సంగీతం వింటూ డ్రైవింగ్‌ చేస్తే గుండెపోటు ముప్పు తగ్గుతుంది.

న్యూఢిల్లీ: 

సంగీతం వింటూ డ్రైవింగ్‌ చేస్తే గుండెపోటు ముప్పు తగ్గుతుందని బ్రెజిల్‌లోని సావోపాలో వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

అధ్యయనంలో భాగంగా వారంలో ఒకటి లేదా రెండుసార్లే కారు డ్రైవింగ్‌ చేసే 18-23 ఏళ్లలోపు ఐదుగురు మహిళలను ఎంపిక చేశారు. 

మొదటిరోజు అత్యంత రద్దీ ఉండే మార్గంలో 20 నిమిషాల పాటు వారితో కారును డ్రైవ్‌ చేయించారు. 

మరుసటిరోజు అదే రూట్‌లో కారులో సీడీ ప్లేయర్‌/రేడియో ద్వారా పాటలు పెట్టి, డ్రైవింగ్‌ చేయించారు. 

ఈరెండు సందర్భాల్లోనూ వారి గుండె కొట్టుకునే రేటును ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ఛాతీభాగంలో హర్ట్‌ రేట్‌ మానిటర్‌ను అమర్చారు. 

ఏ వ్యాపకం లేకుండా డ్రైవింగ్‌ చేసిన సమయంలో కంటే.. మ్యూజిక్‌ వింటూ కారు నడిపినప్పుడు వారి నాడీ వ్యవస్థ, గుండెలపై ఒత్తిడి తగ్గినట్లు అధ్యయనంలో గుర్తించారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..