మీసం తిప్పిన అధికారిపై వర్ల రామయ్య ఫిర్యాదు

తాడేపల్లి

మీసం తిప్పిన అధికారిపై వర్ల రామయ్య ఫిర్యాదు

రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు తనపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 తనను అసభ్యకరంగా దూషించిన శ్రీనివాసరావుపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద ఫిర్యాదు చేశారు. 

పోలీస్ ప్రధాన కార్యాలయం ఆవరణలో మీడియా సమావేశం నిర్వహించే అధికారం శ్రీనివాసరావుకి లేదన్న వర్ల... వైకాపా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలు కొంతమంది పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అప్పుడు శ్రీనివాసరావు ఏమయ్యాడు ప్రశ్నించారు.

 తనకు పోలీసులంటే గౌరవం ఉందని 20 సంవత్సరాలు ఆ శాఖలో పనిచేశానని గుర్తు చేశారు. పోలీసులపై ఎప్పుడు తాను విమర్శలు చేయలేదని చెప్పారు


సిట్ నోటీస్ లపై
౼౼౼౼౼౼౼౼
వైఎస్‌ వివేకా హత్యకేసులో సిట్‌ నుంచి తనకింకా ఎలాంటి నోటీసులు అందలేదని వర్లరామయ్య తెలిపారు. పోలీసులు లక్ష్యంగా చేసుకుని ఇచ్చారోలేదో నోటీసులు చూశాకే స్పందిస్తానని ఆయన అన్నారు

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..