ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది.

తెలంగాణ

ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది. హైకోర్టు ప్రతిపాదనకు సర్కార్ ససేమిరా అంది. సుప్రీంకోర్టు మాజీ జడ్జీలతో ఆర్టీసీ సమస్య పరిష్కారంపై కమిటీ వేస్తామని హైకోర్టు పేర్కొంది. అయితే హైకోర్టు చెప్పిన ప్రతిపాదనకు కేసీఆర్ ప్రభుత్వం నో చెప్పింది. దీనిపై హైపవర్ కమిటీ ప్రతిపాదనను ఒప్పుకోమంది. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రయాన్ని హైకోర్టుకు ఏజీ తెలిపారు. లేబర్ కోర్టులో ఉన్నందున ముగ్గురు జడ్జీల కమిటీ వద్దన్నారు. సమ్మెపై సుప్రీం కోర్టు ముగ్గురు మాజీ జడ్జిలతో కమిటీ వేస్తామని, ప్రభుత్వాన్ని అడిగి నిర్ణయం చెప్పాలని ఏజీని మంగళవారం హైకోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను ఇవాల్టీకి వాయిదా వేసింది. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టుకు... తెలంగాణ ప్రభుత్వం తమ నిర్ణయం తెలపింది. హైకోర్టు ప్రతిపాదనకు నో చెప్పింది.

సమ్మె విషయంలో చర్చలు లేవన్న ప్రభుత్వం ఎస్మా ప్రకటించే ఆలోచనలో ఉండటంతో... అందుకు వీలు లేదని హైకోర్టు మంగళవారం తెలిపింది. ఆర్టీసీ సేవలు... అత్యవసర సేవల కిందకు రాలేదనీ, అవి ప్రజా వినియోగ సేవలు మాత్రమే అన్న హైకోర్టు... ఎస్మా ప్రయోగించాలంటే... ఆ సేవల్ని ఎస్మా కిందకు తెస్తూ... ప్రత్యేక ఉత్తర్వులు జారీ చెయ్యాలని తెలిపింది. దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ఆర్టీసీ సమ్మె ఎస్మా పరిధిలోకి వస్తుందని తెలిపారు. 1998, 2015లో ఆర్టీసీ ఎస్మా పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం జీవోలు ఇచ్చిందని చెప్పారు.దీంతో గతంలో ఇచ్చిన జీవోలు ఇప్పుడు వర్తిస్తాయా? అని హైకోర్టు ప్రశ్నించింది. 1998లో ఇచ్చిన ఉత్తర్వులు ఏపీఎస్‌ఆర్టీసీకి వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఇక, 2015లో ఇచ్చిన జీవో ఆరు నెలలకే పరిమితం అని తేల్చి చెప్పింది.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..