Posts

ఉగాది ముందు రోజు సూర్యగ్రహణం.... 54 ఏళ్ల తరువాత అద్భుతం...

ఉగాది ముందు రోజు సంపూర్ణ ... సుదీర్ఘ సూర్యగ్రహణం ఏర్పడుతుంది.  ఖగోళ శాస్త్రవేత్తల నివేదిక ప్రకారం ఇలాంటి సుదీర్ఘ సూర్యగ్రహణం 54 ఏళ్ల క్రితం ఏర్పడిందని తెలుస్తోంది.  1970లో చివరిసారిగా ఇటువంటి సూర్యగ్రహణం ఏర్పడింది. సోమవారం ( ఏప్రిల్ 8)న ఏర్పడే సుదీర్ఘ సూర్యగ్రహణం ఎన్నిగంటలు ఉంటుంది.. ఏ సమయంలో ఏర్పడుతుంది.... ఎన్ని మైళ్ల మేరకు .. ఏఏ ప్రాంతాల్లో ఈ గ్రహణం కనువిందు చేస్తుందో తెలుసుకుందాం. . . .  2024  మొట్టమొదటి సూర్యగ్రహణం సోమవారం  ఏప్రిల్ 8న ఏర్పడనుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం. 54 ఏళ్ల తర్వాత ఇలాంటి సూర్యగ్రహణం సంభవించడం ఇదే మొదటిసారి. 1970లో చివరిసారిగా ఇటువంటి సూర్యగ్రహణం సంభవించినట్టు ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఇది భారత్‌లో కనిపించదు. అరుదైన ఈ గ్రహణం ఏర్పడే సమయానికి భారత్‌లో రాత్రి ఉంటుంది. కాబట్టి ఎటువంటి ప్రభావం ఉండదు. ఇతర దేశాల్లో మాత్రం ఏడున్నర నిమిషాల పాటు పగటిపూటే చిమ్మ చీకట్లు అలుముకుంటాయి.ఈ అద్భుతం మెక్సికో పసిఫిక్ తీరం నుంచి ప్రారంభమై, అమెరికా సంయుక్త రాష్ట్రాల గుండా ప్రయాణించి, తూర్పు కెనడాలో ముగుస్తుంది. ఆ ప్రాంతాల్లోని మిలియన్ల మందికి ఈ గ్రహణం దృశ్యాలు కనిపిస్తాయి

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది

మలయాళం సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'ది గోట్ లైఫ్'. తెలుగులో 'ఆడు జీవితం'గా విడుదలైంది. మొత్తం ఐదు భాషల్లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసినట్లు చిత్రయూనిట్ పేర్కొంది. ఈ మూవీ ‘ఆడు జీవితం' నవల ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

మోదీ 3.0.. ప్లానింగ్ షురూ?

ప్రధాని మోదీ మరోసారి ఎన్నికైతే తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఇప్పటికే అధికారులు కసరత్తులు ప్రారంభించారట. 2030 నాటికి వృద్ధులకు పెన్షన్ 50% పెంపు, ఉద్యోగాల్లో మహిళలకు 50% భాగస్వామ్యం దక్కేలా చర్యలు, ఈవీ సేల్స్ 30%కు పెంచడం మొదలైనవి ప్లాన్ చేస్తున్నారట. మినిస్ట్రీలను కుదించడం, విదేశాల్లో దౌత్య కార్యాలయాల విస్తరణ, ప్రైవేటు పెట్టుబడుల పెంపు, కీలక ప్రాజెక్టులకు భూసేకరణ తదితర అంశాలు సైతం పరిశీలిస్తున్నారట. 2030 నాటికి కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య కోటి దిగువకు తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారట. నియామకాలు, న్యాయవ్యవస్థను మెరుగుపర్చడం మొదలైన విషయాలు పరిశీలిస్తున్నారట. రక్షణ రంగానికి GDPలో 3% కేటాయింపు, జైళ్ల ఆక్యుపెన్సీ పెంపు, విచారణ ఎదుర్కొనే ఖైదీల సంఖ్య తగ్గింపు తదితర అంశాలపై కృషి చేస్తున్నారట. ఈ నేపథ్యంలో మరోసారి గెలిస్తే మోదీ ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

విద్యుత్ షాక్ తో మృతి.

విద్యుత్ షాక్ తో మృతి. పాలకుర్తి మండలంలోని వల్మిడి గ్రామంలో ఘటన  స్తంభం ఎక్కి మరమ్మత్తు పనులు చేస్తుండగా విద్యుత్ సరఫరా విడుదల  విద్యుత్ మరమ్మత్తు పనుల కోసం విద్యుత్ సరఫరా నిలిపివేత (ఎల్ సి తీసుకున్న లైన్ మెన్ ) విద్యుత్ షాక్ తో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయిన లైన్ మెన్  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

మహిళ ఉద్యోగిపై సెక్రటరీ వేధింపులు.

 మహిళ ఉద్యోగిపై సెక్రటరీ వేధింపులు. తొర్రూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో పనిచేస్తున మహిళ .. అందులో సెక్రటరీగా పనిచేస్తున్న వెలుగు మురళి వ్యక్తి ఆమెను వేధిస్తున్నాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యా దు చేసింది. కొన్నిరోజులుగా మహిళపై మనసుపడ్డానని మురళి ఆమెను వేధించేవాడు. తాజాగా అవి ఎక్కువవడంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. దీంతో మురళిపై SC, ST కేసు నమోదు చేసినట్లు ఎస్సై జగదీశ్ తెలిపారు.

లంచం తీసుకుంటు ఏసీబీ పట్టుబడ్డ ఎస్సై,రైటర్

లంచం తీసుకుంటు ఏసీబీ పట్టుబడ్డ ఎస్సై రైటర్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పనిచేస్తున్న సిబ్బంది అవినీతి వ్యవహారంపై రెండు రోజులుగా నిఘాపెట్టిన ఏసీబి అధికారులు  సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ తనిఖీలు  రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఎస్సై రంజిత్.. ఎస్సై రైటర్ విక్రమ్.  ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న ఏసీబీ అధికారులు. 

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ అటవీప్రాంతంలో ఎదురుకాల్పులు

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు అటవీప్రాంతంలో ఎదురుకాల్పులు  పోలీసు బలగాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి  ఘటనాస్థలిలో 3 తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం ములుగు జిల్లా కర్రిగుట్టలు - ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ పరిధిలో ఘటన