బీజేపీలోకి మోత్కుపల్లి ..!!
బీజేపీలోకి మోత్కుపల్లి ..!!
తెలంగాణలో సీనియర్ పొలిటీషియన్..దళిత నేత మోత్కుపల్లి నరసింహులు బీజేపీలో చేరనున్నారు.
ఆయన కాషాయం కండువా కప్పుకోవటానికి ముహూర్తం ఖరారైంది.
బీజీపీ నేతల సంప్రదింపుల తరువాత సోమవారం ఆయన బీజేపీలో అధికారికంగా చేరనున్నారు.
కొద్ది కాలంగా మోత్కుపల్లి బీజేపీలో చేరుతారంటూ ప్రచారం సాగుతోంది.
అయితే, తనకు లభించే ప్రాధాన్యత పైనే మొత్కుపల్లి ఆ పార్టీ నేతలతో మంత నాలు సాగించినట్లు సమాచారం.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర చీఫ్ లక్ష్మణ్ మోత్కుపల్లి ఇంటికి వెళ్లి.. బీజేపీలోకి రావాలని ఆహ్వానించినట్లు సమాచారం.
ఆ సమయంలో వారి నుండి వచ్చిన హామీ మేరకు బీజేపీలో చేరాలని మోత్కుపల్లి నిర్ణయించారు.
మోత్కుపల్లి చేరిక పార్టీకి లాభం చేస్తుందని బీజేపీ నేతలు ఆశిస్తున్నారు.
Comments
Post a Comment