భారత్​-పాక్​ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నడుమ నియంత్రణ రేఖను సందర్శించారు పాక్​ ఆర్మీ చీఫ్​

భారత్​-పాక్​ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నడుమ నియంత్రణ రేఖను సందర్శించారు పాక్​ ఆర్మీ చీఫ్​ జనరల్​ జావేద్​ బజ్వా. అక్కడి భద్రతా పరిస్థితుల గురించి పాక్​ సైనికులను అడిగి తెలుసుకున్నారు. కశ్మీర్​లను ఒంటరిగా విడిచిపెట్టబోమని ఉద్ఘాటించారు.

జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు అనంతరం.. భారత్​-పాక్​ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో పాకిస్థాన్​ ఆర్మీ చీఫ్​ జనరల్​ జావేద్​​ బజ్వా.. నియంత్రణ రేఖను సందర్శించారు. పాక్​ దళాలను కలుసుకొని భద్రతా పరమైన పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.

'నియంత్రణ రేఖ వద్ద సైనికులను పాక్​ ఆర్మీ చీఫ్​ కలుసుకున్నారు. అక్కడి పరిస్థితుల గురించి సమీక్షించారు.'

- పాక్​ సైన్యం

కశ్మీరీలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా విడిచిపెట్టబోమని బజ్వా పునరుద్ఘాటించారు. కశ్మీర్ ప్రజల కోసం ఎంత దూరమైనా వెళతామని తెలిపారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..