ఆర్టీసీ కార్మికులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హైకోర్ట్

సీఎం కేసీఆర్ ఎంత చెప్పినా ఆర్టీసీ కార్మికులు దిగిరాకపోడవంతో దాదాపుగా 5100 బస్సులను రోడ్లపైకి తీసుకొని వచ్చి ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని ఆర్టీసీ జేఏసీ వ్యతిరేకించి ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్ట్ లో పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరుపున వధించిన అడిషినల్ జనరల్ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేయలేమని సుప్రీం కోయిర్ట్ ఇచ్చిన తీర్పుకి అనుగుణంగానే ప్రవేటీకరణ చేస్తుందంటూ చెప్పుకొచ్చారు. సెక్షన్ 67 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీపై పూర్తి హక్కులు ఉంటాయని వాదించడం జరిగింది.

అడిషినల్ జనరల్ వినిపించిన వాదనకు హైకోర్ట్ ఏకీభవించి ఆర్టీసీ జేఏసీ వేసిన కేసుని కొట్టివేసింది.దీనితో కేసీఆర్ సర్కార్ అనుకున్నట్లు రేపటి నుంచి 5100 ప్రైవేట్ బస్సులు రోడ్లెక్కనున్నాయి. రెండు రోజుల క్రితం తాము ఆర్టీసీ సమ్మెను ప్రస్తుతానికి పక్కన పెట్టి తమ విధులలో చేరుతామని ఆర్టీసీ జేఏసీ తెలియచేసినా కేసీఆర్ సర్కార్ ఎలాంటి స్పందన తెలియచేయలేదు. నిన్నటి నుంచి ఆర్టీసీ కార్మికులు డిపోల వద్ద విధులలోకి చేరడానికి రాగా, ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ డిపో మేనేజర్ కు ప్రభుత్వ నిర్ణయం తీసుకునేవరకు ఎవరని ఆర్టీసీలో చేర్చుకోవద్దని తెలియచేసింది.

ప్రభుత్వం కూడా ఈరోజు వచ్చే తీర్పు ప్రకారం ముందుకు వెళ్లాలని యోచించినట్లు తెలుస్తుంది. ఇక తీర్పు రావడంతో కేసీఆర్ సర్కార్ నిర్ణయం ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ సర్కార్ ఆర్టీసీని నడపాలంటే ప్రతి నెల 640 కోట్లు అవసరమవుతాయని అంత డబ్బు ప్రభుత్వం దగ్గర లేదని చెబుతున్నట్లు తెలుస్తుంది. సీఎం కేసీఆర్ వ్యవహారం చూస్తుంటే ఆర్టీసీని దశల వారీగా ప్రైవేటీకరణం చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..