మోదీ 3.0.. ప్లానింగ్ షురూ?

ప్రధాని మోదీ మరోసారి ఎన్నికైతే తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఇప్పటికే అధికారులు కసరత్తులు ప్రారంభించారట. 2030 నాటికి వృద్ధులకు పెన్షన్ 50% పెంపు, ఉద్యోగాల్లో మహిళలకు 50% భాగస్వామ్యం దక్కేలా చర్యలు, ఈవీ సేల్స్ 30%కు పెంచడం మొదలైనవి ప్లాన్ చేస్తున్నారట. మినిస్ట్రీలను కుదించడం, విదేశాల్లో దౌత్య కార్యాలయాల విస్తరణ, ప్రైవేటు పెట్టుబడుల పెంపు, కీలక ప్రాజెక్టులకు భూసేకరణ తదితర అంశాలు సైతం పరిశీలిస్తున్నారట.
2030 నాటికి కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య కోటి దిగువకు తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారట. నియామకాలు, న్యాయవ్యవస్థను మెరుగుపర్చడం మొదలైన విషయాలు పరిశీలిస్తున్నారట. రక్షణ రంగానికి GDPలో 3% కేటాయింపు, జైళ్ల ఆక్యుపెన్సీ పెంపు, విచారణ ఎదుర్కొనే ఖైదీల సంఖ్య తగ్గింపు తదితర అంశాలపై కృషి చేస్తున్నారట. ఈ నేపథ్యంలో మరోసారి గెలిస్తే మోదీ ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..