Posts

Showing posts from December, 2019

తెలంగాణపై కన్నేసిన బీజేపీ : రంగంలోకి ఆర్ఎస్ఎస్!

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా చెప్పుకుంటోన్న బీజేపీ.. ఇప్పుడు క్షేత్ర స్థాయిలో బలోపేతంపై దృష్టి పెట్టింది. కాకపోతే, బీజేపీని దేశవ్యాప్తంగా లిఫ్ట్‌ చేసిన ఆర్‌ఎస్‌ఎస్సే ఇప్పుడు తెలంగాణలో కూడా ఆ బాధ్యతను భుజానకెత్తుకుందని అంటున్నారు. అందుకే ఎప్పుడూ లేని విధంగా ఈసారి హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు విజయసంకల్ప శిబిర్ పేరుతో శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసిందంట ఆర్ఎస్‌ఎస్‌. ఈ కార్యక్రమానికి ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భగవత్‌తో పాటు ఇతర ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో బీజేపీని మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తారంటున్నారు. శిక్షణ తరగతుల నేపథ్యంలో మోహన్ భగవత్ మూడు రోజులపాటు హైదరాబాద్‌లోనే మకాం వేస్తారు. తెలంగాణలో సంఘ్ సిద్ధాంతాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి? తద్వారా రాష్ట్రంపై పట్టు సాధించేందుకు ఉన్న అవకాశాలు సంఘ్ పరివార్ కార్యకర్తలకు వివరిస్తారట. రాష్ట్రానికి చెందిన బీజేపీ ప్రముఖ నేతలంతా ఈ శిబిరంలో పాల్గొంటారు. అంతే కాకుండా 16వేల మంది సంఘ్ పరివార్ ముఖ్యనేతలు సైతం ఈ సమావేశాలకు హాజరవుతున్నారట. ముఖ్య నేతలు అంతా ఆర్ఎస్‌ఎస్‌ డ్ర

బంజారాహిల్స్‌లో భారీ చోరీ

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పనిమనిషి ఉన్నదంతా ఊడ్చుకుని పరారయ్యాడు. వివరాలు.. బంజారాహిల్స్‌ రోడ్‌ నం 12లోని అంకుర్‌ ఆస్పత్రి సమీపం లో వ్యాపారి కపిల్‌గుప్తా నివసిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు ఓ శుభకార్యానికి కుటుంబసభ్యులతో కలసి వెళ్లారు. తిరిగి సోమ వారం తెల్లవారుజామున 2.45 గంటలకు ఇంటికి వచ్చారు. ఇంటిలోకి వెళ్లిచూడగా బెడ్‌రూంలో బీరువా తాళాలు పగులగొట్టి ఉండటమే కాకుండా ఆభరణాల బాక్సులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. వెంటనే బంజారాహిల్స్‌ పోలీసులకు ఆయన సమాచారం ఇచ్చారు. తమ ఇంట్లో నెలన్నర క్రితం బిహార్‌కు చెందిన రామ్‌(29) అనే వ్యక్తిని పనిమనిషిగా నియమించుకున్నామని పోలీసులకు తెలిపారు. పెళ్లికి వెళ్తూ ఇంటి బాధ్యతలను పనిమనిషికి అప్పగించినట్లు పేర్కొన్నారు. ఇదే అదనుగా భావించిన రామ్‌ బీరువాలోని రూ.5.70 లక్షల నగదు, రూ.కోటి విలువ చేసే బంగారు వజ్రాభరణాలను చోరీ చేసి ఇంటికి తాళంవేసి తాళం చెవులను గేటు వద్ద పెట్టి ఉడాయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో కపిల్‌గుప్తా మేనల్లుడు ఇంటికి వచ్చి డ్రెస్‌

ఆర్టీసీ పై సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం

సమ్మె కాలంలో ఆర్టీసీ కార్మికులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్.. ఆ తరువాత వారిపై వరాలు కురిపించారు. ఆర్టీసీని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే... ఆర్టీసీ సమ్మె ముగియడంతో అధికార పార్టీలో కొత్త చర్చ మొదలైంది. ఆర్టీసీ సమ్మెకు ముందు సంస్థ చైర్మన్‌గా ఒకరిద్దరి పేర్లు చక్కర్లు కొట్టాయి. అయితే అంతలోనే ఆర్టీసీ సమ్మె మొదలుకావడం... అసలు సంస్థ ఉంటుందో లేదో అనే చర్చ మొదలుకావడంతో టీఆర్ఎస్‌లో ఆర్టీసీ చైర్మన్ గురించి పెద్దగా చర్చ జరగలేదు. అయితే తాజాగా మరోసారి ఆర్టీసీ చైర్మన్ పదవి అధికార పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. త్వరలోనే అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కీలకమైన కార్పొరేషన్ పదవులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్న సీఎం కేసీఆర్... ఆర్టీసీ చైర్మన్ పదవిని సీనియర్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. నిజానికి బాజిరెడ్డి గోవర్ధన్‌కు రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవి ఇస్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ పోస్టును పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇచ్చిన కేసీఆర్... బాజిరెడ్డికి కీలకమైన ఆర్టీసీ చైర్మన్ పదవి ఇవ్వాలని దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో పాటు

వెంకీ వర్సెస్ బాలయ్య 11వ సారి. ఈ సారి పైచేయి ఎవరిదో.!

తెలుగు చిత్రసీమలో ఆ ఇద్దరు అగ్రనటులు. అందులో ఒకరు మాస్ ఆడియన్స్ ని మెప్పించిన హీరో అయితే మరొకరు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకున్న హీరో. ఇలా క్లాస్, మాస్ హీరోలుగా పేరు తెచ్చుకున్న హీరోలు నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్. అయితే ఈ ఇద్దరు సీనియర్లు మధ్య పెద్ద పోటీ వాతావరణం ఉండదు కానీ.వీరు సినిమాలో పలు సార్లు బాక్సాఫీస్ బరిలో పోటీ పడ్డాయి. తాజాగా కూడా ఈ ఇద్దరు మరోసారి పోటీ పడబోతున్నారు. వెంకటేష్ 'వెంకీ మామ' చిత్రంతో వస్తుంటే, బాలయ్య 'రూలర్' సినిమాతో వస్తున్నారు. ఇక వీరు అంతకముందు బాక్సాఫీస్ బరిలో 10 సార్లు తలపడ్డారు. అయితే ఈ పది సార్లులో ఎవరు పై చేయి సాధించారో ఒక్కసారి చూస్తే.. మొదటిసారిగా వీరిద్దరు 1986లో పోటీ పడ్డారు. ఆ సంవత్సరం ఆగష్టు 7న 'దేశోద్ధారుకుడు' సినిమాతో వస్తే, వెంకటేష్ ఆగష్టు 14న 'కలియుగ పాండవులు' సినిమాతో వచ్చాడు. అయితే ఈ రెండు సినిమాలు మంచి విజయాలే సాధించాయి. ఇక రెండోసారి వెంకటేష్ 1987 మే8న 'అజేయుడు' సినిమాతో రాగా, అటు బాలయ్య మే12 'ప్రెసిడెంట్ గారి అబ్బాయి' సినిమాతో బాక్సాఫీస్ బరిలో దిగాడు. కాకపోతే ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యా

పదహేను సెకన్ల వీడియో చూశారా?

ట్వీట్టర్ లో కర్నూలు జిల్లాకు చెందని ఒక మహిళ పెట్టిన పదిహేను సెకన్లు వీడియో హల్ చల్ చేస్తుంది. 15 సెకన్లు వీడియో ఏకంగా లక్షల మంది షేర్ చేశారు. రీట్వీట్ చేశారు. జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి హాష్‌ ట్యాగ్ చేస్తున్నారు. ఒక్క గంటల్లోనే లక్షల మంది ట్వీట్లు చేశారు.. కొన్ని గంటల్లోనే వీడియో మొత్తం వైరల్ గా మారింది. సుగాలికి న్యాయం చేయాలని తల్లి చేసిన ట్వీట్ ఇప్పడు ట్వీట్టర్ ను ఊపేస్తుంది. దిశ కేసు ఏవిధంగా ప్రపంచ వ్యాప్తంగా ట్రెడింగ్ లోకి వచ్చిందో? ఈ వార్త కూడా కొన్ని గంటల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ట్రెండింగ్ లోకి వచ్చింది. అంతేగాకుండా దిశకు న్యాయం చేసిన విధంగా తన బిడ్డకు న్యాయం చేయాలని ఆ తల్లి కోరింది. కర్నూలులో ఒక స్కూల్ తన బిడ్డను అత్యాచారం చేసి చంపారని .. ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు తనకు న్యాయం జరగలేదని ట్వీట్టర్ లో పదిహెను సెకన్లు వీడియోను తల్లి పోస్టు చేసింది. ఇప్పడు ఇది ట్వీట్టర్ ఇదే హాట్ టాపిక్ గా మారింది. యజమాని కుమారులే. కర్నూలు నగర శివారులోని లక్ష్మీగార్డెన్‌లో ఉంటున్న ఎస్‌.రాజు నాయక్, ఎస్‌.పార్వతిదేవి దంపతుల కుమార్తె సుగాలి ప్రీతి(14) దిన్నెదేవరపాడు వద్దనున్న ఒక రాజకీయ నాయకుడికి చెందిన క

కన్న తల్లి కళ్ల ఎదురుగా... సామూహిక అత్యాచారం..ఒకే రోజు ముగ్గురు

దిశ ఘటనను ఇంకా దేశ ప్రజలు మరవనేలేదు. ఆమె అతి కిరాతకంగా హత్య చేసిన నిందితులు పోలీసుల చేతిలో హతమయ్యారు. ప్రస్తుతం దీనిపై కూడా వివాదం నడుస్తోంది. నిందితులపై పోలీసులు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పటికీ... మృగాళ్లలో కొద్దిగా కూడా మార్పు రాకపోవడం బాధాకరం. చాలా మంది మృగాళ్లు తమ అకృత్యాలను కొనసాగిస్తునే ఉన్నారు. తాజాగా... ఇలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఒకే రోజూ ముగ్గురు బాలికల పట్ల మానవ మృగాళ్లు అఘాయిత్యానికి పాల్పడ్డాయి. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.... ఇటీవల ఉత్తరప్రదేశ్ లో ఉన్నావ్ రేప్ ఘటన బాధితురాలు 48గంటలపాటు చావుతో పోరాడి ప్రాణాలు కోల్పోయింది. ఆ ఘటన మరవకముందే అదే రాష్ట్రంలో ఒకే రోజు ముగ్గురు బాలికలపై అఘాయిత్యం చోటుచేసుకుంది. 17ఏళ్ల బాలిక పై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అది కూడా బాలిక కన్న తల్లి ముందే జరగడం గమనార్హం. బాలిక తల్లి బదిర( మూగ, చెవుడు) కావడంతో... కూతురిని కాపాడుకోలేకపోయింది. కాగా... బాలిక తనపై జరిగిన దారుణాన్ని తట్టుకోలేక పురుగుల మందు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

నిర్భయ దోషి వినయ్ శర్మ తాజా చర్య విన్నంతనే ఒళ్లు మండేలా ఉంది.

కొన్నేళ్ల క్రితం నిర్భయ ఉదంతం దేశం మొత్తాన్ని దిగ్భాంత్రికి గురి చేయటమే కాదు.. అంత పాశవికంగా హింసించిన దోషుల్ని బహిరంగంగా ఉరి తీయాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున వచ్చింది. దేశంలోని న్యాయవ్యవస్థ పుణ్యమా అని నిర్భయ నిందితుల్ని దోషులుగా సుప్రీంకోర్టు తేల్చేసినప్పటికీ.. వారికి విధించిన ఉరిని మాత్రం ఇప్పటివరకూ అమలు చేయలేదు. ఇదిలా ఉంటే.. నిర్భయ కేసులో దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ తాజా చర్య విన్నంతనే ఒళ్లు మండేలా ఉంది. తనకు క్షమాభిక్ష విధించాలని అతగాడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఒక దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. దీన్ని రాష్ట్రపతి రిజెక్టు చేశారు. ఇదిలా ఉంటే.. తన పేరుతో వచ్చిన క్షమాభిక్ష్ పిటిషన్ ను తక్షణమే వెనక్కి పంపాలని..తాను దాన్ని దాఖలు చేయలేదంటూ బలుపు వ్యాఖ్యలు చేశారు. వినయ్ శర్మ పేరుతో వచ్చిన క్షమాభిక్ష పిటిషన్ ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించగా.. ఆ తర్వాత అది కేంద్ర హోంశాఖకు చేరుకుంది. అనంతరం దాన్ని రాష్ట్రపతికి పంపారు. ఇదిలా ఉంటే తాను క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయలేదని పేర్కొనటం ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చేసిన దుర్మార్గానికి వేదన చెందుతూ ఊరుకుండాల్సిన వినయ్ శర్మ లాంటోళ్లు బలుపు మాటలు

హైకోర్టు ఆదేశాలతో గాంధీకి మృతదేహాలు

చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌లో మరణించిన దిశ హత్యకేసు నిందితుల మృతదేహాలను సోమవారం రాత్రి మహబూబ్‌నగర్‌ నుంచి సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలిం చారు. ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కు ల కమిషన్‌ విచారణ చేపట్టడంతో పాటు పలు ప్రజా సంఘాలు కోర్టులో కేసులు వేశాయి. దీనిపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టడం, ఆ తర్వాత విచారణను గురువారానికి వాయిదా వేయడం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు భారీ బందోబస్తు మధ్య మృతదేహాలను ప్రత్యేక వాహనాల్లో గాంధీ మార్చురీకి తరలించారు. శుక్రవారం వరకు ఇక్కడే భద్రపర్చనున్నారు. మృతదేహాలు కుళ్లిపోకుండా వైద్యులు జాగ్రత్తలు తీసుకున్నారు. గాంధీ ఆస్పత్రి మార్చురీ సమీపంలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.

అలా చేసి అడ్డంగా దొరకిపోయిన ఆర్ ఆర్ ఆర్ బ్యూటీ.. చీ చీ ఇంత చీప్ నా..

రాజన్న తెరకెక్కిస్తున్న భారీ కథనం సినిమా ఆర్ అర్ అర్ .. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన నటించిన ఈ అమ్మడు అలియా భట్ పేరు ఇప్పుడు ముంబై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. దీంతో అభిమానులు అంత తొందరెందుకు అంటూ కామెంట్లు పెడుతున్నారు.. ఈ విషయం పై బాలీవుడ్ ప్రముఖులు కూడా మండిపడుతున్నారు..కొందరు ఈ విషయం పై ఘాటుగానే స్పందిస్తున్నారు..వివరాల్లోకి వెళితే.. గత ఆదివారం రాత్రి ముంబయిలో స్టార్ స్క్రీన్ అవార్డ్స్ వేడుక అట్టహాసంగా జరిగింది. బాలీవుడ్ ప్రముఖుల కార్తిక్ ఆర్యన్, ఆలియా భట్, దీపిక పదుకోన్, రణ్‌వీర్ సింగ్, అనన్య పాండే తదితరులు వేడుకకు హాజరై సందడి చేశారు. అయితే ఈ వేడుకలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ అసలు బండారం బయటపడింది. 'గల్లీ బాయ్' సినిమాకు గానూ ఆలియాకు ఉత్తమ నటిగా అవార్డు దక్కింది. అయితే షో ప్రారంభం అయ్యాక తీసుకోవాల్సిన అవార్డు ఆలియా షో ప్రారంభం కాకముందే తీసుకున్నారు. పైగా ఎవ్వరికీ తెలీకుండా షో జరుగుతున్న ప్రదేశం వెనక డోర్ నుంచి బయటికి వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న మీడియా వర్గాలు వెంటనే అక్కడికి చేరుకుని ఆలియా ఫొటోలు క్లిక్‌మనిపించాయి. దాంతో చేసేదేంలేక ఆలియా ఫొటోలకు పోజులిచ్చింది. ఆ స

లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం!

సుమారు 12 గంటల పాటు పౌరసత్వ సవరణ బిల్లు పై జరిగిన చర్చలు ముగిసాయి. మొత్తం 391 ఓట్లు పోలవగా..బిల్లుకు మద్దతుగా 311 ఓట్లు, వ్యతిరేకంగా 80 ఓట్లు వచ్చాయి. దీంతో లోక్ సభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇది భారతదేశనికి చెందిన మైనారిటీలకు వ్యతిరేకంగా 0.001% కూడా లేదని స్పష్టంచేశారు. తద్వారా రాజ్యాంగ సమానత్వ సూత్రాలను ఉల్లంఘిస్తోందన్న ప్రతిపక్షాల వాదనను తోసిపుచ్చారు. 1947 విభజన సమయంలో మతం ప్రాతిపదికన భారతదేశాన్ని విభజించిన పార్టీ కాంగ్రెస్ అయినప్పుడు ఈ బిల్లును వివక్షపూరితంగా చెప్పే హక్కు ఆ పార్టీకి లేదని తెలిపారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుండి 'మైనారిటీ వలసదారులకు' పౌరసత్వ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రతిపాదించినందున ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడాయి, ముస్లిం సమాజానికి చెందిన వారిని దాని పరిధి నుండి తప్పించింది.

దిశ ఘటనలో నిందితుల ఎన్‌కౌంటర్.!

దిశ హత్యాచారం కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు పోలీసులు. షాద్ నగర్‌ వద్ద ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులు. సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తుండగా.. తప్పించుకునేందుకు యత్నిస్తుండగా.. ఎన్‌ కౌంటర్ చేసినట్టు సమాచారం.. పారిపోతున్న నలుగురు నిందితులపై కాల్పులు జరిపినట్లు తెలిపిన పోలీసులు.