కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది

శ్రీశైలం:

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. దాదాపు 3,59,867 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. శ్రీశైలం ప్రస్తుత నీటి మట్టం 879.30 అడుగులకు చేరింది.దీంతో సాయంత్రం 5 గంటలకు ఏపీ జలవనరుల శాఖమంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మూడు గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. జలాశయ పూర్తిస్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలకుగానూ ప్రస్తుత నీటి నిల్వ 184.27 టీఎంసీలుగా నమోదైంది.కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 800 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 42,378 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 32,272 క్యూసెక్కులు, హంద్రీనీవా ప్రాజెక్టుకు 1351 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 20,000 క్యూసెక్కులు, ముచ్చుమర్రి నుంచి కేసీ కెనాల్ కు 735 క్యూసెక్కులు నీటిని వదులుతున్నారు.
మరోవైపు కృష్ణా నదిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. ఆల్మట్టి పూర్తిస్థాయి సామర్థ్యం 129.72 టీఎంసీలుకాగా..ప్రస్తుతం 88.68 టీఎంసీల నీటి నిల్వ ఉంది.3,49,526 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా..అంత కంటే ఎక్కువగా 3,64,052 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. నారాయణపూర్ జలాశయ పూర్తిస్థాయి సామర్థ్యం 37.64 టీఎంసీలకుగానూ..ప్రస్తుతం 20.04 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది. నారాయణపూర్ జలాశయానికి 4,02,951 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా..మొత్తం 4,18,637 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా..ప్రస్తుత నీటి నిల్వ 6.05 టీఎంసీలు
గా ఉంది. జూరాలకు ఇన్ ఫ్లో 3,69,484 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3,74,600 క్యూసెక్కులగా నమోదైంది.
మరోవైపు తుంగభద్ర జలాశయానికి కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. తుంగభద్ర పూర్తిస్థాయి సామర్థ్యం 100.86 టీఎంసీలు కాగా..ప్రస్తుతం నీటి నిల్వ 60.72 టీఎంసీలుగా ఉంది. తుంగభద్రకు ఇన్ ఫ్లో 1,42,114 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 4,089 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312.05 టీఎంసీలకు గానూ.. ప్రస్తుత నీటి నిల్వ 142.08 టీఎంసీలుగా ఉంది. నాగార్జునసాగర్ కు ఇన్ ఫ్లో 64,136 క్యూసెక్కులు  వస్తుండగా..9,271 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..