కూతురి పెళ్లి విషయంలో మాట తప్పాననే మనోవేదన ఓ తండ్రి బలవన్మరణo

అనంతపురం జిల్లా:

రాయలచెరువు (యాడికి): కూతురి పెళ్లి విషయంలో మాట తప్పాననే మనోవేదన ఓ తండ్రి బలవన్మరణానికి దారి తీసిన విషాద ఘటన మంగళవారం రాయలచెరువు చెరువులో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. స్థానిక ఉన్నత పాఠశాల సమీపంలో నివసిస్తూ కార్మికుడిగా జీవనం సాగిస్తున్న నాగరాజుకు ముగ్గురు కూతుళ్లు. పెద్దకూతురు అఖిలకు ఆరు నెలల కిందట స్వయానా తన అక్క కొడుకు నెట్టికంటయ్యతో నిశ్చితార్థం చేశాడు. అయితే ఇటీవల తనకు ఈ వివాహం ఇష్టం లేదని కూతురు బాధపడటం, తన దూరపు బంధువైన మరో వ్యక్తికి ఇచ్చి వివాహం చేద్దామని భార్య ఒత్తిడి తేవడంతో నాగరాజు మానసిక సంఘర్షణకు గురయ్యాడు. తన అక్కకు ఇచ్చిన మాట తప్పలేక, భార్య, కూతురిని ఇబ్బంది పెట్టలేక నాగరాజు మనస్తాపానికి గురయ్యాడు. భార్య, కూతురు అనుకున్నట్లుగానే పెన్నహోబిళంలో భార్య తరపున బంధువు రాజశేఖర్‌తో ఆదివారం ఉదయం పెళ్లి జరిగిపోవడంతో నాగరాజు కనిపించకుండా పోయాడు. అదే రోజు 11 గంటల సమయంలో అతనికి సంబంధించిన ద్విచక్రవాహనం, చెప్పులు, లుంగీ స్థానిక చెరువు వద్ద లభించాయి. పోలీసులు, బంధువులు అంతటా గాలించినా అతని ఆచూకీ లభ్యం కాలేదు. కూతురును ఇంటికి పిలుచుకొని వస్తే వస్తాడేమోనని సోమవారం రాత్రికి రాయలచెరువుకు పిలుచుకొని వచ్చారు. అయితే... మంగళవారం ఉదయం చెరువులో నీటిలో తేలుతూ నాగరాజు మృతదేహం స్థానికుల కంటపడింది. సమాచారం అందుకున్న గ్రామస్థులు, పోలీసులు చెరువు వద్దకు తరలివచ్చారు. ఈతగాళ్ల సహకారంతో మృతదేహాన్ని పోలీసులు వెలుపలికి తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశామని సీఐ రవిశంకర్‌రెడ్డి, ఎస్సై మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..