మందు బాబులకు శుభవార్త

హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం సిండికేట్లను నిలువరించడానికి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. నవంబర్1, 2019 నుంచి మొదలయ్యే మద్యం షాపుల్లో క్రయ విక్రయాల కోసం ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేయనుంది. ఏ 4 మద్యం షాపుల టెండర్ల ప్రక్రియలో సిండికేట్‌గా ఏర్పడేందుకు దరఖాస్తుదారులను కొంతమంది కాంట్రాక్టర్లు బెదిరిస్తున్నారు. ఎక్సైజ్‌శాఖ దృష్టికి ఫిర్యాదులు రావడంతో ఆ శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. మద్యం సిండికేట్ల రూపంలో ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా అనైతిక మార్గాల్లో మద్యం వ్యాపారం చేసేవాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లైసెన్స్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే తెలంగాణ ఎక్సైజ్ చట్టం 36బీ, 41ల ప్రకారం కఠిన చర్యలు తీసుకోనున్నారు.
ఎంఆర్‌పీ కంటే ఎక్కువ రేట్లకు మద్యం అమ్మితే చట్ట ప్రకారం 6 నెలల నుంచి రెండేళ్ల వరకు జైలుశిక్ష, రూ.వెయ్యి రూపాయల జరిమానా విధించనున్నారు. ఎక్సైజ్‌శాఖ తరఫున మరో రూ.2 నుంచి 3లక్షల అపరాధ రుసుము కట్టేలా నిబంధనలు రూపొందించారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..