బాలనటిగా..హీరోయిన్​గా.. దర్శకురాలిగా మెప్పించిన వ్యక్తి విజయనిర్మల.


నేడు అనారోగ్యంతో మృతి చెందారు. 1946 ఫిబ్రవరి 20న జన్మించిన ఆమె 73 ఏళ్ల వయసులో స్వర్గస్థులయ్యారు.

'వస్తాడు ..నా రాజు ఈరోజూ అంటూ'.. అమయాకపు చూపులతో ప్రియుడు కోసం ఎదురుచూస్తూ యువతి పాత్రలో మెప్పించిన నటి విజయ నిర్మల.

తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. బాలనటిగా, కథానాయికగా.. దర్శకురాలిగా తన ప్రతిభాపాటవాలను చాటిన విజయనిర్మల నేడు అనారోగ్యంతో మృతి చెందారు. ఎన్నో ఘనతలను సాధించిన విజయ నిర్మల ప్రస్థానం సాగిందిలా..


కుటుంబ నేపథ్యం..
విజయనిర్మల మద్రాసులో 1946 ఫిబ్రవరి 20న జన్మించారు. తండ్రి రామ్మోహనరావు, తల్లి శకుంతలాదేవి.

ప్రముఖ గాయని రావు బాలసరస్వతిదేవి.. విజయనిర్మల మేనత్త కూతురే. మరో నటి జయసుధ పెద్దనాన్న మనవరాలు. చిన్నతనం నుంచే భరతనాట్యంలో శిక్షణ తీసుకున్నారు విజయనిర్మల.

సినిమా నేపథ్యమే కావడంతో బాలనటిగా తమిళ చిత్రంతో తెరంగేట్రం చేశారు.


బాలనటిగా మెప్పించిన విజయనిర్మల..
దర్శకుడు పి. పుల్లయ్య ‘మత్సరేఖ’ (1953) తమిళ సినిమాలో విజయనిర్మలకు బాలనటిగా అవకాశమిచ్చాడు.

అనంతరం సింగారి, మనంపోల్‌ మాంగల్యం.. హిందీ చిత్రం హమ్ పంఛీ ఏక్ డాల్ లాంటి చిత్రాల్లో బాలనటిగా మెప్పించారు విజయనిర్మల.

తెలుగులో పాండురంగ మహత్యం, జయకృష్ణా ముకుందా మురారి, భూకైలాస్ లాంటి చిత్రాల్లో నటించారు. బాలనటిగా భూకైలాస్ ఆఖరు చిత్రం.


కృష్ణతో విజయనిర్మల

తొలిసారి సాక్షి చిత్రంలో కృష్ణ సరసన నటించారు విజయనిర్మల. అనంతరం వీరిద్దరూ చాలా సినిమాల్లో కలిసి నటించారు. అప్పట్లో వీరిద్దరిది హిట్ పెయిర్.

1969 మార్చి 24న తిరుపతిలో కృష్ణను రెండో వివాహం చేసుకున్నారు విజయనిర్మల. పెళ్లైన తర్వాత సినిమాలకు గుడ్​ బై చెప్తారని అందరూ భావించారు. కానీ ఆ తర్వాత సూపర్​స్టార్​తో కలిసి 50 సినిమాల్లో నటించారు.

కృష్ణ కంటే ముందు కృష్ణమూర్తిని(నటుడు నరేశ్ తండ్రి) పెళ్లి చేసుకున్నారు విజయనిర్మల.
కుమారుడు నరేశ్ కూడా సినీనటుడే. ప్రస్తుతం మూవీ ఆర్ట్స్​ అసొసియేషన్ అధ్యక్షుడిగా సేవలందిస్తున్నాడు.


దర్శకురాలిగా గిన్నీస్ రికార్డు..
ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా విజయనిర్మల గిన్నీస్ బుక్​లో చోటు దక్కించుకున్నారు.

2002లో ఈ ఘనత సాధించారు. అంతకంటే ముందు ఇటలీ దర్శకురాలు పేరిట ఉన్న రికార్డును తిరగరాశారు.

విజయ నిర్మల విశేష సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘రఘుపతి వెంకయ్య’ అవార్డును ఇచ్చి గౌరవించింది.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయనిర్మల బుధవారం రాత్రి హైదరాబాద్​లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందతూ మరణించారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది