కెమికల్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి ...

ముంబై :

మహారాష్ట్రలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

ధూలే జిల్లా సిర్‌పూర్ గ్రామంలోని కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడ్డాయి.

సిలిండర్ పేలుడుతో మంటలు ఎగిసిపడ్డాయని అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు చనిపోయారు.

పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారుుల చెప్తున్నారు.

అగ్నిప్రమాద సమాచారంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు.

ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

మంటలో ఉన్న ఇతర కార్మికులను సిబ్బంది కాపాడారు. సిలింబర్ పేలుడుతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.

దీంతో అక్కడికక్కడే 8 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు.

వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు.

ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.

సిలింబర్ పేలుడుకు గల కారణం తెలియరాలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అన్వేషిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు.

కంపెనీ సరైన భద్రతా చర్యలు తీసుకుందా ? లేదా అనే అంశంపై కూడా ఆరా తీస్తున్నామని పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..