తిరుమలలోని సన్నిధానం విశ్రాంతి భవనంలో దొంగతనానికి పాల్పడిన దొంగను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

తిరుపతి : 

గత నెల తిరుమలలోని సన్నిధానం విశ్రాంతి భవనంలో దొంగతనానికి పాల్పడిన దొంగను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. తిరుపతిలోని గ్రూప్‌ థియేటర్స్‌ వద్ద నిందితుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రసాద్‌ రెడ్డి గా గుర్తించారు. అతని వద్ద నుండి 107 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా తిరుమలలో పలు దొంగతనాలకు పాల్పడిన నిందితుడు, జైలు శిక్షను కూడా అనుభవించాడని పోలీసులు తెలిపారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?