అమ్మఒడిపథకంలో కీలక మార్పులు

అమరావతి

ప్రభుత్వం అమ్మఒడిపథకంలో కీలక మార్పులు చేసింది. అమ్మఒడి కింద పిల్లలతో సంబంధం లేకుండా తల్లి, గార్డియన్ కేంద్రంగా రూ.15వేలు చెల్లించనున్నారు.

ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాల అమలుకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

మార్గదర్శకాలు

⦁ విద్యార్థులకు 75% హాజరు ఉండాలి.

⦁ స్వచ్ఛంద సంస్థల్లో చదివే అనాథలు, వీధిబాలలకు సంబంధించి ఆయా శాఖలతో సంప్రదించి చెల్లిస్తారు.

⦁ విద్యాసంవత్సరం మధ్యలో చదువు మానేసిన పిల్లలు అనర్హులు.

⦁ కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులు, పింఛన్​దారులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఈ పథకానికి అనర్హులు.

⦁ విద్యార్థి తల్లి బ్యాంకు, తపాల ఖాతాకు ప్రతి ఏడాది జనవరిలో రూ.15 వేలు ఆన్​లైన్ లో చెల్లిస్తారు.

⦁ దీనికోసం పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక వెబ్​సైట్ ని రూపొందిస్తోంది.

⦁ విద్యార్థి తల్లి వివరాలను విద్యాసంస్థలు సేకరిస్తాయి. వీటిని డేటా, పౌరసరఫరాల శాఖ , ఇతర విభాగాలతో సరిపోల్చి చూస్తారు.

⦁ రేషన్ కార్డు లేనివారికీ ఈ పథకం వర్తించనుంది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?