కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర ప్రజలకు కుచ్చుటోపి

బెంగళూరు:

బెంగళూరు నగరంతో సహ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర ప్రజలకు కుచ్చుటోపి పెట్టిన రూ. వేల కోట్ల ఐఎంఏ స్కాం కేసు విచారణను ప్రత్యేక బృందం పోలీసులు (ఎస్ఐటీ) అధికారులు వేగవంతం చేశారు. ఐఎంఏ స్కాం ప్రధాన నిందితుడు మన్సూర్ ఆలీ ఖాన్ కు చెందిన నగదు, బంగారంను కోలారు జిల్లాలోని ఓ ఇటుకల ఫ్యాక్టరీలో స్వాధీనం చేసుకున్నారు.

ఐఎంఏ స్కాం ప్రధాన నిందితుడు మన్సూర్ ఆలీ ఖాన్ అనుచరుడు ఖమరుల్లా జమాల్ ను ఎస్ఐటీ అధికారులు విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నారు. ఖమరుల్లా జమాల్ తాను నాటు వైద్యుడు అంటూ అందర్ని నమ్మించి తిరుగుతున్నాడు. అయితే జమాల్ నాటు వైద్యుడు కాదని అధికారులు అంటున్నారు.
మంత్రాలు వేస్తానని, మీ పని అయిపోతుందని జమాల్ ప్రజలను బయపెడుతున్నాడని ఎస్ఐటీ అధికారులు చెప్పారు. కోలారు జిల్లాలోని మాలూరులో ఖమరుల్లా జమాల్ భూమి కొనుగోలు చేసి సిమెంట్ ఇటుకలు తయారు చేసే ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నాడు.

పేరుకు మాత్రమే ఇది సిమెంట్ ఇటుకల ఫ్యాక్టరీ. లోపల ఐఎంఏ యజమాని మన్సూర్ ఆలీ ఖాన్ కు చెందిన స్కాం నగదు, బంగారం ఇక్కడ రహస్యంగా దాచి పెడుతున్నారని ఎస్ఐటీ అధికారులు గుర్తించారు. కచ్చితమైన సమాచారం తెలుసుకున్న అధికారులు సిమెంట్ ఫ్యాక్టరీలో బంగారం, నగదు స్వాధీనం చేసుకుని జమాల్ ను అరెస్టు చేశారు.

మన్సూర్ ఆలీ ఖాన్ బెంగళూరులో కాకుండా అనేక జిల్లాల్లో ఆస్తులు కొనుగోలు చేశాడని అధికారులు గుర్తించారు. కోలారు, హాసన్ జిల్లాల్లో ఇంటి స్థలాలు కొనుగోలు చేశాడని గుర్తించిన ఎస్ఐటీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని జిల్లాధికారులకు అప్పగించారు.

బెంగళూరులోని శాంతి నగరలోని ఓ కట్టడంలో 300 బంగారం బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐఎంఏ స్కాం కేసును సీబీఐకి అప్పగిస్తామని కర్ణాటక ప్రభుత్వం హైకోర్టుకు చెప్పింది. ఇదే వారంలో ప్రభుత్వం అధికారికంగా కేసు సీబీఐకి అప్పగించే అవకాశం ఉందని తెలిసింది.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..