ఆర్టీసీ జాక్ లో ముసలం - రాష్ట్ర కార్యదర్శి పదవికి నగేష్ రాజీనామా..

హైదరాబాద్ - ఆర్టీసీ కార్మిక సంఘాల జాక్ లో ముసలం ప్రారంభమైంది. ఆర్టీసీ జేఏసీ గందరగోళ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి నగేష్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. జేఏసీ పెద్దలు స్టేట్ కమిటీ నేతలతో చెప్పకుండా సమ్మెపై విరమణ చేస్తామని ప్రకటించారని ఆరోపించారు. కార్మికులు విధుల్లో చేరడానికి సీఎం కేసీఆర్ అవకాశమిచ్చినప్పుడే భేషరతుగా చేరివుంటే భాగుండేదని నగేష్ మీడియాతో అన్నారు. కార్మికుల ఆత్మహత్యలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. కాగా, సమ్మెపై ఆర్టీసీ జేఏసీ వెనక్కి తగ్గడంతో మరోవైపు కార్మికుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు కార్మికులు విధుల్లో చేరడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో..

ఉన్నతాధికారులనుంచి ఎలాంటి ఆదేశాలు లేకుంటే వారిని వెనక్కి పంపిస్తామమని ఆర్టీసీ అధికారులు అంటున్నారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..