ఉగాది ముందు రోజు సూర్యగ్రహణం.... 54 ఏళ్ల తరువాత అద్భుతం...

ఉగాది ముందు రోజు సంపూర్ణ ... సుదీర్ఘ సూర్యగ్రహణం ఏర్పడుతుంది.  ఖగోళ శాస్త్రవేత్తల నివేదిక ప్రకారం ఇలాంటి సుదీర్ఘ సూర్యగ్రహణం 54 ఏళ్ల క్రితం ఏర్పడిందని తెలుస్తోంది.  1970లో చివరిసారిగా ఇటువంటి సూర్యగ్రహణం ఏర్పడింది. సోమవారం ( ఏప్రిల్ 8)న ఏర్పడే సుదీర్ఘ సూర్యగ్రహణం ఎన్నిగంటలు ఉంటుంది.. ఏ సమయంలో ఏర్పడుతుంది.... ఎన్ని మైళ్ల మేరకు .. ఏఏ ప్రాంతాల్లో ఈ గ్రహణం కనువిందు చేస్తుందో తెలుసుకుందాం. . . . 

2024  మొట్టమొదటి సూర్యగ్రహణం సోమవారం  ఏప్రిల్ 8న ఏర్పడనుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం. 54 ఏళ్ల తర్వాత ఇలాంటి సూర్యగ్రహణం సంభవించడం ఇదే మొదటిసారి. 1970లో చివరిసారిగా ఇటువంటి సూర్యగ్రహణం సంభవించినట్టు ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఇది భారత్‌లో కనిపించదు. అరుదైన ఈ గ్రహణం ఏర్పడే సమయానికి భారత్‌లో రాత్రి ఉంటుంది. కాబట్టి ఎటువంటి ప్రభావం ఉండదు. ఇతర దేశాల్లో మాత్రం ఏడున్నర నిమిషాల పాటు పగటిపూటే చిమ్మ చీకట్లు అలుముకుంటాయి.ఈ అద్భుతం మెక్సికో పసిఫిక్ తీరం నుంచి ప్రారంభమై, అమెరికా సంయుక్త రాష్ట్రాల గుండా ప్రయాణించి, తూర్పు కెనడాలో ముగుస్తుంది. ఆ ప్రాంతాల్లోని మిలియన్ల మందికి ఈ గ్రహణం దృశ్యాలు కనిపిస్తాయి.

ఏప్రిల్ 8న మధ్యాహ్నం 02:12 గంటలకు ప్రారంభమై.. ఏప్రిల్ 9న మధ్యాహ్నం 02:22 గంటలకు సంపూర్ణ సూర్యగ్రహణం ముగుస్తుంది. గ్రహణం గరిష్ఠ వ్యవధి 4గంటల 28 సెకన్లు.

సంపూర్ణ సూర్యగ్రహణాలు చాలా అరుదుగా ఏర్పడతాయి. ఎందుకంటే వాటిని చూసేందుకు భూమిపై అనువైన ప్రదేశాలు తక్కువ.
 
సూర్యుడు, భూమి,చంద్రుడు ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు.. ఆ సమయంలో సూర్యుడు పూర్తిగా కనిపించకుండా చంద్రుడు అడ్డుకోవడాన్ని సూర్యగ్రహణంగా పేర్కొంటారు. జాబిల్లి నీడ సూర్యుడిని పూర్తిగా కప్పి ఉంచే ప్రదేశాల్లో గ్రహణం ఏర్పడుతుంది. ఈ మార్గాన్ని సంపూర్ట మార్గం(పాత్ ఆఫ్ టోటలిటీ) అని అంటారు. ఈ సమయంలో ఆకాశం చీకటిగా మారిపోయి.. సూర్యోదయం సూర్యాస్తమయంలా కనిపిస్తుంది.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..