కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరాన్ని ప్రశ్నించి, అరెస్టు చేసేందుకు ప్రత్యేక కోర్టు ఈడీకి అనుమతి

న్యూఢిల్లీ

ఐఎన్‌ఎక్స్‌ మీడియా మనీలాండరింగ్‌ కేసులో కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరాన్ని ప్రశ్నించి, అరెస్టు చేసేందుకు ప్రత్యేక కోర్టు ఈడీకి అనుమతి ఇచ్చింది. 

ప్రస్తుతం తిహార్‌ జైల్లో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న ఆయన్ని ఈడీ అధికారులు బుధవారం ప్రశ్నించి, అరెస్టు చేయనున్నారు. 

వాస్తవానికి సీబీఐ పెట్టిన కేసులో గత 55 రోజులుగా తిహార్‌ జైల్లో ఉన్న చిదంబరం కస్టడీ గురువారం ముగియనున్నది. 

చిదంబరాన్ని ప్రశ్నించాక, అవసరమైతే అరెస్టు చేయడానికి జడ్జి అజయ్‌ కుమార్‌ అనుమతి ఇచ్చారు. 

కాగా, ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో బెయిలివ్వాల్సిందిగా కోరుతూ చిదంబరం మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..