లావాదేవీలను మరింత సులభతరం చేస్తూ ఎస్​బీఐ కార్డ్ నూతన ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది.

లావాదేవీలను మరింత సులభతరం చేస్తూ ఎస్​బీఐ కార్డ్ నూతన ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. కార్డ్​, పిన్ అవసరం లేకుండానే మొబైల్ యాప్​ ద్వారా సులభంగా చెల్లింపులు జరిపేందుకు 'ఎస్​బీఐ కార్డ్​ పే' సేవలను నేడు ప్రారంభించింది.

మొబైల్​ ఫోన్​ను ఉపయోగించి కాంటాక్ట్ ​లెస్ చెల్లింపులు చేసే.. 'ఎస్​బీఐ కార్డ్​ పే' సేవలను ప్రారంభించింది ఎస్​బీఐ కార్డ్. ఈ కొత్త ఫీచర్​తో కాంటాక్ట్​ లెస్ పేమెంట్​లను స్వీకరించే పాయింట్​ ఆఫ్ సేల్​ను ఉపయోగించవచ్చని పేర్కొంది. క్రెడిట్ కార్డ్​ను భౌతికంగా వినియోగించే అవసరం లేకుండా కేవలం ఒక్క క్లిక్​తో చెల్లింపులు చేయొచ్చని తెలిపింది.

ఎలా వాడాలంటే...

ఎస్​బీఐ కార్డ్​ వినియోగదారులు ఈ సదుపాయాన్ని వినియోగించేందుకు.. ముందుగా ఎస్​బీఐ కార్డ్​ మొబైల్​ యాప్​ను అప్డేట్​ చేసుకోవాలి. తర్వాత వన్​ టైం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. ఇక పాయింట్​ ఆఫ్​ సేల్ డివైజ్​కు దగ్గరలో స్మార్ట్​ ఫోన్​ను ఉంచి సులభంగా చెల్లింపులు జరపొచ్చు అని ఎస్​బీఐ కార్డ్​ ఎండీ, సీఈఓ హర్​ దయాల్ ప్రసాద్ తెలిపారు.

డెబిట్, క్రెడిట్ కార్డుల సంస్థ 'వీసా' కార్డుపై ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆండ్రాయిడ్​ స్మార్ట్​ ఫోన్లలో ఈ ఫీచర్​ను వినియోగించుకోవచ్చు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..