వెంకీ వర్సెస్ బాలయ్య 11వ సారి. ఈ సారి పైచేయి ఎవరిదో.!

తెలుగు చిత్రసీమలో ఆ ఇద్దరు అగ్రనటులు. అందులో ఒకరు మాస్ ఆడియన్స్ ని మెప్పించిన హీరో అయితే మరొకరు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకున్న హీరో. ఇలా క్లాస్, మాస్ హీరోలుగా పేరు తెచ్చుకున్న హీరోలు నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్. అయితే ఈ ఇద్దరు సీనియర్లు మధ్య పెద్ద పోటీ వాతావరణం ఉండదు కానీ.వీరు సినిమాలో పలు సార్లు బాక్సాఫీస్ బరిలో పోటీ పడ్డాయి. తాజాగా కూడా ఈ ఇద్దరు మరోసారి పోటీ పడబోతున్నారు. వెంకటేష్ 'వెంకీ మామ' చిత్రంతో వస్తుంటే, బాలయ్య 'రూలర్' సినిమాతో వస్తున్నారు.

ఇక వీరు అంతకముందు బాక్సాఫీస్ బరిలో 10 సార్లు తలపడ్డారు. అయితే ఈ పది సార్లులో ఎవరు పై చేయి సాధించారో ఒక్కసారి చూస్తే..

మొదటిసారిగా వీరిద్దరు 1986లో పోటీ పడ్డారు. ఆ సంవత్సరం ఆగష్టు 7న 'దేశోద్ధారుకుడు' సినిమాతో వస్తే, వెంకటేష్ ఆగష్టు 14న 'కలియుగ పాండవులు' సినిమాతో వచ్చాడు. అయితే ఈ రెండు సినిమాలు మంచి విజయాలే సాధించాయి. ఇక రెండోసారి వెంకటేష్ 1987 మే8న 'అజేయుడు' సినిమాతో రాగా, అటు బాలయ్య మే12 'ప్రెసిడెంట్ గారి అబ్బాయి' సినిమాతో బాక్సాఫీస్ బరిలో దిగాడు. కాకపోతే ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

ఇక అదే సంవత్సరంలో బాలయ్య మే 19న 'మువ్వగోపాలుడు' సినిమా వస్తే, తర్వాత అదే నెలలో మే 29న 'భారతంలో అర్జునుడు' 'త్రిమూర్తులు' రెండు సినిమాలతో ముందుకొచ్చాడు. ఇందులో బాలయ్య సినిమా సూపర్ హిట్ కాగా, వెంకటేష్ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. తర్వాత వెంకటేష్ 1989 జనవరి 14న రక్త తిలకం సినిమాతో ముందుకు రాగా, బాలయ్య ' ఇన్స్పెక్టర్ ప్రతాప్' సినిమాతో వచ్చాడు. ఈ రెండు సినిమాలు యావరేజ్ గా ఆడాయి. నెక్స్ట్ 1989 జూన్ 29న ఒకేరోజు బాలయ్య 'అశోక చక్రవర్తి' వెంకటేష్ 'ధృవ నక్షత్రం' సినిమాలతో బాక్సాఫీస్ బరిలో దిగారు. ఇక్కడ బాలయ్య సినిమా యావరేజ్ అవ్వగా, వెంకీ హిట్ కొట్టాడు.

ఇక తర్వాత 1990 ఏప్రిల్ 25న బాలయ్య 'నారీ నారీ నడుమ మురారి' చిత్రంతో అదిరిపోయే విజయం అందుకోగా, వెంకటేష్ దీనికంటే ముందు వెంకీ ఏప్రిల్ 17న 'అగ్గిరాముడు' సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. మళ్ళీ ఈ ఇద్దరు టాప్ హీరోలు ఆరు సంవత్సరాల తర్వాత 1996లో జనవరి 5న బాలయ్య 'వంశానికొక్కడు' తో సూపర్ హిట్ కొట్టగా, అటు వెంకీ 'ధర్మచక్రం' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇదే సంవత్సరంలో బాలయ్య మే15న 'శ్రీకృష్ణార్జున విజయం' ఫ్లాప్ కాగా, వెంకీ మే22 న వచ్చిన 'ఇంట్లో ఇల్లాలు ప్రియురాలు' సినిమా భారీ హిట్ వచ్చింది.

ఇక 2000లో జనవరి 14న బాలయ్య సినిమా 'వంశోద్ధారుకుడు' ఫ్లాప్ అవ్వగా, వెంకీ సినిమా 'కలిసుందాం రా' సినిమా సూపర్ హిట్ అయింది. తర్వాత 2001లో జనవరి 11న బాలయ్య 'నరసింహనాయుడు' ఇండస్ట్రీ హిట్ అందుకోగా, జనవారై 14న వెంకీ సినిమా 'దేవీపుత్రుడు' ఫ్లాప్ అయింది. ఇక అప్పటి తర్వాత మొన్న 2019 సంక్రాంతికి బాలయ్య 'ఎన్టీఆర్ బయోపిక్ ఫ్లాప్ కాగా, వెంకీ 'ఎఫ్2 చిత్రం సూపర్ హిట్ కొట్టింది. అయితే ఇన్నిసార్లు పోటీపడ్డ ఇద్దరు ఒకొ సమయంలో పైచేయి సాధించారు. మరి ఈసారి డిసెంబర్ 13న వెంకీమామా వస్తుంటే, డిసెంబర్ 20న రూలర్ వస్తుంది. ఇందులో ఏ సినిమా హిట్ అయ్యి,..ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..