ఓ పని మనిషికి సౌదీలోని దమ్మం సిటీ కోర్టు 18 నెల జైలుతో పాటు 300 కొరడా దెబ్బల శిక్షను విధించింది

సౌదీ: 

ఆసియాకు చెందిన ఓ పని మనిషికి సౌదీలోని దమ్మం సిటీ కోర్టు 18 నెల జైలుతో పాటు 300 కొరడా దెబ్బల శిక్షను విధించింది. ఇంతకు పని మనిషి చేసిన నేరమేంటో తెలుసా?

తనను బాధపెడుతున్నారని యజమాని కుటుంబం కోసం చేసే ఆహార పదార్థాలలో తన మూత్రం కలిపింది. పని మనిషి చేసిన ఈ నిర్వాకానికి గాను న్యాయస్థానం ఈమేరకు శిక్షను ఖరారు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...

ఆసియాకు చెందిన ఓ మహిళ స్థానికంగా ఉండే ఒక కుటుంబం వద్ద గత కొంతకాలంగా ఇంటి పనులు చేస్తోంది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఆమెను బాధపెట్టడం తట్టుకోలేని మహిళ వారిపై కక్ష పెంచుకుంది. తనను వేధిస్తున్న ఆ ఫ్యామిలీపై పగతీర్చుకోవాలనుకుందామె. అప్పటి నుంచి ఓ బాటిల్‌లో పట్టిపెట్టిన తన మూత్రాన్ని కుటుంబం కోసం చేసే వంటకాల్లో కలిపేది. అయితే కొంతకాలంగా ఆహారపదార్థాల నుంచి తినేపటప్పుడు ఓ రకమైన వాసన వస్తుండడం గమనించారు కుటుంబ సభ్యులు.

ఈ విషయమై పని మనిషిని అడిగితే తనకేమి తెలియదని చెప్పింది. కాని ఒకరోజు కిచెన్‌లో ఓ బాటిల్ నిండా పసుపు రంగులో ఉన్న ద్రవ పదార్థాన్ని గుర్తించింది ఇంటి యజమానురాలు. దాంతో పని మనిషిని నిలదీశారు. గట్టిగా అడగడంతో అది తన యూరిన్ అని చెప్పింది. గత కొన్ని రోజులు తాను చేస్తున్న వంటకాల్లో దానిని కలుపుతున్నట్లు ఒప్పుకుంది.

దీంతో యజమాని వెంటనే ఆమెపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా పని మనిషిని దమ్మం సిటీ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానంలో నిందితురాలు తన నేరాన్ని అంగీకరించింది. గత కొన్నిరోజులుగా కుటుంబ సభ్యులు తనను బాధపెడుతుండడంతో వారు తినే ఆహారం, సూప్, టీలలో తన మూత్రం కలిపినట్టు ఒప్పుకుంది. దీంతో న్యాయస్థానం ఆమెకు 18 నెల జైలు, 300 కొరడా దెబ్బల శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అలాగే శిక్షకాలం పూర్తైన వెంటనే నగరాన్ని విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది.  

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..