భారత స్టార్ పేసర్​ జస్​ప్రీత్​ బుమ్రా.. తను టీనేజ్​లో ఉన్నప్పటి​ ఫొటోను ట్విట్టర్​లో పంచుకొని, ఆసక్తికర వ్యాఖ్యను జోడించాడు

భారత స్టార్ పేసర్​ జస్​ప్రీత్​ బుమ్రా.. తను టీనేజ్​లో ఉన్నప్పటి​ ఫొటోను ట్విట్టర్​లో పంచుకొని, ఆసక్తికర వ్యాఖ్యను జోడించాడు. ప్రస్తుతం వన్డేల్లో టాప్ బౌలర్​గా కొనసాగుతున్నాడు బుమ్రా.

కెరీర్​ ప్రారంభంలో తొలిసారిగా అవార్డు తీసుకున్నప్పటి ఫొటో, ఇటీవలే అవార్డు తీసుకుంటున్న మరో ఫొటో రెండింటినీ కలిపి పోస్ట్ చేశాడీ క్రికెటర్. అక్కడి నుంచి మొదలై, ఇక్కడ వరకు వచ్చానని ఓ వ్యాఖ్య జోడించాడు

25 ఏళ్ల ఈ క్రికెటర్​... చాలా తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించాడు. భారత క్రికెట్​ జట్టు తరఫున అద్భుతంగా రాణిస్తున్న బుమ్రా... ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్​లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

బుమ్రాకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్న ఆ సమయంలో కష్టాలను ఎదురొడ్డి నిలిచానని ఒకానొక సందర్భంలో చెప్పాడీ బౌలర్. చిన్నతనంలో ఎదురైన పరిస్థితులు తనను మరింత దృఢంగా తయారు చేశాయని అన్నాడు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..