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. వారిపై ఓ కన్నేసి ఉంచండి. మీ మాట తీరు కారణంగా వివాదాల్లో ఇరుక్కునే అవకాశముంది. జాగ్రత్తగా ఉండటం మంచిద

అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో సుప్రీం కోర్టు నేడు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది.

దిల్లీ:  యావద్దేశం ఉత్కంఠగా ఎదురు చూసిన అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో సుప్రీం కోర్టు నేడు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు వెల్లడించింది. వివాదాస్పద స్థలాన్ని అలహాబాద్‌ హైకోర్టు మూడు భాగాలుగా విభజించడం ఆమోదయోగ్యం కాదంది. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలాన్ని హిందువులకు అప్పగించాలని పేర్కొంది. ఆ స్థలంలో ఆలయం నిర్మించాలని స్పష్టం చేసింది.  మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలం మసీదు నిర్మాణానికి ముస్లింలకు అయోధ్యలోనే ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని కోర్టు నిర్ణయించింది. ఇందుకోసం సున్నీ వక్ఫ్‌ బోర్డుకు 5ఎకరాల స్థలం కేటాయించాలని న్యాయమూర్తులు ఆదేశించారు. కేంద్రం లేదా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వివాదాస్పద స్థలానికి సంబంధించి 3 నెలల్లో కేంద్రం ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. వివాదాస్పద స్థలాన్ని ట్రస్ట్‌ అధీనంలో ఉంచాలని ఆదేశించింది. ఆలయ నిర్మాణం, ట్రస్ట్‌ విధివిధానాలపై 3నెలల్లోగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. అంతకుముందు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ రంజన్‌ గొగొ

అయోధ్య తీర్పు చెప్పే న్యాయమూర్తులు వీరే.

Image
అయోధ్య తీర్పు చెప్పే న్యాయమూర్తులు వీరే.. ఈ కేసును విచారిస్తున్న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ నజీర్ ముస్లిం న్యాయమూర్తి. ఈ కేసులో ఆగస్టు 6 నుంచి రోజువారీగా కేసును విచారించిన రాజ్యాంగ ధర్మాసనం.. శనివారం తీర్పు చెప్పబోతోంది అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం కేసులో శనివారం  తుది తీర్పు వెలువడనుంది.  అయోధ్య భూవివాదం కేసులో  ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పబోతోంది.  సీజేఐ రంజన్ గొగోయ్ సారథ్యం వహిస్తారు. జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌లు ధర్మాసనంలోని ఇతర నలుగురు సభ్యులు.  ఈ కేసును విచారిస్తున్న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ నజీర్ ఒక్కరే ముస్లిం న్యాయమూర్తి. ఈ కేసులో ఆగస్టు 6 నుంచి రోజువారీగా కేసును విచారించిన రాజ్యాంగ ధర్మాసనం.. శనివారం తీర్పు చెప్పబోతోంది. 1. జస్టిస్ రంజన్ గొగోయ్, భారత ప్రధాన న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఈ బెంచ్‌కు నాయకత్వం వహిస్తున్నారు. 3 అక్టోబర్ 2018 న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. నవంబర్

అయోధ్య వివాదంపై సుప్రీం ఏకగ్రీవ తీర్పు

అయోధ్య వివాదంపై సుప్రీం ఏకగ్రీవ తీర్పు అయోధ్య వివాదాస్పద స్థలం హిందూవులదేనని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది.  2.77 ఎకరాల వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని సుప్రీంకోర్టు తీర్పు. మసీదు నిర్మాణానికి ముస్లింలకు అయోధ్యలోనే 5 ఎకరాల స్థలం ఇవ్వాలని తీర్పు. స్థలం స్వాధీనం చేసుకునేందుకు 3 నెలల్లో ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఆదేశం. ఏకగ్రీవ తీర్పు వెలువరించిన ఐదుగురు  న్యాయమూర్తులు. వివాదాస్పద కట్టడం ఉన్న స్థలం హిందువులదే: సుప్రీం కోర్టు అయోధ్య భూవివాదంపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఐదుగురు న్యాయమూర్తులు ఏకగ్రీవ తీర్పును వెలువరించారు. వివాదాస్పద కట్టడం ఉన్న స్థలం హిందువులదే అని స్పష్టం చేసింది.  అయోధ్యలో 5 ఎకరాల స్థలాన్ని కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం సున్నీ వక్ఫ్‌ బోర్డుకు ఇవ్వాలని ఆదేశించింది సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం. వివాదస్పద స్థలానికి సంబంధించి 3 నెలల్లో కేంద్రం ట్రస్ట్​ ఏర్పాటు చేయాలి: సుప్రీం వివాదాస్పద స్థలానికి సంబంధించి 3 నెలల్లో కేంద్ర ప్రభుత్వం  ట్రస్ట్ ఏర్పాటు చేయాలి. వివాదాస్పద స్థలాన్ని ట్రస్ట్ అధీనంలో ఉంచాలి. ఆలయ నిర్మాణం, ట్రస్ట్ విధివిధానాలపై 3 నెలల