అయోధ్య కేసులో సుప్రీం తీర్పు ఎవరికీ విజయం కాదు. అలా అని ఓటమి కాదు

మోదీ

సుప్రీం కోర్టు నేడు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్​ ద్వారా సందేశం అందించారు. 

'అయోధ్య కేసులో సుప్రీం తీర్పు ఎవరికీ విజయం కాదు. అలా అని ఓటమి కాదు. 

ఈ తీర్పు భారతదేశ శాంతి, ఐక్యత, సద్భావన, గొప్ప సంప్రదాయాన్ని మరింత బలోపేతం చేయాలి. 

దేశ ప్రజలంతా శాంతి, సద్భావనతో మెలగాలని కోరుకుంటున్నా.

న్యాయవ్యవస్థ పట్ల గౌరవాన్ని కాపాడేందుకు సమాజంలోని అన్ని సామాజిక-సాంస్కృతిక సంస్థలు కృషి చేస్తున్నాయి. 

గతంలో సామరస్యపూర్వక, సానుకూల వాతావరణాన్ని సృష్టించడానికి చేసిన ప్రయత్నాలను అన్ని పార్టీలు స్వాగతించాయి. 

కోర్టు తీర్పు తర్వాత సమాజంలో శాంతి నెలకొనేలా యావత్​ దేశం అంతా కలిసిమెలసి నిలబడాలి' అని పిలుపునిచ్చారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?