‘ఉన్నావ్’ అత్యాచార ఘటన కేసులో ఢిల్లీ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.

న్యూఢిల్లీ: 

‘ఉన్నావ్’ అత్యాచార ఘటన కేసులో ఢిల్లీ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.

అత్యాచార నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఉన్నావ్ అత్యాచార ఘటన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌తో పాటు అతని అనుచరుడు శశి సింగ్‌పై కూడా కేసులు నమోదు చేసింది.

కుల్దీప్ సింగ్‌పై ఫోక్సో చట్టంలోని 3, 4 సెక్షన్లతో పాటు ఐపీసీ 120బీ, 363, 366, 109, 376(ఐ) కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించింది.

బాధిత బాలికను కిడ్నాప్ చేసిన నేరానికి శశి సింగ్‌పై కూడా కేసు నమోదు చేసింది.

నిందితులపై నమోదు చేసిన కేసుల విచారణను 45 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించింది.

బాధిత బాలికపై బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్‌తో పాటు పలువురు అత్యాచారానికి పాల్పడారని ఆరోపణలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో విచారణ ప్రారంభించిన సీబీఐ.. 10 మందిని నిందితులుగా గుర్తించింది.

ఉన్నావ్ కేసును స్వీకరించిన సుప్రీంకోర్టు ఆ కేసును ఢిల్లీ కోర్టుకు బదిలీ చేసింది.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..