గాంధీ కుటుంబ సభ్యులు ముగ్గురికి ఎస్పీజీ సెక్యూరిటీని వెనక్కి తీసుకుంటున్నట్లు హోంమంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది

న్యూఢిల్లీ

దేశ అత్యున్నత భద్రతా వ్యవస్థను స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌(ఎస్పీజీ) అంటారు. 

గాంధీ కుటుంబ సభ్యులు ముగ్గురికి ఎస్పీజీ సెక్యూరిటీని వెనక్కి తీసుకుంటున్నట్లు హోంమంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. 

కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు, ఎంపీ రాహుల్‌ గాంధీ, ఆమె కూతురు, కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీలకు ఎస్పీజీ భద్రతను తొలగించి జడ్‌ ప్లస్‌ క్యాటగిరి రక్షణను కల్పించారు. 

ఇకపై వీరి రక్షణ బాధ్యతను సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 100 మంది భద్రతా సిబ్బంది చూడనున్నారు. 

మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ హత్యానంతరం గాంధీ కుటుంబానికి ప్రభుత్వం ఎస్పీజీ భద్రతను కల్పిస్తూ వస్తుంది. 

దేశంలోని వీఐపీలకు కల్పించే భద్రతపై సమీక్ష అనంతరం కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఈ నిర్ణయం వెలువరించింది.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..