యువకులను ముగ్గులోకి దింపి. బ్లాక్‌మెయిలింగ్‌కేసులు పెట్టి వేధింపులు

యువకులను ముగ్గులోకి దింపి. బ్లాక్‌మెయిలింగ్‌
కేసులు పెట్టి వేధింపులు3 కమిషనరేట్ల పరిధిలో ఈ తరహా 27 కేసులు యువతిని అరెస్టు చేసిన ఆబిడ్స్‌ పోలీసులు.

హైదరాబాద్:- ఆబిడ్స్‌, ‘మొదట మాయ మాటలతో యువకులను ముగ్గులోకి దించుతుంది. ఆ తర్వాత బాగా సన్నిహితమవుతుంది. కొన్నాళ్లకు.. నాపై అత్యాచారానికి యత్నించావు.. బెదిరింపులకు పాల్పడ్డావంటూ వారిపై అక్రమంగా కేసులు పెడుతూ.. బ్లాక్‌మెయిల్‌ చేస్తుంది..’ అంటూ ఓ యువతి ఆగడాలను ఆబిడ్స్‌ సీఐ రవికుమార్‌, ఎస్సై బి.రాజు శుక్రవారం ఇక్కడ వివరించారు. ఆబిడ్స్‌ చిరాగ్‌అలీలేన్‌లో ఓ సంస్థలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న అబ్దుల్‌ రహీం(30) గత నెల 19న అపస్మారక స్థితిలో ఉస్మానియా ఆసుపత్రిలో చేరాడు. సమాచారం అందుకుని దవాఖానకు వెళ్లి అతని స్టేట్‌మెంట్‌ రికార్డు చేసి విచారణ చేపట్టగా విస్తుగొలిపే అంశాలు పోలీసుల దృష్టికొచ్చాయి. అంబర్‌పేట ఫర్హత్‌నగర్‌కు చెందిన షాదాన్‌ సుల్తానా నిజామియా(27) ఆగడాల చిట్టా చూసి కంగుతిన్నారు
ఎలా బయటకొచ్చిందంటే. 2018లో సుల్తానా. పనిమీద అబ్దుల్‌ రహీం కార్యాలయానికి వెళ్లింది. అతని చరవాణి నంబరు తీసుకొని తరచూ ఫోను చేసేది. ఈ క్రమంలో గత ఏడాది జూన్‌లో రూ.4 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. లేని పక్షంలో అత్యాచారం, కిడ్నాప్‌ చేసినట్లు కేసులు పెడతానంటూ బెదిరించింది. భయపడిన అతడు రూ.3 లక్షలు ఆమె బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేశాడు. కొన్నాళ్లకు తిరిగి బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలుపెట్టింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి రూ.5 లక్షలు ఇస్తావా.? చస్తావా అంటూ బెదిరించడం ప్రారంభించింది. ఇవ్వలేనని చెప్పడంతో. గత నెల 19న నిద్రమాత్రలు తీసుకొచ్చి ఇవి మింగి ఆత్మహత్య చేసుకో అంటూ బలవంతం చేసింది. అతను ఆ మాత్రలు మింగి అపస్మారక స్థితికి చేరుకోవడంతో. ఆటోలో తీసుకొచ్చి ఉస్మానియా ఆసుపత్రిలో వదిలిపెట్టి వెళ్లిపో...

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..