రాశిఫలం - 22/11/2019

తిథి: 

బహుళ దశమి ఉ.6.39 త. ఏకాదశి రా.తె.4.16 , కలియుగం-5121, శాలివాహన శకం-1941

నక్షత్రం: 

ఉత్తర మ.3.17

వర్జ్యం: 

రా.11.06 నుండి 12.35 వరకు

దుర్ముహూర్తం: 

ఉ.08.24 నుండి 09.12 వరకు, తిరిగి మ.12.24 నుండి 01.12 వరకు

రాహు కాలం: 

ఉ.10.30 నుండి 12.00 వరకు తీవిశేషాలు: స్మార్తానాం ఏకాదశి

మేషం: 

(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) ఋణప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కటుంబంలో అనారోగ్య బాధలుండును. బంధు, మిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం వుంది. చేసే పనులలో కొన్ని ఇబ్బందులు వస్తాయి.

వృషభం: 

(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) ఆకస్మిక ధనలాభముంటుంది. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయుటకు వెనుకాడరు. ఋణబాధలు తొలగిపోతాయి. శత్రుబాధలుండవు.

మిథునం: 

(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలున్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధననష్టమేర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ, సహకారాలకై వేచి వుంటారు. దైవదర్శనం లభిస్తుంది.

కర్కాటకం: 

(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) ఆర్ధిక ఇబ్బందులుండవు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్యసాహసాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. శుభవార్తలు వింటారు.

సింహం: 

(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభమేర్పడుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు. బంధు, మిత్రులను కలుస్తారు. కొత్త కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు.

కన్య: 

(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగముంటుంది. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధు, మిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు, రాజకీయ రంగాల్లోవారు ఉత్సాహంగా ఉంటారు. స్ర్తిలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు.

తుల: 

(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) కుటుంబమంతా సంతోషంగా నుంటారు. గతంలో వాయిదావేసిన పనులన్నీ పూర్తిచేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యమేర్పడుతుంది. స్థిర నివాసముంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మవిషయాలను గ్రహిస్తారు.

వృశ్చికం: 

(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) తలచిన కార్యాలన్నియు విజయవంతంగా పూర్తిచేసుకోగలుగుతారు. బంధు, మిత్రుల మర్యాద మన్ననలను పొందుతారు. అనారోగ్య బాధలుండవు. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా వుంటాయి. అనుకూల పరిస్థితులేర్పడతాయి.

ధనుస్సు: 

(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. బంధు, మిత్రులతో కలుస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా నుంటారు. ప్రతి విషయంలో అభివృద్ధి వుంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.

మకరం: 

(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) ఆకస్మిక ధనలాభముంది. రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయ. అన్నింటా విజయానే్న సాధిస్తారు. బంధు, మిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగ రంగాల్లోని వారికి అభివృద్ధి వుంటుంది.

కుంభం: 

(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం వుంటుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. పోట్లాటలకు దూరంగా నుండుట మంచిది. అనారోగ్య బాధలధిగమించుటకు ఔషధసేవ తప్పదు. స్తిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు పనికిరాదు.

మీనం: 

(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుండుటచే మానసికానందాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. లాభాలు ఆర్జిస్తారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..