రివ్యూ: ‘మన్మథుడు 2’.. లేటు వయసులో నాగార్జున ఘాటు రొమాన్స్..

నటీనటులు: నాగార్జున అక్కినేని, రకుల్, వెన్నెల కిషోర్, సమంత, కీర్తి సురేష్, లక్ష్మి, ఝాన్సీ తదితరులు
స్క్రీన్ ప్లే, దర్శకుడు: రాహుల్ రవీంద్రన్
నిర్మాతలు: నాగార్జున, కిరణ్ పి, వయాకామ్ 18
సంగీతం: చేతన్ భరద్వాజ్

కథ:

సాంబ శివ రావు ఉరఫ్ స్యామ్ (నాగార్జున) కుటుంబం అంతా 1928లోనే పోర్చుగల్ వచ్చి సెటిల్ అవుతారు. అక్కడే మూడు తరాల వాళ్లుంటారు. ఇక స్యామ్‌కు పెళ్లి అంటే దూరంగా ఉంటాడు కానీ అమ్మాయిలకు మాత్రం దగ్గరగా ఉంటాడు. వయసు దాటిపోతున్నా కూడా పెళ్లి చేసుకోడు. మరోవైపు ఇంట్లో వాళ్లు ఆయనకు పెళ్లి చేయాలనుకుంటారు. దాంతో ఇంటి వాళ్ల పోరు తప్పించుకోడానికి అవంతిక (రకుల్)ను అద్దె ప్రియురాలుగా ఇంటికి తెస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది.. నిజంగానే అవంతిక, స్యామ్ ప్రేమలో పడ్డారా అనేది అసలు కథ..

కథనం:

నాగార్జున సినిమా అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలకు ప్రత్యేకంగా ఫాలోయింగ్ కూడా ఉంటుంది. అందులోనూ మన్మథుడు లాంటి సినిమాలు చేయాలంటే తెలుగులో ఆయనకు మాత్రమే సాధ్యం. అందుకే 60 ఏళ్ల వయసులో కూడా మరోసారి ఇలాంటి ప్రయత్నం చేసాడు నాగ్. వయసుకు తగ్గ కథ అంటూ ఏకంగా లిప్ లాక్ సన్నివేశాలతో పాటు హాట్ సీన్స్ కూడా చేసాడు నాగార్జున. ఇది చూడ్డానికి డైజెస్ట్ చేసుకోడానికి కాస్త కష్టంగా అనిపించినా స్క్రీన్ పై మాత్రం మనకు కొత్త నాగార్జున కనిపిస్తాడు. కథ విషయానికి వస్తే చాలా రొటీన్ స్టోరీ.. 90 ఏళ్లుగా పోర్చుగల్లో స్థిరపడిపోయిన ఓ కుటుంబం.. అందులో మోస్ట్ ఎలిజిబుల్ అండ్ ఏజ్ అయిపోయిన బ్యాచలర్ నాగార్జున. ఆయనకు పెళ్లి చేయడానికి ఇంటి వాళ్లు తంటాలు పడుతుంటారు. అలాటి సమయంలో ఆయన ఓ అద్దె ప్రేయసిని తీసుకొస్తాడు. ఇదే కథ.. ఆ తర్వాత అంతా రొటీన్ స్క్రీన్ ప్లే. రాహుల్ రవీంద్రన్ ఇందులో కొత్తగా చూపించడానికి కూడా ఏం లేదు. ఫస్టాఫ్ అంతా హీరో ఇంట్రడక్షన్.. ఆయన రాసలీలలతోనే సరిపోతుంది. ప్రేమలో పడటం కాదు.. ప్రేమను పంచడం అనే కాన్సెప్టుతో వెళ్లిపోతుంటాడు హీరో. అలాంటి వాడి లైఫ్‌లోకి నిజంగానే ప్రేమను పంచే అమ్మాయి వస్తే ఆ తర్వాత ఎలా మారిపోయాడు అనేది కథ. ఎమోషనల్‌గా ఉండాల్సిన కథ కాస్తా చాలా వరకు కంగాళి అయిపోయింది. ఏం చెబుతున్నాడో.. ఎందుకు ఏ సన్నివేశం వస్తుందో చెప్పడం కూడా కష్టమే. అలా స్క్రీన్ ప్లే మిక్స్ అయిపోయింది. నాగార్జున లాంటి హీరో నుంచి ఈ వయసులో ఇలాంటి కథ ఊహించడం కాస్త కష్టమే. ట్రెండీ లవ్ స్టోరీ చెప్పాలని ప్రయత్నించినా కూడా అది కాస్తా గాడితప్పినట్లు అనిపించింది. దాంతో మన్మథుడు 2 ప్రేక్షకులకు నచ్చే సినిమాగా మాత్రం మారడం కష్టం.

నటీనటులు:

నాగార్జున అందాన్ని ఏమని పొగడాలి.. ఏ మాటలతో చెప్పాలి. ఆయన గ్లామర్ మెయింటనేన్స్‌కు ఫిదా అయిపోవచ్చు. ఇలాంటి పాత్ర మాత్రం చాలా కొత్తగా ఉంది. ఇప్పటి వరకు ఈయన చేయని రోల్ ఇది. ఇందులో నాగ్ కారెక్టర్ కూడా కొత్తగా అనిపించింది. నటుడిగా తన పని తాను చేసాడు కానీ కథలో మాత్రం కొత్తదనం లేకపోవడం గమనార్హం. రకుల్ చాలా గ్లామర్ ఒలకబోసింది. నాగార్జునకు జోడీగా సరిపోయింది. కీర్తి సురేష్, సమంత కొన్ని నిమిషాల పాటు కనిపించారు. వెన్నెల కిషోర్ చాలా వరకు నవ్వించే బాధ్యత తీసుకున్నాడు. లక్ష్మి, ఝాన్సీ లాంటి వాళ్లు తమ పాత్రల మేర కనిపించారు. రావు రమేష్ అలరించాడు.

టెక్నికల్ టీం:

చేతన్ భరద్వాజ్ స్టార్ హీరోలకు సరిపోయే సంగీత దర్శకుడు కాదేమో అనిపించింది. మన్మథుడు సినిమాకు మరిచిపోలేని సంగీతం అందించాడు దేవీ. కానీ ఇప్పుడు చేతన్ అది పూర్తి చేయలేకపోయాడు. సినిమాటోగ్రఫర్ పనితీరు బాగుంది. పోర్చుగల్ అందాలను బాగా క్యాప్చర్ చేసాడు. ఎడిటింగ్ వీక్ అనిపించింది. ఈ సినిమాలో చాలా వరకు బోరింగ్ సన్నివేశాలు ఉన్నాయి. అలాగే సెన్సార్ సీన్స్ కూడా కనిపించాయి. దర్శకుడిగా రాహుల్ ఎంచుకున్న కథ సరిగ్గా లేదేమో అనిపించింది. చిలసౌ తన సొంత కథ.. దాన్ని తనకు నచ్చినట్లుగా తీసుకున్నాడు. కానీ ఇప్పుడు అరువు తెచ్చుకున్న కథ.. అది కాస్తా ఇక్కడ వాళ్లకు నచ్చడం కష్టమే. దాన్ని తెరకెక్కించే ప్రయత్నాల్లో గాడితప్పాడు ఈ దర్శకుడు.

రేటింగ్: 3/5

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..