ఏలేశ్వరంలో అదృశ్యమైన బాలుడు తోట ధనుష్ ఆచూకీ
తూర్పు గోదావరి:
ఏలేశ్వరంలో అదృశ్యమైన బాలుడు తోట ధనుష్ ఆచూకీని పోలీసులు గుర్తించారు. నిన్న ఎర్రవరం నుంచి ఏలేశ్వరంలోని పాఠశాలకు వెళ్లి ధనుష్ తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఏలేశ్వరం డిగ్రీ కాలేజీ దగ్గర బాలుడు తీవ్ర గాయాలతో పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. కొన ఊపిరితో ఉన్న బాలుడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. సమీప బంధువే బాలుడిని కిడ్నాప్ చేసి వదిలేసినట్టు సమాచారం.
Comments
Post a Comment