ఏఎన్ఎంల ఉద్యోగాలపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో ఏఎన్ఎం పోస్టుల భర్తీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్...

వైద్యారోగ్య శాఖలో ఇప్పటికే పని చేస్తున్న ఏఎన్ఎంలను ఆందోళనకు గురిచేసింది. తమకు కొనసాగిస్తారా? లేక ఇంటికి పంపించేస్తారా? అనే ప్రశ్నలకు కారణమైంది.

అయితే, వైద్యారోగ్య శాఖలో ఇప్పటికే పని చేస్తున్న ఏఎన్ఎంలకు ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసింది ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ. వారికి ఎటువంటి ఇబ్బంది లేదని తెలిపింది.

ప్రస్తుతం పని చేస్తున్న ఏఎన్ఎంలకు ఉద్యోగ భద్రత ఉంటుందని.. రాత పరీక్షలో అర్హత పొందనివారిని కూడా యథావిథిగా కొనసాగిస్తామని..

రాత పరీక్షలో అర్హత పొందిన ఏఎన్ఎంల వేతనం విషయంలో ఉన్న అంతరాన్ని ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోనున్నట్టు వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది.

శాశ్వత ప్రాతిపదికన ఏఎన్ఎం పోస్టులు భర్తీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్ను ప్రస్తుతం పని చేస్తున్న 7,418 ఏఎన్ఎంలు వినియోగించుకోవచ్చని సూచించిన ప్రభుత్వం..

ఏఎన్ఎంగా పని చేస్తూ పరీక్షకు హాజరయ్యే వారికి పది శాతం మార్కులు వెయిటేజీ ఇస్తున్నామని ప్రకటించింది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది