ఆర్టీసీ సమ్మెకు జేఏసీ ఫుల్ స్టాప్.. కండిషన్స్ అప్లై

ఆర్టీసీ సమ్మెపై జేఏసీ కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు జేఏసీ చైర్మన్ అశ్వత్థామ రెడ్డి. 48 రోజులుగా చేస్తున్న సమ్మెను విరమించాలని జేఏసీ ప్రకటించడంతో ఉత్కంఠకు తెరపడింది. ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కోరారు. విధుల్లో చేరిన కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని జేఏసీ కోరింది. ఎలాంటి షరతులపై కార్మికులు సంతకాలు చేయరని ఆర్టీసీ జేఏసీ పేర్కొంది. అలాంటి వాతావరణం కల్పించాలని అశ్వత్థామరెడ్డి కోరారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశాన్ని హైకోర్టు లేబర్‌ కోర్టుకు నివేదించిన సంగతి తెలిసిందే.

సమ్మె కొనసాగింపుపై కార్మిక సంఘాలు పునరాలోచనలో పడ్డాయి. చివరికి ఒక నిర్ణయానికి వచ్చాయి. సమ్మెకు సంబంధించి లేబర్‌ కమిషన్‌కు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను బుధవారం జరిగిన సమావేశంలో కూలంకషంగా చర్చించారు. సమ్మె కొనసాగింపుపై కార్మికుల్లో తీవ్ర భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం నుంచి హామీ తీసుకున్నాకే సమ్మె విరమించాలని, అర్ధంతరంగా సమ్మె విరమిస్తే.. ఇన్నాళ్లు చేసిన పోరాటానికి ఫలితమూ, ప్రయోజనమూ ఉండదని మరికొందరు కార్మికులు అభిప్రాయపడ్డారు.ఆర్టీసీ కార్మికులు డ్యూటీ ఛార్ట్ ల మీద మాత్రమే సంతకాలు చేయాలని అశ్వత్థామ రెడ్డి సూచించారు. అక్టోబర్ 5 నుంచి కార్మికులు సమ్మెకు దిగారు. లేబర్ కోర్టులో తమకు న్యాయం జరుగుతుందనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు అశ్వత్థామరెడ్డి.

కార్మికుల సమస్యలను లేబర్ కోర్ట్ పరిష్కరిస్తుందనే నమ్మకం ఉందన్నారు అశ్వత్థామరెడ్డి. సమ్మె కాలానికి జీతాల విషయాన్ని లేబర్ కోర్ట్ లో లేవనెత్తుతామన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సూచన రాలేదన్నారు. ప్రభుత్వం స్పందిస్తుందని ఆశిస్తున్నాం అన్నారు అశ్వత్ధామరెడ్డి.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..

టేకు చెట్టుపై శిల్పి చెక్కినట్లుగా ఆంజనేయస్వామి ఆకారం