ఇరాక్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో మరోసారి హింస
ఇరాక్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో మరోసారి హింస చెలరేగింది.
ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రసార మాధ్యమ కార్యాలయాన్ని చుట్టుముట్టిన ఆందోళనకారులపై భద్రతా దళాలు రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించాయి.
ఈ ఘటనలో ఐదుగురు నిరసనకారులు సహా ఓ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు.
దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం, అవినీతిపై విసిగిపోయిన ప్రజలు పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొంటున్నారు.
సెంట్రల్ బాగ్దాద్ సహా దక్షిణ ఇరాక్‌లోని పలు ప్రాంతాల్లో అక్టోబర్ నుంచి జరిగిన హింసాత్మక ఘటనల్లో 250 మందికి పైగా నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు.
Comments
Post a Comment