ఉద్యోగాల భర్తీకి ఆదివారం నుంచి వచ్చే ఆదివారం వరకూ

* అరగంట ముందుగా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి
* రేప‌టి నుంచి సచివాలయం ఉద్యోగాలకు పరీక్షలు
* తొలిరోజు 12.54 లక్షల మంది హాజరు
* 1.26 లక్షల పోస్టులకు 21.68 లక్షల మంది పోటీ
* మొత్తం 5,134 పరీక్షా కేంద్రాలు
* సుదూర ప్రాంతాల అభ్యర్థులకు ఉచితంగా భోజనం, తాత్కాలిక వసతి

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, పట్టణాల్లో వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీకి ఆదివారం నుంచి వచ్చే ఆదివారం వరకూ రాత పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 1.26 లక్షల ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఈ పరీక్షలకు 21,69,814 మంది హాజరు కానున్నారు. మొత్తం 36,449 కార్యదర్శుల పోస్టులకు 12,54,071 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సెప్టెంబరు ఒకటో తేదీన వీరికి రాత పరీక్ష ఉంటుంది. పంచాయతీ కార్యదర్శి, వార్డు ప్రణాళిక కార్యదర్శి, విద్యా డేటా ప్రాసెసింగ్‌ కార్యదర్శి పోస్టులకు ఎక్కువమంది పోటీ పడటం, సెప్టెంబరు ఒకటో తేదీ ఆదివారం తొలిరోజు 12.54 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానునుండడంతో అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి భోజనం, తాత్కాలిక వసతి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5,134 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మండల కేంద్రాల్లోనూ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. డిగ్రీ కనీస అర్హత ప్రాతిపదికన దరఖాస్తులను ఆహ్వానించగా ఈ పోస్టులకు ఇంజినీరింగ్‌, పిజి చదివిన వారు కూడా దరఖాస్తు చేయడంతో పోటీ పెరిగింది. ఒకేసారి పెద్ద సంఖ్యలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వడంతో రాష్ట్రంలోని నిరుద్యోగులంతా రాత పరీక్షలకు సిద్ధమయ్యారు. 

నిబంధనలు :
* అభ్యర్థులు తప్పనిసరిగా ఏదో ఒక గుర్తింపు కార్డు తెచ్చుకోవాలి.
* ఆధార్‌, పాన్‌, ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు ఉన్నాచాలు.
* హాల్‌ టికెట్‌పై అభ్యర్థి ఫొటో స్పష్టంగా కనిపించకపోతే గజిటెడ్‌ అధికారి నిర్థారించిన మూడు పాస్‌ఫొటో సైజ్‌ ఫొటోలను తీసుకురావాలి. 
* బ్లాక్‌ లేదా బ్లూ బాల్‌ పాయింట్‌ పెన్నులను మాత్రమే ఒఎంఆర్‌ షీట్‌పై బబ్లింగ్‌కు వినియోగించాలి.
* అభ్యర్థులు సిరీస్‌ కోడ్‌తోపాటు ఇన్విజిలేటర్‌ సంతకం పెట్టించుకోవాలి. 
* పరీక్ష హాల్లోకి అరగంట ముందుగా హాజరు కావాలి. 
* ఉదయం పది గంటల తర్వాత, మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు.
* నిమిషం ఆలస్యమైనా అంగీకరించరు.
* పరీక్ష పూర్తవకుండా నిమిషం ముందు కూడా బయటకు పంపరు.
* పరీక్ష ముగిసేలోగా బయటకు వెళ్లిన వారి ప్రశ్న, జవాబు పత్రాలు పరిగణనలోకి తీసుకోరు.
* మొబైల్‌ ఫోన్స్‌, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువుల్ని అంగీకరించరు.
* అభ్యర్థులు పరీక్ష హాల్లో దుశ్చర్యలకు పాల్పడకూడదు. 
* పరీక్ష ముగిసిన తర్వాత అభ్యర్థులు వారితోపాటు ప్రశ్నాపత్రం, ఒఎంఆర్‌ షీటు నకలు కాపీ తీసుకెళ్లవచ్చు.
* ఒరిజనల్‌ ఒఎంఆర్‌ షీట్‌ తీసుకెళ్లకూడదు. తీసుకెళ్లిన వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటారు...

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..