రౌడీ షీటర్ల మేళా

రౌడీ షీటర్ల మేళా ... తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ టైమ్ ..వరంగల్ పోలీసుల సెన్సేషన్

133 మంది రౌడీ షీటర్లపై రౌడీషీట్‌ ఎత్తివేత

  

వరంగల్ : సహజంగా ఎక్కడైనా కార్ మేళాలు, బైక్ మేళాలు, జాబ్ మేళాలు వింటుంటాం.. కానీ రౌడీషీటర్ల మేళా ఎక్కడైనా విన్నారా? కచ్చితంగా విని ఉండరు..

అయితే ఇప్పుడు వరంగల్ పోలీసులు తీసుకున్న వినూత్న నిర్ణయం రౌడీషీటర్ల మేళా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అసలీ రౌడీషీటర్ల మేళ ఎందుకు నిర్వహించారు... దీని ఉద్దేశం ఏంటి.. వరంగల్ కమిషనరేట్ పోలీసుల నిర్ణయం వెనుక అసలు కథ ఏంటి?

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో సత్ప్రవర్తన కలిగిన ప్రశాంతవంతమైన జీవితం గడుపుతున్న 133 మంది రౌడీ షీటర్లపై రౌడీషీట్‌ తొలగించినట్లుగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ప్రకటించారు.

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో సత్ప్రవర్తన కలిగిన వున్నవారిపై రౌడీ షీట్ల తొలగించపు మేళా వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయములోని రాణి రుద్రమదేవి ప్రాంగణంలో నిర్వహించారు.

ఇప్పటి వరకు వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని పోలీస్‌ స్టేషన్లనందు 783 మందిపై రౌడీ షీట్లను తెరిచారు .

ఇందులో ప్రశాంవంతమైన జీవితంతో పాటు ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలపాలలో పాల్గోకుండా సాధారణ జీవితాన్ని గడుపుతున్న రౌడీ షీటర్లను గుర్తించి వారిపై రౌడీ షీట్‌ తొలగించేందుకుగాను తొలిసారివరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో రౌడీషీట్ల తోలగింపు మేళాను ఏర్పాటు చేశారు .

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..