చిత్తూరు జిల్లాలో ఓ కంటైనర్ బీభత్సం స్పష్టించింది

చిత్తూరు జిల్లాలో ఓ కంటైనర్ బీభత్సం స్పష్టించింది. అతివేగంతో ఓమ్ని వ్యాన్, ద్విచక్రవాహనం, ఆటోపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది.

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలిఘాట్‌ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కంటైనర్ అతివేగంతో వాహనాలపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో కంటైనర్ డ్రైవర్​, క్లీనర్​తో సహా 10 మంది చనిపోయారు. శనివారం ఉదయం మరో వ్యక్తి మృతదేహం లభ్యమవగా... అది కంటైనర్ డ్రైవర్ అక్షయ్ భౌతిక కాయంగా గుర్తించారు. అక్షయ్​తో కలిపి మృతుల సంఖ్య 11కు చేరింది.

ఇప్పటికీ విషమంగానే మరి కొందరు

బ్రేకులు విఫలమై ఆటో, ఓమ్ని వ్యాన్, ద్విచక్రవాహనంపైకి కంటైనర్ దూసుకెళ్లింది. ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉన్నట్లు సమాచారం.

ఒకే కుటుంబంలో 8 మంది మృతి

ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి చెందారు. గంగవరం మండలం మర్రిమాకులపల్లె గ్రామానికి చెందిన వీరంతా చిత్తూరు తెల్లగుండ్లపల్లెలో బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు రామచంద్ర (50), రాము (38), సావిత్రమ్మ (40), ప్రమీల (37), గురమ్మ (52), సుబ్రమణ్యం (49), శేఖర్ (45), పాపమ్మ (49). ఒకే కుటంబంలో ఎనిమిది మంది మృత్యువాత పడటంతో వీరి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలోనే కంటైనర్ కిందపడిన ద్విచక్ర వాహనదారుడు నరేంద్ర మృతి చెందాడు. ఇతనిది పలమనేరు మండలం బలిజపల్లిగా గుర్తించారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..