భారీగా తగ్గిన పసిడి ధర..

ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. గత నెల చివరిలో రూ. 40 వేలను తాకిన 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర, ఇప్పుడు భారీగా దిగివచ్చింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులతో పాటు స్టాక్ మార్కెట్లు పుంజుకోవడంతో, పెట్టుబడిదారులు బులియన్ మార్కెట్ నుంచి వైదొలగుతున్నారని విశ్లేషకులు తెలుపుతున్నారు. బుధవారం ఒక్కరోజులో బంగారం ధర ఇండియాలో 10 గ్రాములకు రూ. 672 తగ్గి, రూ. 37,575కు చేరింది. నిన్నటితో పోలిస్తే, ఇది 1.75 శాతం తక్కువ. ఇదే సమయంలో వెండి ధర కిలోకు ఏకంగా రూ. 1,490 పడిపోయి, రూ. 44,168కి చేరుకుంది. వివిధ మార్కెట్లలో గురువారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర:

హైదరాబాదులో రూ.38,470
విజయవాడలో రూ.39,100
విశాఖపట్నంలో రూ.39,520
ప్రొద్దుటూరులో రూ.39,150
చెన్నైలో రూ.38,210గా ఉంది.

ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర:
హైదరాబాదులో రూ.36,650
విజయవాడలో రూ.36,250, విశాఖపట్నంలో రూ.36,350
ప్రొద్దుటూరులో రూ.36,270
చెన్నైలో రూ.36,580గా ఉంది.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..