లక్షలు బిల్లు అయ్యిందని, ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో వైద్యం అందించేందుకు ఆసుపత్రి వర్గాలు నిరాకరిస్తున్నాయి

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం సందర్భంగా ఆమెను రక్షించబోయి తీవ్రంగా గాయపడిన అటెండర్ చంద్రయ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం చంద్రయ్య డీఆర్డీఓ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి సీరియస్ గా ఉన్నా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని చంద్రయ్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే రూ.5 లక్షలు బిల్లు అయ్యిందని, ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో వైద్యం అందించేందుకు ఆసుపత్రి వర్గాలు నిరాకరిస్తున్నాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో చంద్రయ్యకు ఏం జరుగుతుందో అని వారు ఆందోళన చెందుతున్నారు. తక్షణం ప్రభుత్వం స్పందించి చంద్రయ్యకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..