బెజవాడ నుంచి నడుస్తున్న సింగపూర్‌ విమాన సర్వీసు రద్దయ్యింది.

విజయవాడ: 

రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (వీజీఎఫ్‌) విధానంలో నడుస్తున్న ఈ సర్వీసుకు జూన్‌ 30తో కాంట్రాక్టు గడువు ముగుస్తోంది.

గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న ఈ ఒప్పందాన్ని సమీక్షించాల్సి ఉండగా వైసీపీ సర్కారు సుముఖత చూపలేదు.

రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్‌) నుంచి ఈ మేరకు ఈమెయిల్‌ రావటంతో.. ఇండిగో సంస్థ సింగపూర్‌ సర్వీసును రద్దు చేయాల్సిందిగా ఇక్కడి ప్రాంతీయ అధికారులకు సమాచారం పంపింది.

దీంతో జూలై 9 నుంచి సింగపూర్‌ విమాన సర్వీసును రద్దు చేశారు. ఆన్‌లైన్‌ బుకింగ్‌ను ఆపేశారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..