పెరిగిన ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు ఏపీ వ్యాప్తంగా విజిలెన్స్‌ అధికారులు ఏకకాలంలో ఆకస్మిక తనికీలు

అమరావతి:

పెరిగిన ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు, అక్రమ నిల్వలను మార్కెట్‌లోకి తెచ్చేందుకు  ఏపీ వ్యాప్తంగా  విజిలెన్స్‌ అధికారులు ఏకకాలంలో ఆకస్మిక తనికీలు చేశారు. 70 ఉల్లి వ్యాపార సముదాయాలపై సోదాలు నిర్వహించారు. మొత్తం 47 చోట్ల ఉల్లి అక్రమ నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. 10 చోట్ల వ్యాపారులు రూ.27 లక్షల కు పైగా విలువ చేసే 603 క్వింటాళ్ల ఉల్లి అక్రమంగా నిల్వ చేసినట్లు గుర్తించారు. నిబంధనలకు అనుగుణంగా చెల్లించాల్సిన రుసుమును కూడా వ్యాపారులు చెల్లించడం లేదన్న విషయం సోదాల్లో బయటపడింది. స్టాక్‌ రిజిస్టర్లు నిర్వహించడం లేదని, క్రయవిక్రయాలకు ఎలాంటి బిల్లులు లేవని, మార్కెట్‌ సెస్‌ ఎగవేయడం వంటి ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు తనిఖీల్లో వెలుగు చూసింది. కర్నూలు, మహారాష్ట్ర నుంచి ఉల్లి కొనుగోలు చేసి వ్యాపారాలు సాగిస్తున్నారని, మార్కెట్‌లో కృత్రిమ కొరత సృష్టించి ధరలను అమాంతం పెంచుతున్నట్లు బయటపడిందని విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ జనరల్ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..