వీరబ్రహ్మేంద్రస్వాములవారి 411వ జయంతి మహోత్సవాలు
బ్రహ్మంగారిమఠం:
కాలజ్ఞానక ర్త శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారి 411వ జయంతి మహోత్సవాలు 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఘనం గా నిర్వహిస్తున్నట్లు మఠం మేనేజర్ ఎన్.ఈశ్వరయ్యాచారి తెలిపారు.
ఈ సందర్భంగా ఆ యన ఆదివారం మాట్లాడుతూ స్వామివారి ఏకాదశోత్త చతుశ్శతి జయంతి మహోత్సవాల ను ఆలయ ప్రాంగణంలో వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
9వ తేదీ శనివారం కార్తీక శుద్దద్వాదశి రోజున స్వామివారు అవతరించా రని తెలిపారు.
ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని, ఆలయ ప్రాం గణంలో ప్రత్యేక పూజలతో పాటూ పార్కులో వెలసిఉన్న వీరబ్రహ్మేంద్రస్వామి శిలావిగ్రహానికి మఠాధిపతిచే క్షీరాభిషేకం నిర్వహిస్తున్న ట్లు చెప్పారు.
Comments
Post a Comment