200 కోట్లతో పెళ్ళి వేడుక‌ ... స్టెప్పులేసిన కత్రినా ...



డెహ్రాడూన్‌ : ప్ర‌ముఖుల పెళ్ళిలో స్టార్ సెల‌బ్రిటీలు స్టెప్పులేయ‌డం కామ‌న్‌.

సంగీత్ వేడుక‌ల‌లో వారు చేసే సంద‌డి అంతా ఇంతా కాదు.

రీసెంట్‌గా ప్ర‌ముఖ హీరోయిన్ క‌త్రినా కైఫ్ రూ. 200 కోట్ల రూపాయ‌ల‌తో ఓ కుటుంబం జ‌రిపిన పెళ్ళి వేడుక‌లో స్టెప్పులేసి అల‌రించింది.

తాను నటించిన ‘తీస్‌ మార్‌ ఖాన్‌’ సినిమాలోని ‘షీలా కీ జవానీ’ పాటకు త‌న‌దైన శైలిలో స్టెప్పులేసి అబ్బురపరిచింది క‌త్రినా .

డెహ్రాడూన్‌లోని ఔలీ ప్రాంతంలో ఈ వేడుక జ‌ర‌గ‌గా, టీవీ, బాలీవుడ్ సెల‌బ్రిటీలు కూడా ఈ పెళ్ళి వేడుక‌ హాజ‌ర‌య్యారు.

బుల్లితెర న‌టి సుర‌భీ కూడా త‌న స్టెప్పుల‌తో అల‌రించింది.

ఎంతో సంద‌డిగా జ‌రిగిన ఈ పెళ్ళికి సంబంధించిన ప‌లు వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?