200 కోట్లతో పెళ్ళి వేడుక ... స్టెప్పులేసిన కత్రినా ... డెహ్రాడూన్ : ప్రముఖుల పెళ్ళిలో స్టార్ సెలబ్రిటీలు స్టెప్పులేయడం కామన్. సంగీత్ వేడుకలలో వారు చేసే సందడి అంతా ఇంతా కాదు. రీసెంట్‌గా ప్రముఖ హీరోయిన్ కత్రినా కైఫ్ రూ. 200 కోట్ల రూపాయలతో ఓ కుటుంబం జరిపిన పెళ్ళి వేడుకలో స్టెప్పులేసి అలరించింది. తాను నటించిన ‘తీస్ మార్ ఖాన్’ సినిమాలోని ‘షీలా కీ జవానీ’ పాటకు తనదైన శైలిలో స్టెప్పులేసి అబ్బురపరిచింది కత్రినా . డెహ్రాడూన్‌లోని ఔలీ ప్రాంతంలో ఈ వేడుక జరగగా, టీవీ, బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ పెళ్ళి వేడుక హాజరయ్యారు. బుల్లితెర నటి సురభీ కూడా తన స్టెప్పులతో అలరించింది. ఎంతో సందడిగా జరిగిన ఈ పెళ్ళికి సంబంధించిన పలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Posts
Showing posts with the label 200 కోట్లతో పెళ్ళి వేడుక ... స్టెప్పులేసిన కత్రినా ...