దేవిపట్నం కాఫర్‌ డ్యాం పై చిక్కుకుపోయిన 31 మంది జాలర్లు

 తూర్పు గోదావరి : 

దేవిపట్నం కాఫర్‌ డ్యాం పై చిక్కుకుపోయిన 31 మంది జాలర్లను సురక్షితంగా తీసుకొచ్చేందుకు శుక్రవారం ఉదయం అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. పడవలు, బోట్ల ద్వారా జాలర్ల వద్దకు వెళ్లేందుకు దారి లేకపోవడంతో, నేవీ హెలికాప్టర్‌ పై జాలర్లను సురక్షితంగా తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సహాయక చర్యల విషయమై దేవిపట్నం ఎపి ఎస్‌డిఆర్‌ఎఫ్‌ లతో రంపచోడవరం సిఐ మాట్లాడుతున్నారు. దేవిపట్నం విలీన మండలం కూనవారం నుండి జాలర్లు వస్తున్నారని, వీళ్ళంతా ధవళేశ్వరానికి చెందిన జాలర్లుగా అధికారులు తెలిపారు. కాఫర్‌ డ్యాం పై చిక్కుకున్న జాలర్లలో 19 మంది మగవారు, 12 మంది ఆడవారు ఉన్నారని చెప్పారు. శివాజీ, రాజు, ధనరాజు, శివాజీ, జనార్ధన, యెల్లది, 
కామేశ్వరరావు, శ్రీకాంత్‌, చిన్ని, అనిల్‌, హరిత, దేవి, అచ్చమ్మ, శివాజీ, లక్మి, దుర్గమ్మ, లక్మి, సాగర్‌, దుర్గమ్మ లుగా కొందరి పేర్లను వివరించారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..